సమాధానం నెం.127 - ప్రశ్న నెం.127 (7-1-2022) విషయం "ఈథరిక్".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.127 - ప్రశ్న నెం.127 (7-1-2022) విషయం "ఈథరిక్".

Post by Katakam »

1) ఈథరిక్ అంటే ఏమిటి?

2) ఈథరిక్ అనేది ఈథరు అనే ఆంగ్ల నామవాచక పదం నుండి వచ్చిన నామవాచక, విశేషణ పదం. ఈథరు అంటే ఆకాశం అని అర్థం. ఈథరిక్ అంటే ఆకాశాత్మకం లేదా ఆకాశంతో కూడి ఉండినది అని అర్థం. దీనిని పంచ భూతాలలో అన్నిటి కంటె సూక్ష్మతమం అయిన ఆకాశ తత్త్వంగా తీసుకోనవుతుంది, కానీ పంచ భూతాలలో ఒకటిగా కాదు. దాని కార్యక్రమం ఏమిటో చెప్పుకున్నపుడు, ఆ విషయం స్పష్టం అవుతుంది.

3) ఈ మాస్టరు యోగంలో ఈ ఈథరిక్ యొక్క పాత్ర చాలా కీలకంగా వివరించబడింది. మనిషికి ఉన్న లేదా మనిషిలో ఉన్నాయని చెప్పబడిన ఫిజికలు మొదలుకుని మహాపర నిర్వాణిక్ వరకు ఏడు తలాలలో ఫిజికలు (అంటే సాంప్రదాయ బద్ధంగా మూలాధారం) మరియు యాస్ట్రలు (అంటే సాంప్రదాయ బద్ధంగా స్వాధిష్ఠానం) అనే అతి క్రింది రెండు తలాల మధ్య ఉన్నదిగా చెప్పబడింది ఈ ఈథరిక్ యొక్క స్థానం.

4) ఈథరిక్ కు మనిషి లోని తలాల సంబంధంగా పాత్ర ఏమిటి?

5) పైన చెప్పుకున్నట్లుగా, ఈథరిక్ యొక్క స్థానం ఫిజికలు, యాస్ట్రలు తలాల మధ్య ఉంది. యోగ పరంగా ఈథరిక్ యొక్క కార్యక్రమం దృష్ట్యా, దానిని డబుల్ ఈథరిక్ అన్నారు. అంటే ఈథరిక్ రెండు పొరలుగా ఉంటుంది అని. ఇది చర్మపు పై పొరకు ఆనుకుని బయట ఒక పొర, లోపల ఒక పొర. విశ్వ వాతావరణంలో ఉంటున్న మనిషికి విశ్వ స్థాయి సూక్ష్మ వనరులను స్థూల స్థాయికి సరిపోయినంతగా తీసుకోవడమే ఈథరిక్ యొక్క కార్యక్రమం. ఈథరిక్ పై పొర విశ్వ వాతావరణానికి అనుసంధానమై ఉండి, అందులో స్థూల స్థాయికి సరిపోను తీసుకోగా, దానిని స్థూల దేహ వ్యవస్థకు పంపకం చేసేది ఈథరిక్ లోపలి పొర. అంటే నైట్ బల్బు (అంటే అతి తక్కువ కాంతిని మాత్రమే ప్రసరించే బల్బు) కు సంబంధించిన ట్రాన్సుఫార్మర్ చేసే పని లాంటిది.

6) ఈథరిక్ మానవ దేహ వ్యవస్థలో ఒక తలం కాకపోవడానికి కారణం ఏమిటి?

7) ఈథరిక్ యొక్క కార్యక్రమం ఫిజికలు తలానికి మరియు యాస్ట్రలు తలానికి రెండిటికీ సంబంధించి ఉంది. స్థూలానికి కనుపించే సూక్ష్మ రూపం (తళుక్కుమని కనపడి చటుక్కున మాయమైపోయే ప్రక్రియకు సంబంధించిన సూక్ష్మ రూపం) అలా కనుపించడంలో ఈథరిక్ పాత్ర కూడ కీలకం. మాస్టరు గారి డైరీలో 21-9-1916 న "బాహ్య కార్య క్షేత్రంలో కనుపించేలా స్థూల, ఈథరిక్, యాస్ట్రలు ఆకృతులకు వాస్తవ పదార్థ రూపాన్ని కలిగించే సత్తా కుండలిని యొక్క బాహ్య కార్యక్రమానికి ఉంది" అని చెప్పబడిన దానిలో ఈథరిక్ యొక్క పాత్ర గురించిన ప్రస్తావన ఉంటే, మాస్టరు గారి డైరీలో 6-12-1917 న "యాస్ట్రలుకు మానసిక చిత్రాలను ఘనీభవింపచేసే సామర్థ్యం ఉంది, అది అరూప లెవెలులో పనిచేయదు" అని చెప్పబడిన దానిలో వెల్లడించబడని ప్రక్రియ లోతులలో ఈథరిక్ కార్యక్రమం ఉంది. మానసిక చిత్రాన్ని ఘనీభవింప చేసినపుడు, ఆకాశంలో ఆకాశంగా కలిసిపోయి ఉన్న సూక్ష్మ రూపం కనపడడానికి ఈథరిక్ ఆ రూపానికి బాహ్యపు అంచుగా ఏర్పడడమే ఆధారం, ఒక రకంగా కీలకం.

8) ఈథరిక్ కు సృష్టి లక్ష్యంలో పాత్ర ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?

9) వస్తుతః స్థూలం నుండి విడిపోయి బయటికి వెళ్ళే లక్షణం ఉన్న యాస్ట్రలు ఈ యోగంలో ఫిక్సు కావడం (విడిపోయి బయటికి వెళ్ళకుండా స్థూలం లోపలే ఉండడం, ఉండి పనిచేయడం) అనే దాని అవసరం గురించి మాస్టరు గారి డైరీలో 21-10-1915 న "మన ప్రాక్టీసు వలన యాస్ట్రలు ఫిక్సు అవుతుంది. ఇతనికి (= సీ.ఏ.యస్. కి) అయ్యింది. కానీ, ఏకాగ్రత కారణంగా ఇతను తనను యాస్ట్రలు సెపరేషనుకు గురి చేసుకున్నాడు" అని చెప్పబడిన మాదిరిగానే ఈథరిక్ కూడ కేవలం బాహ్యంలో పనిచేయడం కాకుండా ఆంతరికంలో పనిచేయవలసిన అవసరానికి సంబంధించి చెప్పబడినదే ఒలిడియరు 3 నామం లోని "ఈథర్ వర్కౌట్" అనే పదజాలం. అంటే ఈథరు కూడ ఫిక్సు కావాలి అని. అంటే స్థూలానికి బాహ్యంగా పనిచేయడం కాక, స్థూలం లోపల ఆంతరికంగా పనిచేయాలి అని. ఇది సృష్టి లక్ష్యానికి సంబంధించిన వర్కులో భాగమే.
Post Reply