సమాధానం నెం.159 - ప్రశ్న నెం.159 (12-3-2022) విషయం "ప్రజ్ఞానం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.159 - ప్రశ్న నెం.159 (12-3-2022) విషయం "ప్రజ్ఞానం".

Post by Katakam »

1) ప్రజ్ఞానం అంటే ఏమిటి?

2) ప్రజ్ఞానం అనేది సామాజిక వరవడిలో కాక‌, కేవలం ఆధ్యాత్మిక వర్గాల్లో చాలా అరుదుగా మాత్రమే వాడబడుతున్న పదం. కారణం ఏమిటి అంటే అది మనిషికి సంబంధించిన స్థూల‌, సూక్ష్మ స్థాయిలకు కాక, కేవలం ఆత్మ సంబంధమైన విషయంగా మాత్రమే చాలా అరుదుగా వాడబడుతున్న పదం గనుక. వేద వాజ్మయంగా చెప్పబడే నాలుగు మహా వాక్యాలలో క్రింది స్థాయి నుంచి మొదటిది అయిన "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే దానిలో ఈ పదం కాననవుతుంది. ప్రజ్ఞానమే బ్రహ్మ (బ్రహ్మం) అనే దానితో దాని ప్రస్తావన ముగుస్తుంది. దాని గురించిన వివరణ దాదాపుగా ఎక్కడా కనుపించదు.

3) అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకుంటే‌ తప్ప, దాని అర్థం తెలిసి రాదు. ప్రజ్ఞానం అనే మాటలో జ్ఞానం అనే పదభాగం ఉంది గనుక, అది జ్ఞానానికి సంబంధించింది అని -దాని గురించి ప్రత్యేకంగా ఏమీ తెలియకపోయినప్పటికీ- నిర్ద్వంద్వంగా చెప్పుకోనవుతుంది. వస్తుతః జ్ఞానం అనే మాటకు పూర్వపద విశేషణ పదంగా ప్ర అనే అక్షరం ఉంది గనుక, ఆ ప్ర గురించి తెలియవలసిన అవసరం. ప్ర అంటే ఏకం ప్రతి లేదా ఏకం పట్ల లేదా ఏకం వైపుకు అని అర్థం. అంటే ఏకం పట్ల లేదా ఏకం వైపుకు లేదా ఏకం గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండడమే ప్రజ్ఞానం అవుతుంది.

4) సృష్టి స్థాయిగా లేదా సృష్టికి అతీతమైన స్థాయిగా తీసుకుంటే, సృష్టికి మూలం ఏదో అదే ఏకం. యోగ పరంగా చెప్పుకుంటే‌, అదే ఆరిజిను లేదా మూలం లేదా ప్రాణం. వ్యక్తి స్థాయిగా తీసుకుంటే, వ్యక్తి ఆరంభ జన్మ కంటె ముందు ఉన్న వ్యక్తి యొక్క ఉనికియే లేదా వ్యక్తి యొక్క ప్రాణ ఉనికియే వ్యక్తి ఏకం లేదా వ్యక్తి మూలం. వ్యక్తి ఏకం పట్ల, వ్యక్తి ఏకం వైపుకు, వ్యక్తి ఏకం గురించిన జ్ఞానమే వ్యక్తి స్థాయి ప్రజ్ఞానం.

5) ప్రజ్ఞానానికి, జ్ఞానానికి మధ్య సంబంధం ఏమిటి?

6) జ్ఞానం అంటే తెలియబడినది, తెలుసుకోబడినది అని చెప్పుకోవడం జరిగింది. దానికి వస్తుతః ఎలాంటి పరిమితులు లేవు, కాకపోతే తెలుసుకునేది అయిన జ్ఞకు క్రింది స్థాయి విస్తరణ అని కూడ చెప్పుకోవడం జరిగింది. జ్ఞానం అనే దానిని ఒక మొత్తంగా తీసుకోనవుతుంది. దానికి ఒక దిశానిర్దేశం ఏర్పడి ఉన్పటువంటిదే ప్రజ్ఞానం. అంటే ఏకం పట్ల లేదా ఏకం వైపుకు లేదా ఏకం గురించిన జ్ఞానం ప్రజ్ఞానం. కాకపోతే, మనిషి యొక్క సాధారణ జీవనానికి/ జీవితానికి లేదా స్థూల‌ సూక్ష్మ స్థాయిలకు సంబంధించింది కాక, కేవలం ఆత్మ/ మూలం/ ఏకం సంబంధమైనది. ప్రజ్ఞానం అనేది జ్ఞానంలో ఒక భాగమే అయినా, మనిషి జీవితానికి అత్యంత ముఖ్యమైన భాగం.

7) ప్రజ్ఞానం అనే మాట సామాన్య జనానీకానికి ఎందుకు వర్తించదు?

8) సామాన్య జనానీకం అంటే వస్తుతః సామాజిక స్రవంతిలో జీవనానికి, జీవన పోరాటానికి పరిమితమై పోయిన అత్యధిక సంఖ్యాక వర్గం. అల్ప సంఖ్యాక వర్గం అయిన దైవానుసంధానకర్తల ప్రసంగాల, ప్రవచనాల వలన మాత్రమే వస్తుతః జీవిత సంబంధమైన ఆధ్యాత్మికతతో అనుబంధం కలిగి ఉన్న వర్గం. కానీ, కాలక్రమేణా ఆ ఆధ్యాత్మికత అనేది పొట్టకూటి కోసం అనే జీవన సంబంధ ప్రాధాన్యతకు లోబడి పోయింది. వేద వాజ్మయంలో మాత్రమే తప్ప, ఆధ్యాత్మిక సాహిత్యంలో కూడ అంతగా చోటు చేసుకోని స్థాయి ప్రజ్ఞానం అనే ఆత్మ సంబంధ పదానిది. ఈ నేపధ్యంలో, ప్రజ్ఞానం అనేది సహజంగానే సామాన్య జనానీకానికి (ప్రసంగాలు, ప్రవచనాలు చేసే వారితో సహ అందరికీ) వర్తించనిది అయిపోయింది.

9) ప్రజ్ఞానం అనేది దాని అసలైన అర్థంలో మనిషికి, మానవ జీవనానికి, మానవ జీవితానికి సంబంధించియే ఉంది. ఈ యోగా ప్రాక్టీసు చేసే మహానుభావుల సాన్నిహిత్యంలో, సాంగత్యంలో, ఏదో ఒక అనుబంధంతో యోగ క్రియల, ప్రక్రియల, ప్రయోగాల ఫలిత ప్రభావం ఈ యోగం తెలియని, ఈ యోగ సంబంధం కాని సామాన్య జనానీకానికి పంపకం జరుగుతోంది, జరుగుతున్నట్లుగా స్థూల‌ సూక్ష్మ స్థాయిలకు ఎవరికీ ఏమాత్రం తెలియకుండా. సృష్టి లక్ష్యం గానీ, దానికి సమాంతరంగా యోగ లక్ష్యం గానీ సామాన్య జనానీకం అనే సమస్త మానవాళికి సంబంధించిందే కదా.
Post Reply