సమాధానం నెం.050 - ప్రశ్న నెం.050 (6-8-2021) విషయం "మోక్షం".
Posted: Wed Aug 11, 2021 7:41 am
1) మోక్షం అంటే ఏమిటి?
2) మోక్షం అనే మాటకు పర్యాయపదాలుగా వాడబడే ముక్తి (విడుదల చెందడం), విముక్తి (విశేషంగా విడుదల చెందడం) అనే మాటలకు భిన్నంగా మోక్షం అంటే మః + అక్షం అనే పద విభాగంగా ఆధారం లేకపోవడం అని అర్ధం. దేనికి ఆధారం లేకపోవడం అంటే కర్మ సంబంధ విధాన పరంగా సృష్టిలో నెలకొని ఉన్న జనన మరణ పరంపరకు ఆధారం లేకపోవడం లేదా లేకుండా పోవడం. పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, గిట్టిన వాళ్ళు పుట్టక తప్పదు అనే సూత్రం ఆధారంగా మరణించిన వాళ్ళు జన్మించక తప్పదు గనుక, మరణించిన తరువాత వచ్చేది మోక్షం కానేరదు, జన్మించిన తరువాత మరణించకుండా ఉంటేనే జనన మరణ పరంపరకు ఆధారం లేకుండా పోవడం అవుతుంది. 'మృత్యోర్మా అమృతం గమయ', అంటే 'మృత్యువు నుండి అమృతత్వం వైపుకు మమ్ములను నడిపించవలసినది" అనే అభ్యర్థనా పూర్వక వేదసూక్తంలో ఇమిడి ఉన్న అర్థం ఇదే కదా.
3) మోక్షం దేనికి - స్థూలానికా, సూక్ష్మానికా, మూలానికా?
4) జనన మరణ పరంపరకు ఆధారం లేకుండా పోవడం అనే మోక్షం జననానికి, మరణానికి గురవుతున్న స్థూలానికే, అమృతత్వం రావలసిన స్థూలానికే. సూక్ష్మం, మూలం/ప్రాణం ఉండేది స్థూలం లోనే గనుక, స్థూలంతో పాటే సూక్ష్మం, మూలం లేకుండా పోతాయి గనుక, ప్రాణం స్థూలాన్ని విడిచిపోకుండా ఉండడమే అమృతత్వం గనుక, మోక్షం స్థూలానికే.
5) సాంప్రదాయబద్ధమైన మోక్షం యోగ/సృష్టి లక్ష్యానికి విరుద్ధం అన్నపుడు, ఆ మోక్షం కోసం ప్రయత్నించిన వాళ్ళు మహానుభావులు, మహాత్ములు ఎలా అయ్యారు?
6) సాంప్రదాయబద్ధంగా వాడబడిన పదం మోక్షం. మోక్షం అనే మాట సృష్టి లక్ష్యానికి ప్రతీకయే. కానీ, ఆ మాటకు సాంప్రదాయ విధానంలో చెప్పబడిన అర్థం మాత్రమే సృష్టి లక్ష్యానికి విరుద్ధం. పాటించబడిన మార్గం వేరేది అయినప్పటికీ, వాళ్ళ లక్ష్యం వస్తుతః మోక్షం మాత్రమే అయి ఉంది గనుక, భిన్నమైన అర్థం లోనే అయినా సృష్టి లక్ష్యమైన మోక్షం అనే మాటను సృష్టి మానవులకు పరిచయం చేసింది వాళ్ళే గనుక, వాళ్ళ కఠోర సాధనల గమ్యం మోక్షమే గనుక, వాళ్ళు మహానుభావులు, మహాత్ములు అయ్యారు.