సమాధానం నెం.034 - ప్రశ్న నెం.034 (5-7-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.034 - ప్రశ్న నెం.034 (5-7-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం".

Post by Katakam »

1) యోగ సాధకుల మానసాలలో ఉన్న "మన యోగం గొప్పది" అనే భావన ఎంతవరకు నిజం?

2) మాస్టరు యోగంలో యోగా ప్రాక్టీసు చేసే యోగ సాధకులకు ఏ ఒక్కరు మినహాయింపు కాకుండా అందరికీ ఒక గొప్ప యోగం చేస్తున్నాం అనే అనుభూతి ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మాస్టరు గారి కాలం నుండి ప్రచారంలో ఉన్న విషయాల ప్రభావం కావచ్చు లేదా అప్పటి మీడియములు లేక తదుపరి సీనియరు యోగ సాధకులు వాళ్ళ అమోఘమైన యోగ అనుభూతులను పుస్తకాలుగా వ్రాసిన వాటి ప్రభావం కావచ్చు లేదా వేరే ఏ ఇతర కారణాలు కావచ్చు, ప్రతి ఒక్క యోగ సాధకునిలో తాను ఒక గొప్ప యోగంలో సాధకుడుగా ఉన్నందుకు గర్వంగా అనిపించడం, గర్వంగా చెప్పుకోవడం సత్యదూరం కాదు.

3) "మన యోగం గొప్పది" అనేది ఎవరూ ఈషణ్మాత్రం కాదనలేని వాస్తవం. కె. కోర్సులో 2-6-1910 న ఒక సంఘటన గురించి వ్రాసిన "నా వ్రాతలను అతిక్రమించకుండేలా నా చేతికి విద్యుత్తు ప్రవహిస్తోంది. కానీ, నా పెన్ను లేఖరి నా మాస్టరు యొక్క మూలసూత్రం ఇంకా గొప్పది అనే భావసూచన ఇచ్చుకున్నాడు. దాని మూలంగా నా వ్రాత కదలిక నుండి నా పెన్సిలును నేను పైకి తీయలేకపోయాను" అనే మాటలలో యోగం యొక్క గొప్పతనాన్ని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. కానీ, ఆ సంఘటనను మాటల మధ్యన కాక మాటల వెనుకకు -అంటే ఆ సంఘటన వెనుక సూక్ష్మ స్థాయిలో ఏమి జరిగిన కారణంగా ఆ సంఘటన చోటుచేసుకుందో ఆ వెనుకకు- వెళ్ళి చూడగలిగితే, యోగం యొక్క గొప్పతనం స్పష్టంగా తెలిసే అవకాశం.

4) అలాగే, 14-11-1912 న డైరీలో "తంజావూరు జిల్లా మీడియములు అందరూ ఈ యోగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి" అని మీడియముల గురించి చెపుతూ, అందునిమిత్తమేమో అన్నట్లుగా విశ్వ విధానానికి సంబంధించినవిగా అనిపించే విశ్వ విధాన అతీతమైన ఏడు ప్రశ్నలను తెలుసుకోవలసిందిగా మీడియములకు సంధించడం జరిగింది.

5) యోగ సాధకుల మానసాలలో ఉన్న భావన వాస్తవ స్థితికి సంబంధించిందే అయినా, ఆ భావన వాళ్ళకు కలగడంలో ఉన్న వాస్తవం ఏమిటి అనేదే చెప్పుకోబోయే ప్రశ్నలోని విషయం.

6) ఆ భావనకు సంబంధించి యోగ సాధకులకు కనుపించే ఆధారాలు ఏమిటి?

7) విషయాన్ని వివరించి చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ ప్రశ్న వేయబడింది తప్ప, "మన యోగం గొప్పది" అనే భావనను బలపరిచే విధంగా ఏ ఆధారాలు/ఋజువులు కనుపించడం కేవలం అసంభవం. ఈ వాక్యానికి నిర్ధారణగా మాస్టరు గారి డైరీలో వ్రాయబడిన "చాలా కాలంగా సీ.వీ. తో సహా ఎవరికీ కూడ నీ పట్ల గౌరవం గానీ, విలువ గానీ లేదు. ఇవన్నీ బయటికి కనుపించేలా ఋజువు లేకపోవడం వల్లనే. విశ్వాసం, నమ్మకం సడలింపచేయడానికి సీ.వీ. కూడ నిన్ను పరీక్షకు గురిచేస్తోంది" అని మాస్టరు గారికి రీచింగు గురించి ఇవ్వబడిన సూచనయే ఆధారం.

8) అంతేకాదు, జరుగుతూ ఉన్నదానిని గమనించడం, జరిగిన తరువాత అవసరం ఉంటే, అవసరం మేరకు, అవసర సమయానికి తెలియడం మాత్రమే తప్ప, జరగబోయేది తెలియడం కేవలం అసంభవం అని తెలియడానికి మాస్టరు గారి డైరీలో "భవిష్య కార్యవర్తనపు సరళి జాడలు కూడ నేను సైతం కనుగొనలేకపోయాను, తన క్రియ ద్వారా ఆ వ్యూయే బయటపెట్టాలి" అని 20-6-1921 న మాస్టరు గారికి వచ్చిన డైరెక్టు సమాధానమే ఆధారం.

9) "మా యోగం గొప్పది" అని వేరేవాళ్ళకు మనం ఎందుకు సమంజసంగా వివరించలేకపోతున్నాం?

10) మన యోగం సృష్టి మొత్తానికి సంబంధించింది. ఒక సాధకునికి గమనిక పరంగా నిర్ధారణగా తెలియబడిన విషయం వేరొకరికి సమాచారం మాత్రమే అవుతుంది తప్ప, తనకు స్వయంగా తెలియనిది అంత నిర్ధారణ కానేరదు. అక్షర లక్షలు చేసేలాంటి "జనానికి వెల్లడిచేయని రహస్యాలు చాలానే ఉన్నాయి. ఒక సజీవ సాక్ష్యంగా క్రియలో కనబరచడమే తప్ప నోటి మాటల ద్వారా సంతృప్తిపరచవలసిన అవసరం మనకు లేదు" అని మాస్టరు గారి డైరీలో 20-11-1921 న ఇవ్వబడిన సూచన శిరోధార్యం. "యోగం యొక్క గొప్పతనం" మాటలలో చెప్పలేనిది, ఋజువుగా చూపించలేనిది, జరిగితీరక తప్పని లక్ష్య సిద్ధి జరిగినప్పుడు మాత్రమే తెలియదగినది. "మన యోగం గొప్పది" అని కలిగే కేవల భావన కూడ ఎన్నో జన్మల కఠోర సాధనల ఫలితమే తప్ప వేరే కాదు.
Post Reply