Page 1 of 1

సమాధానం నెం.647 - ప్రశ్న నెం.647 (12-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - రీచింగు, శరీరం అస్వస్థత లేకుండా".

Posted: Sun Nov 17, 2024 7:49 am
by Katakam
1) "రీచింగు క్షణంలో మాత్రమే మాట ఇచ్చినట్లుగా శరీరం ఉంటుంది, అంతకు ముందుగా కాదు. అప్పటి వరకు అది సాధారణ స్థితిలో, అస్వస్థత లేకుండా నిర్వహించబడుతుంది" - మాస్టరు గారి డైరీలలో 1-4-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న, సమాధానం నెం.645 విషయం "యోగా రికార్డుల విషయాలు - అత్యంత కార్యవర్తన వేగం" లోని "ఇది ముగింపు కాలం" అనే దానికి ముగింపు సమయానికి శరీరం ఎలా ఉంటుంది అనేదిగా కొనసాగింపు అని తెలియనగును.

3) చెప్పుకున్న విషయమే అయినా, మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం ఉన్న విషయం ఏమిటి అంటే ఎప్పటి మాదిరిగానే వ్రాయబడిన విషయాలు మూల ప్రాణానికి లేదా ఆరిజినుకి లేదా డైరెక్టు లైను మాస్టరుకి లేదా మొదటి ఆదికి మాత్రమే సంబంధించినవి అని, ఎందుకు అంటే అందుకు భిన్నమైన భావనలు అహంభావ స్థాయిలను పెంచి, వ్యక్తిగత యోగా డెవలప్‌మెంటుకు విఘాతం కలిగిస్తాయి అని.

4) నిశితంగా గమనించవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే ప్రస్తుత ప్రశ్న విషయంలో చెప్పబడిన అంశాలు కేవలం మూల స్థాయి స్థూలానికి సంబంధించినవా లేదా మూల ప్రాణం లేదా ఆరిజిను లేదా డైరెక్టు లైను మాస్టరు లేదా మొదటి ఆది యొక్క స్థూల స్థాయి స్థూలానికి కూడ సంబంధించినవా అనే సందిగ్ధావస్థ ఉదయించడం. విషయాన్ని లోతుగా పరిశీలించగలిగితే, విషయం అప్పటి మూల స్థాయి ప్రక్రియగా మూల ప్రాణం యొక్క మూల స్థాయి స్థూలానికి మాత్రమే కాక, గుంభనమైన భవిష్య సూచకంగా మూల ప్రాణం యొక్క స్థూల స్థాయి స్థూలానికి కూడ సంబంధించియే ఉంది అనేది అందుతున్న విషయం.

5) రీచింగు క్షణంలో మాత్రమే మాట ఇచ్చినట్లుగా శరీరం ఉంటుంది, అంతకు ముందుగా కాదు. రీచింగు క్షణంలో మాత్రమే. రీచింగు క్షణంలో మాత్రమే అని అన్నపుడు, క్షణంలో అనే మాట గురించి లోతుల విషయంగా కొంత వివరంగా తెలుసుకోవలసిన అవసరం. ఏమిటి అంటే. ఇంతకు ముందు సందర్భాలలో వాడబడిన "రోజున", "సమయంలో" అనే మాటలకు భిన్నంగా, ప్రస్తుతం "క్షణంలో" అని చెప్పడంలో ఏదో ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనుపిస్తుంది, వివరణ అవసరం కూడ తెలియనవుతోంది. కోట్ల కోట్ల కోటానుకోట్ల సంవత్సరాల సుదీర్ఘ కాలాల తరువాత అతి కొద్ది కాలంలో జరిగిన యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాల ఫలితంగా జరగనున్న రీచింగు అనే ప్రక్రియ క్షణంలోనే జరుగుతుంది అనేది ఇక్కడ తెలియనవుతున్న విషయం, నమ్మడానికి మెదడు/ మేథ‌స్సు మొరాయిస్తున్నన్పటికీ. అలాంటి రీచింగు క్షణంలో మాత్రమే.

6) మాట ఇచ్చినట్లుగా. ఇచ్చిన మాట ఏమిటి అనేది తెలియవలసిన అవసరమే కదా. ఈ మాట ఆరు ఒప్పందాల లోని 3, 4 ఒప్పందాలకు సంబంధించి ఉంది అని నిక్కచ్చిగా చెప్పుకోనవుతుంది. 3వ ఒప్పందం - ప్రస్తుత శరీరమే క్షీణింపు లేకుండా, 4వ ఒప్పందం - (ప్రస్తుత శరీరమే) ఆకృతి మార్పు లేకుండా. ఈ ఒప్పందాలు మూల ప్రాణానికి సంబంధించినవి అని ఇంతకు ముందు చెప్పుకున్న విషయమే.

7) శరీరం ఉంటుంది. ఈ మాటలు మూల స్థాయి స్థూలానికి, మూల ప్రాణం యొక్క స్థూల స్థాయి స్థూలానికి రెండిటికీ అన్వయించనవుతుంది అని మాత్రమే చెప్పుకోనవుతుంది. ఎందుకు అంటే విధాన పరంగా చెప్పుకున్న విషయానికి, వాస్తవికంగా జరిగే విషయానికి పైకి తెలియనంత సూక్ష్మ అంతరం ఉంటుంది గనుక, దాని గురించి ఆలోచించడానికి మనసు, ఇదమిత్థంగా ఒక నిర్ణయానికి రావడానికి మేథస్సు ఏమాత్రం ఎంత మాత్రం సహకరించలేవు గనుక.

