సమాధానం నెం.081 - ప్రశ్న నెం.081 (7-10-2021) విషయం "సృష్టి లక్ష్యం, యోగ లక్ష్యం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.081 - ప్రశ్న నెం.081 (7-10-2021) విషయం "సృష్టి లక్ష్యం, యోగ లక్ష్యం".

Post by Katakam »

1) సృష్టి లక్ష్యం అంటే ఏమిటి?

2) సృష్టి ఎందుకు జరిగింది, ఏ లక్ష్యంతో జరిగింది అనేదే సృష్టి లక్ష్యం. ఆరిజిన్ వన్ లో/ భగవత్తత్త్వంలో లేదా ఆరిజిన్ వన్ యే/ భగవత్తత్త్వమే సంకల్పంగా బయలుదేరినదే సృష్టి లక్ష్యం. ఆరిజిన్ వన్ యే లేదా మొదటి ఆదియే లేదా భగవత్తత్త్వమే ప్రప్రథమ ఉనికి లేదా ప్రప్రథమ ప్రాణ ఉనికి అయి ఉన్నందున, ఆ సంకల్పం సృష్టికి లేదా సృష్టి జరగడానికి మూలం లేదా మూల ఆధారం అయి ఉన్నందున, సృష్టికి మూలం అనేది ప్రాణం లేదా ఆరిజిన్ వన్ లేదా మొదటి ఆది లేదా భగవత్తత్త్వం అయి ఉంది, ఆ సంకల్పమే సృష్టికి లక్ష్యం లేదా సృష్టి జరగడానికి లక్ష్యం లేదా సృష్టి లక్ష్యం అయి ఉంది. అదే 'నేను ఎవరిని, నేను అది కావాలి' అనేది.

3) ముందుగా ప్రాణ ఉనికి (ఇది కేవలం మూల/ శూన్య ఉనికి అని తెలియనగును) నుండి సృష్టి జరగడానికి కావలసిన సకల మూల వనరులు ఉద్భవించి, అటుపిమ్మట సంకల్పాన్ని సిద్ధింపచేయడానికి లేదా సృష్టి చేయడానికి ప్రాణం నుండి శక్తి లేదా ఆది శక్తి లేదా రెండవ ఆది ఆవిర్భవించింది లేదా విడిపడింది. శక్తి లేదా ఫోర్సు లేదా ఆదిశక్తి లేదా క్రియాశక్తి కూడ మూల/ శూన్య ఉనికియే అని తెలియనగును.

4) యోగ లక్ష్యం అంటే ఏమిటి?

5) భృక్త రహిత తారక రాజ యోగం అనే ఈ యోగం ఎందుకు ఆరంభమయిందో, ఏ లక్ష్యంతో ఆరంభమయిందో, అదే యోగ లక్ష్యం. సృష్టి కంటె ముందు సృష్టి లక్ష్యం ఉన్నట్లుగానే, యోగారంభం కంటె ముందుగానే యోగ లక్ష్యం ఉంది అని తెలియనగును. దానికి పెట్టబడిన భృక్త రహిత తారక రాజ యోగం అనే పేరు లోనే లక్ష్య సంబంధమైన వివరణ ఉంది (ఆ వివరణ సమాధానం నెం.9 ప్రశ్న నెం.9 విషయం "భృక్త రహిత తారక రాజ యోగం అనే మాటలకు అర్థం" లో చూడనగును). ఆ లక్ష్యం ఏమిటి అనేది ఇండిపెండెన్సీ, ఏకం ఆ ఏకంను చూడడం, ఫిజికల్ ఎస్టాబ్లిష్, భ్రమింపచేసే దానిని చేరడం/ చేరుకోవడం, వగైరా అని అనేక మితులలో వ్యక్తం చేయబడింది. వాటి అర్థాన్ని స్థూల అమృతత్వంగా తీసుకోనవుతుంది.

6) సృష్టి లక్ష్యానికి, యోగ లక్ష్యానికి మధ్యన ఉన్న సామ్యం ఏమిటి, తారతమ్యం ఏమిటి?

7) ముందుగా సామ్యం గురించి. సృష్టి లక్ష్యం, యోగ లక్ష్యం రెండూ కూడ సృష్టికీ, సృష్టి ప్రక్రియలో లేదా సృష్టి క్రమ వికాసంలో ఉత్తమోత్తమ రూప ధారి అయిన మనిషికీ సంబంధించి ఉన్నాయి, క్రమవికాసంలో వృద్ధి చెంది ఏర్పడిన మనిషిలో లక్షణ పరంగా ఇమిడి ఉన్న లోహ, వృక్ష, జంతు జీవ దశల ప్రభావాల దృష్ట్యా మిగతా సమస్త జీవకోటికి సంబంధించి ఉన్నాయి. సృష్టి లక్ష్యం ఏమిటి లేదా సృష్టి ఎందుకు జరిగింది అనే దానికి సమాధానం వచ్చినా కూడ, అది సజావుగా అర్థం కాని పరిస్థితి. అలాగే, యోగం గురించి, యోగ విధానం గురించి, యోగ లక్ష్యం గురించి, యోగ లక్ష్య సిద్ధి గురించి యోగ రికార్డులు అనేకం వచ్చినా కూడ, యోగ లక్ష్యం గురించి సరయిన అవగాహన కలగని పరిస్థితి.

8) ఇపుడిక తారతమ్యం గురించి. సృష్టి లక్ష్యం సృష్టికి సంబంధించింది. ఇది కేవలం వివరణ తెలియని సమాచారంగా మాత్రమే చెప్పుకోదగిన అంశం. యోగ లక్ష్యం యోగానికి సంబంధించింది. కానీ, యోగం లేదా యోగ విధానం మూలానికి, సృష్టి విధానానికి సంబంధించింది అని మాస్టరు గారి డైరీలో ఉన్నప్పటికీ, విషయంగా పట్టించుకోబడని పరిస్థితి, పట్టీఃచుకున్నా అంత తేలికగా అర్థం కాని పరిస్థితి.

9) సృష్టి లక్ష్యం సంకల్పంగా, సూత్రప్రాయంగా మాత్రమే సృష్టి క్రమవికాసంలో గుంభనంగా ఇమిడి ఉంది. యోగ లక్ష్యం ప్రాక్టీసుగా లేదా ఆచరణ సాధ్య సాధనగా యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలలో గుంభనంగా ఇమిడి ఉంది.

10) సృష్టి లక్ష్యం మానవ రూపానికి సంబంధించి ఉంది అని తెలియడం దుర్గ్రాహ్యం, దాదాపు అసంభవం. కానీ, యోగ లక్ష్యం మానవ రూపానికి సంబంధించి ఉంది అనేది స్థూల శరీరాల మాధ్యమంగానే జరుగుతున్న క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల ఆధారంగా గుంభనంగానే అయినా స్పష్టంగా తెలియనవుతుంది.
Post Reply