Page 1 of 1

సమాధానం నెం.054 - ప్రశ్న నెం.054 (14-8-2021) విషయం "మూలం".

Posted: Thu Aug 19, 2021 7:57 am
by Katakam
1) మూలం అంటే ఏమిటి?

2) మూలం అంటే సాధారణ అర్థంలో వేరు అనీ, మూలస్థానం అనీ చెప్పుకునే అర్థాలకు సమాంతరంగా, యోగ పరంగా చెప్పుకోవాలి అంటే, దీనికి ముందు స్థూలం గురించి, సూక్ష్మం గురించి చెప్పుకున్న మీదట, వాటి అర్థాలకు కొనసాగింపుగా -అంటే సూక్ష్మతల సంబంధంగా వాటి కంటె సూక్ష్మాతిసూక్ష్మంగా- మూలం అంటే స్థూల సూక్ష్మాలను మించి ఉనికి ఆరంభం అని చెప్పుకోనవుతుంది. అంటే స్థూల సూక్ష్మాల కంటె ముందే ఏర్పడిన ఉనికి యొక్క ఆరంభం లేదా ఆరంభ స్థాయి అని అర్థం.

3) దీనిని వ్యక్తికి సంబంధింపచేసి చెప్పుకోవాలి అంటే వ్యక్తి ప్రథమ జన్మకు రావడం కంటె ముందుగానే ఏర్పడిన ఉనికి అని అర్థం. ఆ ఉనికియే మూలం, ఆరంభ ఉనికి. అదే వ్యక్తిగత ప్రాణం లేదా వ్యక్తి స్థాయి ప్రాణం.

4) మూలాన్ని సృష్టికి సంబంధింపచేసి చెప్పుకోవాలి అంటే సృష్టి యొక్క మూలమే సృష్టి మూలం, స్థూల సృష్టికి మూలం అయిన సూక్ష్మ సృష్టికి మూలం. అదే ప్రప్రథమ ఉనికి అయిన ప్రాణం లేదా మూల ప్రాణం. అదే ఆరిజిను వన్ లేదా మొదటి ఆది లేదా సృష్టి మానవుల చేత భగవంతుడు అని పిలువబడుతున్న భగవత్తత్త్వం.

5) మూలం యొక్క అవసరం ఏమిటి?

6) వ్యక్తికి సంబంధింపచేసి చెప్పుకోవాలి అంటే వ్యక్తి స్థూలంగా బ్రతికి ఉండాలన్నా, వ్యక్తి స్థూలంలో శక్తి / సూక్ష్మ క్రియాకలాపాలు జరగాలన్నా, ఆ అవసరానికే వ్యక్తిలో ఉండే ప్రాణతరంగం. ఇది సర్వజన విదితమే, కాకపోతే ప్రాణతరంగం అని కాక ప్రాణం అని మాత్రమే.

7) సృష్టికి సంబంధింపచేసి చెప్పుకోవాలి అంటే వ్యక్తుల సమిష్టియే సృష్టి గనుక, అది వ్యక్తుల లేదా జీవుల పుట్టుకకు మూలం అయిన సృష్టి ప్రాణం. వ్యక్తిలో ప్రాణతరంగం ఎలాగో, సృష్టికి సృష్టి ప్రాణం అలాగ.

8) వ్యక్తిలో ఉండేది ప్రాణతరంగం, వ్యక్తిగత / వ్యక్తిస్థాయి ప్రాణం యొక్క తరంగం / ఛాయ / అంశ. సృష్టిలో ఉండేది సృష్టి ప్రాణం. సృష్టి జీవులకు మూలం అయిన సృష్టి ప్రాణం అనేది మూలప్రాణం యొక్క ఛాయ / అంశ. వ్యక్తులలో వ్యక్తిగత / వ్యక్తిస్థాయి ప్రాణం కాక, వ్యక్తిగత / వ్యక్తిస్థాయి ప్రాణం యొక్క తరంగం / ఛాయ / అంశ మాత్రమే ఉంది. సృష్టిలో సృష్టి ప్రాణం మాత్రమే ఉంది, జీవుల సృష్టికి మూలం అయిన సృష్టి ప్రాణంలో మూలప్రాణం యొక్క ఛాయ / అంశ మాత్రమే ఉంది.

9) మూలానికి, సృష్టి లక్ష్యానికి ఉన్న సంబంధం ఏమిటి?

10) సృష్టి లక్ష్యం వ్యక్తి సంబంధం, వ్యక్తుల సమిష్టి అయిన సృష్టి సంబంధం కూడ. ప్రస్తుతం వ్యక్తి స్థూలంలో ఉంటున్న ప్రాణతరంగం స్థానంలో వ్యక్తిగత /వ్యక్తిస్థాయి ప్రాణం దిగిరావడం / చేరడం / చేరుకోవడం సృష్టి లక్ష్యంలో భాగం. అందుకు "ఫిజికల్ ఎస్టాబ్లిష్" లేదా "స్థూలం తయారుకావడం" (మాస్టరు గారి నోట్సు 1-11-1918) యోగ పరంగా చెప్పబడిన వ్యక్తిస్థాయి లక్ష్యం. మూలం /ప్రాణం స్థూలంలో కలవడం అనేది యోగం, ఆది / మూలం / ప్రాణం ఆత్మలో / జీవాత్మలో / జీవుడిలో / జీవుడి స్థూలంలో ఏకం కావడం అనేది ఆధ్యాత్మికత (ఆది + ఆత్మ + ఏకత). సృష్టిలోని సమస్త వ్యక్తులు అలా మూల / ప్రాణ స్థూలాల కలయికకు తయారుకావడమే సృష్టి స్థాయి లక్ష్య సిద్ధి.