Page 1 of 1

సమాధానం నెం.035 - ప్రశ్న నెం.035 (7-7-2021) విషయం "ఈ యోగా ప్రాక్టీసు యొక్క గొప్పతనం".

Posted: Mon Jul 12, 2021 7:46 am
by Katakam
1) మన యోగంలో ప్రాక్టీసు అంటే ఏమిటి?

2) ప్రాక్టీసు అంటే సాధన అనేది మామూలుగా చెప్పుకోదగిన అర్థం, కానీ, యోగం యొక్క గొప్పతనం మాదిరిగానే యోగా ప్రాక్టీసు యొక్క గొప్పతనం ఏమిటి అనే కోణంలో ఇది తెలియవలసిన అవసరం. ఏ విషయమైనా మాస్టరు గారి రికార్డులలో అత్యంత గుంభనమైన పదజాలంతో, అంత తేలికగా అర్థం కావడానికి వీలులేని రీతిలో ఉంటుంది అనేది ఆ రికార్డుల పరిశీలన చేసే ఎవరికయినా తేలికగా తెలిసే విషయమే. వెంకమ్మ గారి ద్వారా వచ్చిన ఒక గ్రంథ విషయాన్ని మాస్టరు గారు వ్రాసుకున్నదే "యమ్. ప్రాక్టీస్ ఫస్ట్ ఆరిజిన్" లేదా "మాస్టర్స్ ప్రాక్టీస్ ఫస్ట్ ఆరిజిన్" లేదా "మాస్టరు యొక్క ప్రాక్టీసు మొదటి ఆది". దీని అర్థం తెలియడం అంత తేలిక కాదు అని తెలుస్తున్నా, ప్రాక్టీసు అనే మాటకు మాత్రం అర్థం చెప్పుకునే అవకాశం. అది ఏమిటి అంటే ఆచరణ సాధ్య సాధన. అంటే ఆచరణను కూడ సాధ్యం చేసే సాధన అని.

3) సాంప్రదాయబద్ధమైన ధ్యానం, ప్రార్థన, తపస్సు మొదలైన వాటి కంటే
ఇదిఏ రకంగా భిన్నం?

4) ప్రశ్న నెం.2 లో కూడ ఇదే ప్రశ్న వేసుకుని సమాధానం చెప్పుకోవడం జరిగింది. కానీ, ఇక్కడ చెప్పుకునేది ఆచరణ సంబంధంగా అని తెలియనగును.

5) ఇతర విధానాలలో ఒక ప్రక్రియ జరపాలి అంటే దానికి ఎన్నో నియమనిబంధనలను పాటించవలసిన అవసరం, ఆ ప్రక్రియలకు సంబంధించిన రీతులను, పద్ధతులను ఆచరించవలసిన అవసరం. ప్రక్రియలకు సంబంధించిన ఆచరణకు, జీవన విధానంలోని విలువల ఆచరణకు సంబంధం ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు.

6) ఒక ఉదాహరణ ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తుందని అనిపిస్తుంది. మాటలు వచ్చిన చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు సర్వులకు తెలిసిన ఒక మాట అబద్ధం. అబద్ధమాడకుండా ఉండడం ఎంత కష్టమో లౌకిక జీవనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అబద్ధమాడకుండా లౌకిక వ్యవహారాలు నడవడం అసాధ్యం అనేది ఆశ్చర్యపడవలసిన అంశం కానే కాదు, సర్వసాధారణ విషయమే.

7) ఈ యోగా ప్రాక్టీసు మధ్యస్థంగా లౌకిక వ్యవహారాలలో వస్తుతః సహాయకారి కాకపోయినా, చిట్టచివరికి ఈ యోగా ప్రాక్టీసు ఫలితం ఇమిడిపోవలసింది సామాజిక/లౌకిక జీవనంలోనే. అంటే ఏ సమస్త విలువలు ఇతర సాధనా విధానాలలో ఆచరణ సాధ్యం కావడానికి అవకాశం లేదో, అవి అన్నీ మానవ ప్రయత్నం లేకుండానే ఆచరణకు రావడమే ఈ యోగం యొక్క ప్రత్యేకత, మిగతా సాధనా విధానాలకు దీనికి ఉన్న తేడా.

8) మిగతా సాధనలు అన్నిటి కంటే ఇది ఉత్తమోత్తమం అనడానికి ఆధారం ఏమిటి?

9) ముందుగా ప్రాక్టీసు చేసే విధానంగా. ఇతర విధానాల సాధనలలో ప్రతి ఒక్కదానికి దేనికి దానికి సంబంధించి ఎన్నెన్నో విధివిధానాలు ఉంటాయి. ఆ విధివిధానాలు సామాన్య జనానీకానికి అందుబాటులో లేనటువంటివి. భుక్తి కోసం పాటుపడే సామాన్య జనానీకానికి సంబంధం లేనివి. ఈ యోగంలో ప్రాక్టీసు చేసే విధానం అత్యంత సులభం. తేలికగా తెలియదగిన అతి సాధారణ విషయాలే యోగా ప్రాక్టీసు సంబంధం.

10) పిమ్మట ప్రాక్టీసు అదిగానే జరిగే విధానంగా. ఇతర విధానాల సాధనలలో సాధన ప్రక్రియ సమస్తం సాధకుడు స్థాయి స్థాయికీ ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ పోవలసిందే. కొన్నిటిలో స్థూల మార్గనిర్దేశకత్వం కూడ అవసరం. ఈ యోగంలో ప్రాక్టీసు వస్తుతః జరిగేదే, ఆ జరిగేదానిలో సాధకుడు తానుగా చేసేది ఏమీ ఉండదు.

11) ఇతర విధానాల సాధనలలో సాధన ఫలితం అంతిమంగా కూడ సదరు వ్యక్తికే పరిమితం. ఈ యోగా ప్రాక్టీసులో ప్రాక్టీసు ఫలితం పంపకం ద్వారా అంతిమంగా సృష్టి మొత్తానికి అన్వయం.