Page 1 of 1

సమాధానం నెం.060 - ప్రశ్న నెం.060 (26-8-2021) విషయం "అహం".

Posted: Tue Aug 31, 2021 7:53 am
by Katakam
1) అహం అంటే ఏమిటి?

2) అహం అంటే సర్వత్రా భావించబడుతున్ళ అహంభావం, అహంకారం అనే దాదాపు సమానార్థక పదాల యొక్క పర్యాయ పదం కాదు, ఆ రెండు పదాల మూలం, ప్రాణ సంబంధం, ప్రాణ ఉనికి సంబంధం, ప్రాణం యొక్క ప్రేరణ సంబంధం, ప్రాణం ఉన్న శరీరంలో తానుగా బయటపడని మూల లక్షణం, ఆభిజాత్యం అనే మాట యొక్క మూల అర్థానికి -అంటే పుట్టుకతోనే సంక్రమించినా పుట్టుకకు మరియు గిట్టుకకు అతీతంగా ఉండే (లేదా పనిచేయని) ప్రాణ సంగమ (ప్రాణంతో సంగమించి ఉండే) లక్షణానికి- ప్రతీక.

3) అహానికి, మనిషికి సంబంధం ఏమిటి?

4) అహం మనిషి యొక్క ప్రప్రథమ ప్రాణ ఉనికి -అంటే సృష్టి/విశ్వ ప్రాణం నుండి వ్యక్తి స్థాయి ప్రాణ శకలంగా విడిపడే ప్రాణ ఉనికి- యొక్క లక్షణంగా, అంటే 'అసలు నేను' కు సంబంధించిన లక్షణంగా, వ్యక్తి ఏకం. వ్యక్తి యొక్క జన్మల పరంపరలో 'నకిలీ నేను' గా వర్తింపచేసుకునే అహంభావ అహంకారాల శూన్యీకరణతో మాత్రమే తానుగా తనను తెలియబడచేసుకునే 'అసలు నేను'. 20-6-2021 న మాస్టరు గారి డైరీలో ఉన్న " 'ఏకం' ఆ 'ఏకం' ను చూడాలి" అనేదానికి సమానార్థకమైన " 'నేను' (= ఈ నేను = నకిలీ నేను) ఆ 'నేను' ను చూడాలి" అనే ఆది సంకల్ప సంబంధ మరియు సృష్టి లక్ష్య సంబంధ మూలసూత్రాన్ని నడిపించే సృష్టి మూలమైన మూలప్రాణానికి లక్షణ పరమైన ప్రతిబింబం.

5) అహం, అహంభావం, అహంకారం - మానవ మనుగడలో వీటి పాత్ర ఏమిటి?

6) అహం గురించి విపులంగా పైన చెప్పుకోవడం జరిగింది. ఇక చెప్పుకోవలసింది అహంభావం, అహంకారం గురించి.

7) అహంభావం గురించి. నిష్క్రియాత్మకమైన మరియు అవ్యక్తమైన అహం క్రియాత్మకమైన మరియు వ్యక్తమైన మానవ రూపంలో తెలియబడని భావంగా -అంటే భవ సంబంధంగా లేదా ప్రథమ ఉనికి సంబంధంగా- మరియు భావానికి క్రింది స్థాయిదిగా తెలియబడే అవకాశం ఉన్న భావనగా పనిచేసేదే అహంభావం.

8) అహంకారం గురించి. క్రియాత్మకమైన మరియు వ్యక్తమైన మానవ రూపంలో తెలియబడని భావానికి మరియు తెలియబడే భావనకు కొనసాగింపుగా కార్య రూపేణా తనను బహిర్గతం చేసుకునేదే అహంకారం.

9) అహంభావ అహంకారాల సమిష్టియే 'నేను' గా చెలామణి అవుతున్న 'నకిలీ నేను'. 'నకిలీ నేను' పూర్తి స్థాయికి ఉద్గమించితే తప్ప లేదా అహంభావ అహంకారాలు వాటి చివరి అంచుకు చేరుకుంటే తప్ప, శూన్యీకరణ దిశగా పతనం కావడానికి ఆరంభం కాని పరిస్థితి ఈ యోగ విధానం. అహాన్ని జయించాలి, అహం లేకుండా చేసుకోవాలి అని చెప్పుకునే చిలుక పలుకుల
లాంటి పొల్లు మాట లేదా వాస్తవ దూరమైన వ్యర్థ ప్రసంగం అహంభావ అహంకారాల యొక్క లేదా 'నకిలీ నేను' యొక్క నిలువెత్తు రూపం. నాకు/నాలో అహం లేదు అని చెప్పుకోవడం లోని అహంభావ అహంకారాలు వస్తుతః వాస్తవంగా గుర్తించబడనంతవరకు, అహంభావ అహంకారాలు ప్రజ్వరిల్లి పూర్తి పతనావస్థకు ఆరంభ ప్రతీకగా తమ చివరి అంచుకు చేరుకోనంతవరకు, మనిషిలో "ఏకం ఆ ఏకంను చూడాలి" లేదా దాని సమానార్థకమైన 'ఈ నేను ఆ నేనును చూడాలి' అనే లక్ష్య సిద్ధి సంబంధ పయనం ఆరంభమే కానేరదు.