నిన్నటి ప్రశ్నతో ఎనిమిది ప్రశ్నలు పూర్తయినాయి. ఇక ఒకటొకటిగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోవలసిన అవసరం. ఈ సందర్భంగా, yogam.org/Blog అనే వెబ్సైటు ద్వారా నడపబడే 'యోగ అవగాహన వేదిక' అనే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం, అందులో కార్యక్రమ నిర్వాహక సాధనంగా వ్యవహరించే వ్యక్తి యొక్క పాత్ర, ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే యోగ మిత్రుల పాత్ర గురించి మరికొంత వివరంగా తెలియవలసిన అవసరం అని అనిపించింది.
యోగ అవగాహన వేదిక యొక్క ఉద్దేశ్యం - తరచుగా వాడే యోగ పదాల ద్వారానూ, అంతకుమించి యోగ అవగాహనకు అవకాశాన్ని కలిగించేలాంటి ఏవయినా ఇతర సాధారణ అంశాల ద్వారానూ యోగ అవగాహన కలిగించుకోవడం.
ఈ కార్యక్రమ నిర్వాహక సాధనమైన వ్యక్తి యొక్క పాత్ర - తరచుగా వాడే యోగ పదాల ద్వారానూ, అంతకుమించి యోగ అవగాహనకు అవకాశం కలిగించేలాంటి ఏవయినా ఇతర సాధారణ అంశాల ద్వారానూ మాస్టరుగారి యోగా రికార్డులలో ఉన్న యోగ విషయాలకు అనుగుణంగా సమాధానాలను వివరణలుగా ఇవ్వడం.
యోగ అవగాహన వేదికను ఉపయోగించుకునే యోగ మిత్రుల పాత్ర - యోగ సంబంధమైన తమ ప్రశ్నలను/సందేహాలను, సమాధానాలలో వాడబడే పదాల గురించి ఉత్పన్నమయే సందేహాలను/ప్రశ్నలను, ఇంకా యోగ సంబంధమని అనిపించే ఏవయినా ఇతర సాధారణ అంశాలను వెబ్సైటు ద్వారా గానీ లేదా కార్యక్రమ నిర్వాహక సాధనమైన వ్యక్తికి వాట్సప్ ద్వారా గానీ లిఖితరూపంగా వ్యక్తం చేయడం. లిఖితరూపంగా పెట్టలేనివారు కార్యక్రమ నిర్వాహక సాధనమైన వ్యక్తికి ఫోనులో మాటల ద్వారా విషయాన్ని వ్యక్తం చేయడం (నిన్నటి 8వ ప్రశ్నలో ఒక యోగ మిత్రుడు ఒక అంశాన్ని లేవనెత్తిన మాదిరిగా).
ఇక్కడ మరల కార్యక్రమ నిర్వాహక సాధనమైన వ్యక్తి యొక్క పాత్ర - యోగ మిత్రుల ద్వారా లిఖితరూపంగా వ్యక్తం చేయబడే విషయాన్ని లేదా కొందరి చేత ఫోను ద్వారా వ్యక్తం చేయబడే విషయాన్ని పరిశీలించడం. సదరు విషయం యోగ సంబంధమైనదా కాదా అని నిర్ణయించడం. అయితే, దానిని ప్రశ్న విషయంగా పరిగణనలోకి తీసుకోవడం. ఆ ప్రశ్న విషయాన్ని తీసుకుని, దాని ద్వారా యోగ అవగాహనకు వీలు కల్పించే విధంగా (నిన్నటి 8వ ప్రశ్నలో మాదిరిగా) దానికి ప్రశ్న రూపాన్ని కల్పించడం. ఉత్తరోత్తరా ఆ ప్రశ్నకు సమాధానాలను యోగ అవగాహన వేదిక ద్వారా అందించడం.
గమనిక - ఫోనులో మాట్లాడి విషయాన్ని వ్యక్తం చేసేవారికి సంబంధించి, సదరు విషయం ప్రశ్న విషయంగా తగి ఉన్నట్లయితే, మెయిలు/వాట్సప్/మెస్సేజ్ ద్వారా వార్తాలాపంతో వాళ్ళు చెప్పిన విషయం వ్రాత రూపంగా సరిపోయింది అనే వాళ్ళ అంగీకారంతో ప్రశ్న విషయానికి వ్రాత రూపం కల్పించబడుతుంది.
యోగ అవగాహన వేదిక అనే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం, అందులో కార్యక్రమ నిర్వాహక వ్యక్తి యొక్క మరియు ఇతర వ్యక్తుల పాత్ర.
-
- Posts: 1740
- Joined: Sun May 09, 2021 6:18 pm