8) అంతకు ముందుగా కాదు ‌ ఆ క్షణంలో మాత్రమే మాట ఇచ్చినట్లుగా శరీరం ఉంటుంది అంటే ప్రస్తుత శరీరమే క్షీణింపు లేకుండా మరియు ఆకృతి మార్పు లేకుండా ఉంటుంది అని. కానీ, ఇక్కడ ఒక ప్రశ్న అవశ్యం ఉత్పన్నం కావలసిన అవసరం. ఏమిటి అంటే క్షీణించడం లేకుండా మరియు ఆకృతిలో మార్పు లేకుండా అనేవి కొంత లేదా ఎంతో కాలం గడిచిన తరువాత తెలియనయేవి కదా, అలాంటిది అవి నెరవేరడం అనే విషయం ఎలా తెలుస్తుంది అని. ఇక్కడ శరీరం అలా ఉంటుంది అని మాత్రమే చెప్పబడింది తప్ప, అవి తెలియడం గురించి ఏమీ చెప్పబడలేదు. కానీ, ఉత్పన్నం అయిన ప్రశ్నగా ప్రస్తావన వచ్చింది గనుక, సమాధానం అవసరమే. ఏమిటి అంటే ఇంతకు ముందు ఒక మాటగా వివరించుకున్నట్లుగా, ఎలాంటి అనుమానానికి తావు లేని విధంగా రావలసిన అసలు స్థాయి నుంచి స్ఫురణగా టచ్ రావడమే ఇక్కడ తెలియడం క్రింద తీసుకోనవుతుంది. కానీ, స్థూలంగా ఋజువు/ నిర్ధారణ కావాలి అంటే మాత్రం కొంత/ ఎంతో కాలం గడవవలసిందే, అలా అని మార్పు సంబంధంగా -అంటే క్షీణింపు జరగడం లేదు, ఆకృతిలో మార్పు రావడం లేదు అని- తెలిసే వరకు.

9) అప్పటి వరకు అది సాధారణ స్థితిలో, అస్వస్థత లేకుండా నిర్వహించబడుతుంది. అప్పటి వరకు. ఆ క్షణం వరకు. అది. శరీరం. సాధారణ స్థితిలో. ప్రస్తుత సృష్టి విధానంలో ఉన్న మాదిరిగా మామూలు స్థితిలో. అంటే ఆ శరీరంలో ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియని విధంగా, తెలియవలసిన అవసరం లేని విధంగా మామూలుగానే ఉంటుంది. సదరు స్థూలానికి మాత్రమే స్ఫురణగా ఆ క్షణంలో తెలియనవుతుంది. అస్వస్థత లేకుండా. అనారోగ్యం లేకుండా లేదా జబ్బులు/ రోగాలు లేకుండా. ఇక్కడ యోగ సాధక సమాజంలో ఉన్న అపోహ గురించి చెప్పుకోవలసిన అవసరం ‌ ఈ అపోహ -అంటే ఆరు ఒప్పందాలలో చెప్పిన క్షీణింపు, ఆకృతి మార్పు లేకుండా అనే దానికి అదనంగా జబ్బు కూడ లేకుండా అనేది- రికార్డులకు భిన్నంగా ఉంది అనేది స్పష్టం. కాకపోతే, ఈ అపోహకు మూలం, ఆరంభమైన కాలం గురించి చెప్పుకోనవదు. ఏమిటి అంటే ఆరు ఒప్పందాలలో ప్రస్తుత శరీరమే క్షీణింపు లేకుండా మరియు ఆకృతిలో మార్పు లేకుండా అని మాత్రమే వ్రాయబడి ఉంది. అంటే కర్మ ప్రక్షాళన ముగిసే వరకు -అంటే ఆవిరి రూపంగా కదిలించి కుదిలించబడిన కర్మ పదార్థం ఏక మూలం లేదా ప్రాణం చేత దానిలో విలీనం చేసుకోబడే వరకు- ఆ కర్మ పదార్థం యొక్క ప్రభావం వలన శరీరం జబ్బుకు గురి అవుతూనే ఉంటుంది అని, అది రీచింగు క్షణానికి కొంత ముందు వరకు కానసాగుతూనే ఉంటుంది అని. దీని వలన తెలియనయే విషయం ఏమిటి అంటే జబ్బు అనేది, భరించడం కష్టమే అయినా, కర్మ పదార్థపు ప్రభావం లేకుండా పోవడానికి మార్గం మాత్రమే అని.

10) ఇక్కడ చెప్పుకున్న విషయాలు అధిక శాతం స్థూల స్థాయికి అన్వయం అయేవిగా ఉన్నప్పటికీ, అవి మూల స్థాయిలకు, స్థూల స్థాయిలకు రెండిటికీ సంబంధించినవి అని తెలియనగును.

11) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?

12) మూల ప్రాణ సంబంధంగా చెప్పబడిన ప్రస్తుత విషయాలు పంపకపు మూల సూత్రాల ప్రకారం వ్యక్తి స్థాయిలకు పంచబడినపుడు ఎలా ఉంటాయి లేదా ఎలా చోటు చేసుకుంటాయి అనేది ప్రస్తుతానికి కేవలం అనూహ్యమే అని తెలియనగును.