సమాధానం నెం.059 - ప్రశ్న నెం.059 (24-8-2021) విషయం "గ్రహాలు".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.059 - ప్రశ్న నెం.059 (24-8-2021) విషయం "గ్రహాలు".

Post by Katakam »

1) గ్రహాలు అంటే ఏమిటి?

2) గ్రహాలు అంటే కేవలం సాంప్రదాయబద్ధమైన శాస్త్రాలకు లోబడి చెప్పబడుతున్న, నమ్మబడుతున్న అర్థంగా మానవ జీవనాన్ని శాసిస్తున్న స్థూల సృష్టి ఉనికిలు. వాటికి పూజలు చేస్తే గ్రహ ప్రభావ తీవ్రతను తగ్గిస్తాయి అని నమ్మించబడిన, నమ్మబడుతున్న స్థూల సృష్టి ఉనికిలు. సైన్సు ప్రకారం స్థూల ఖగోళ వస్తువులు.

3) గ్రహాలకు, మనిషికి సంబంధం ఏమిటి?

4) ఈ భూమి మీద మానవ జీవనంలో మనుషులు తమ ప్రారబ్ద కర్మను దశల వా‌రీగా అనుభవింపచేయడంలో తమదైన నిర్దిష్ట, నిర్దుష్ట పాత్రను నిర్దోషంగా నిర్వహించేవి గ్రహాలు; దైవానుసంధానకర్తలయిన ఆధ్యాత్మికవేత్తలు పూజలు పునస్కారాలతో గ్రహాలను, గ్రహపీడలను శాంతింపచేయవచ్చునని సామాన్య జనానీకాన్ని నమ్మించగలిగినప్పటికీ, వేటికీ లొంగకుండా సృష్టి కార్యక్రమంలో మనుషులు తమ ప్రారబ్ద కర్మను అనుభవించేలా చేయడం అనే విధ్యుక్త ధర్మాన్ని తుచ తప్పక నెరవేర్చేవి; భూమి మీది మానవ జీవనాన్ని ప్రస్తుత సృష్టి విధానం లోని కర్మ విధానానికి అనుగుణంగా నడిచేలా చేయడం అనే తమ విధిని నిర్వహించడానికి ఏర్పాటు చేయబడిన సృష్టి స్థాయి ఉనికిలు గ్రహాలు.

5) గ్రహాలకు, సృష్టికి సంబంధం ఏమిటి?

6) గ్రహాలు వస్తుతః సృష్టి స్థాయి స్థూల ఉనికిలు, సూర్య కిరణాల ద్వారా భూమి మీద మానవ జీవులకు వారు అనుభవించవలసిన ప్రారబ్ద కర్మ ప్రసారం చేయబడగా, ఎవరెవరు అనుభవించవలసిన వాళ్ళ ప్రారబ్ద కర్మను వారు తుచ తప్పక అనుభవించేలా చేసే సృష్టి స్థాయి స్థూల ఉనికిలు; కర్మ విధాన సంబంధ సృష్టి కార్యక్రమంలో ఒక అత్యంత ప్రధాన పాత్రను పోషించడానికి చేయబడిన సృష్టి స్థాయి ఏర్పాటులో భాగమైన సృష్టి స్థాయి స్థూల ఉనికిలు; ఈ భూమి మీది స్థూల మానవ జీవనంలో కర్మ విధాన సంబంధమైన ప్రారబ్ద కర్మను అనుభవింపచేసే అత్యంత శక్తివంతమైన సృష్టి శక్తులుగా స్థూల రూపం ధరింపచేయబడిన సృష్టి స్థాయి స్థూల ఉనికిలు.

7) మనిషి మనుగడలో గ్రహాల పాత్ర ఏమిటి?

8) సమస్త మానవ కోటి అనుభవించవలసిన ఎవరెవరి ప్రారబ్ద కర్మను వారు తప్పించుకోలేని విధంగా అనుభవింపచేసే సృష్టి నిర్వహణ మూలసూత్రాల స్దూల సంక్షిప్త రూపాలే గ్రహాలు. గ్రహ దశల ప్రభావాన్ని తప్పించుకోవడానికి చేయబడే మానవ ప్రయత్నాలు కూడ కర్మలో భాగమే. తనను పట్టబోతున్నాను అని శని చెప్పిన మీదట శనిని తప్పించుకోవడానికి చెట్టు తొర్రలో దాక్కున్న శివుడితో తాను పట్టిన కారణంగానే శివుడు కైలాసాన్ని, పార్వతి సాన్నిహిత్యాన్ని వదిలి చెట్టు తొర్రలో దాక్కోవడం జరిగింది అని శని చెప్పిన పౌరాణిక ఉదంతమే ఎవరూ ప్రారబ్ధ కర్మానుభవాన్ని, దానికి నూటికి నూరు పాళ్ళు అనుగుణంగా జరిగే గ్రహాల కార్యక్రమాన్ని తప్పించుకోవడం అసంభవం అనే విషయానికి తిరుగులేని సూచన రూప సాక్ష్యం.

9) ప్రస్తుత సృష్టి విధానం లోని కర్మ విధానంలో పనిచేయడం తత్త్వంగా మారిపోయిన గ్రహాలను నూతన సృష్టి విధానానికి అనుగుణంగా పనిచేసేలా తయారు చేయడానికి జరిగిన ఆరంభమే యోగపరంగా ప్రాక్టీసు చేయించబడిన గ్రహాల నియంత్రణ అనే "గ్రహాల రెగ్యులేషన్లు".


Katakam Sambasiva Rao
Post Reply