సమాధానం నెం.057 - ప్రశ్న నెం.057 (20-8-2021) విషయం "ధర్మం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.057 - ప్రశ్న నెం.057 (20-8-2021) విషయం "ధర్మం".

Post by Katakam »

1) ధర్మం అంటే ఏమిటి?

2) ముందుగా, ధర్మం అనే మాట సామాజికంగా, ఆధ్యాత్మికంగా వాడబడే పదం కదా, యోగపరంగా దాని అవసరం, ప్రాశస్త్యం ఏమిటి అనేది రాబోయే వివరణలలో తెలుస్తుంది.

3) ధర్మం అంటే వ్యుత్పత్తిగా 'ధరయతి ఇతి ధర్మః', అంటే ధరించి ఉండేది ధర్మం, అని అర్థం. దీనికి వేరే వ్యుత్పత్తి 'ధారయతి ఇతి ధర్మః', అంటే ధరించబడి ఉండేది ధర్మం, అనే అర్థం కూడ ఉన్నప్పటికీ, ప్రధాన అర్థం మొదటిదే. శరీర ధర్మం అనేది నానుడి, అంటే ధర్మం అనేది శరీరానికి సంబంధించింది అని అర్థం. అంటే శరీరాన్ని ఏది ధరించి ఉందో, అదే ధర్మం అని. శరీరాన్ని ధరించి ఉంది అంటే శరీరం కంటె ముందుగానే ఉంది అనే కదా.

4) ధర్మానికి, కర్మకు సంబంధం ఏమిటి?

5) "స్థూల శరీరం అనేది బాహ్య పదార్థంతో తయారయి ఉంది. (బాహ్య పదార్థం అంటే మునుపటి ప్రవృత్తులు లేదా పూర్వ కర్మలు లేదా కర్మ సంబంధ విధానం" (మాస్టరు గారి డైరీ 29-9-1912). వివరాలకు సమాధానం నెం.006 (8-5-2021) విషయం "ఫారిన్ మ్యాటర్" లో చూడగలరు. బాహ్య పదార్థం అంటే కర్మ పదార్థం. ప్రథమ జన్మ తదుపరి కర్మను శరీరం చేత ధరియించబడినదిగా తీసుకోనయితే, ప్రథమ జన్మ కంటె ముందరి కర్మను శరీరాన్ని ధరియించినదిగా తీసుకోనవుతుంది. ఏతావాతా తేలేది ఏమిటి అంటే కర్మయే ధర్మం అని. అంటే ప్రథమ జన్మకు సంక్రమించిన సృష్టి కర్మ భాగమే శరీరానికి ధర్మం అని అర్ధం.

6) ధర్మానికి, మనిషికి సంబంధం ఏమిటి?

7) మనిషి అంటే కేవలం స్థూల శరీరం మాత్రమే కాక, స్థూలంలో క్రియాశీలంగా ఉన్న శక్తితత్త్వం, ప్రాణం లేదా ప్రాణతరంగం అనే మూలం ఈ మూడిటి సంగమం గనుక, సృష్టి కర్మ భాగ సంక్రమణానికి ముందే ఉన్న మూల / ప్రాణ ఉనికిని మినహాయించి క్రియాశీలమైన శక్తితత్త్వం, సాధనమైన స్థూలం రెండూ కూడ కర్మ సంబంధమే. సృష్టి కర్మ సంక్రమించింది మూలానికి / ప్రాణానికి ఆవరణగా / ఆవరించినదిగా గనుక, ఆ ఆవరణ తొలగడమే సృష్టి కర్మ భాగ ప్రక్షాళన, వ్యక్తిగత కర్మ యొక్క ప్రక్షాళన అనంతరం మాత్రమే చోటు చేసుకోవలసినది, చోటు చేసుకోదగినది. మూలానికి కర్మ అనేది ప్రక్షాళన కావలసినదిగా సంబంధం.

8) ధర్మానికి, సృష్టికి సంబంధం ఏమిటి?

9) మూలంతో సంబంధం లేకుండా మూలాన్ని ఆవరించినదిగా సృష్టి కర్మ భాగం సృష్టి స్థాయి ప్రక్రియయే తప్ప, వ్యక్తిగత / వ్యక్తిస్థాయి క‌ర్మకు భిన్నంగా వ్యక్తి ప్రమేయంతో సంబంధం లేనిది. ప్రథమ జన్మకు సంక్రమించినదిగా, మానవ స్థూలాన్ని ధరించినదిగా కర్మ / ధర్మం సృష్టి సంబంధం.

10) మనిషి మనుగడలో ధర్మం యొక్క పాత్ర ఏమిటి?

11) మనిషి ప్రథమ జన్మకు సంక్రమించిన సృష్టి కర్మ భాగం యొక్క లక్షణాలే మనిషికి ధర్మం, మనిషికి శరీర ధర్మం. మనిషి యొక్క ఆలోచన, మాట, చేత అనేవి సంక్రమించిన / ధరించిన సృష్టి కర్మ భాగం యొక్క లక్షణాలకు పూర్తి అనుగుణంగా మాత్రమే ఉంటాయి, భిన్నంగా ఉండే అవకాశం విధాన పరంగా అసంభవం. అంటే మనిషి యొక్క వ్యక్తిగత కర్మకు మూల కారణమైన సృష్టి సంక్రమిత కర్మయే మనిషికి శరీర ధర్మం. కనుక, మనిషి మనుగడ సమస్తం శరీర ధర్మాన్ని అనుసరించి మాత్రమే ఉంటుంది. కర్మ ప్రక్షాళనలో భాగంగా వ్యక్తిగత కర్మను అనుభవిస్తూ పోవడం ద్వారా శరీర ధర్మం అనే మూల లక్షణాలను అవగాహన చేసుకోవడం మాత్రమే సృష్టి సంక్రమిత కర్మ యొక్క ప్రక్షాళనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది మూల స్థాయిల ప్రక్రియలో భాగంగా మాత్రమే.
Post Reply