సమాధానం నెం.651 - ప్రశ్న నెం.651 (20-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - బయటికి వికీర్ణం చెందడం".
Posted: Mon Nov 25, 2024 7:48 am
1) "బయటికి వికీర్ణం చెందడం అనేది ఒక్కటే వేచి ఉంచబడిన విషయం. తన లక్షణాన్ని వికీర్ణం చెందించకుండా విశ్వ వత్తిడి నడుమ తేలియాడుతున్న దాని లాగ ఆంతరికం ఉంచబడింది" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయం అయిన "స్వయం యొక్క దేహ వ్యవస్థలో నింపబడిన వ్యూ కుండలిని యొక్క రిటార్షను వలన వ్యాపించేలా చేయబడింది" (ప్రశ్న, సమాధానం నెం.650 విషయం "యోగా రికార్డుల విషయాలు - నింపబడిన వ్యూ" అనే దానికి కొనసాగింపు అని చెప్పుకోనయినప్పటికీ, ప్రస్తుత ప్రశ్న విషయానికి ముందు 1-6-1921 న వ్రాయబడిన ఒక వాక్యాన్ని, 20-6-1921 న వ్రాయబడిన వాక్యాలను ఎత్తి వ్రాసుకోవడం విషయ అవగాహన నిమిత్తం అవసరం. 1-6-1921 నాటి వాక్యం - "ఒలిడియరు రెగ్యులేషను ధనుర్లగ్నంలో పనిచేస్తోంది." 20-6-1921 నాటి వాక్యాలు - "స్వయంకు ఇవ్వబడిన ప్రస్తుత రెగ్యులేషనుకు ఇంకా 3 నెలలు పడుతుంది. దేహ వ్యవస్థ లోని ప్రాణం యొక్క తీవ్ర ఉష్ణోగ్రతను అది ఎలా తట్టుకుంటుందో పరీక్షించడానికి ఇది ఇవ్వబడింది." ఈ వాక్యాల గురించి చిన్న వివరణ. విషయంగా లోతులకు వెళ్ళకుండా, తొమ్మిదవ రాశి లేదా లగ్నం అయిన ధనుస్సు లేదా ధనుర్లగ్నం యొక్క మూల స్థితికి, తొమ్మిదవ శూన్య స్థితి అయిన సృష్టికి మధ్య ఏదో లింకు ఉంది అని చూచాయగా అందుతున్న విషయం, మూల స్థాయి లోతులు బయటపడడం ప్రస్తుతానికి వీల్లేదు అనే విధంగా. ఈ సందర్భంగా ఒలిడియరు రెగ్యులేషను గురించి ఒక అతి ముఖ్యమైన సమాచారం. ఏమిటి అంటే. 1921 ఏప్రిల్లో జరిగిన జనరల్ కాల్ రెండవ రోజు సాయంత్రం నుండి ఒలిడియరు రెగ్యులేషను ఉదయం, సాయంత్రం జనరల్ ప్రాక్టీసుగా మాస్టరు నామం స్థానే, 4-4-1921 నుండి మాస్టరు నామం తోనే చేయబడుతూ వస్తోంది అని, ప్రస్తుతం 20-6-1921 న జరుగుతున్న వర్కు సమయంలో కూడ అదే కొనసాగుతోంది అని. 20-6-1921 వ్రాయబడిన "స్వయంకు ఇవ్వబడిన రెగ్యులేషను" అని అన్నపుడు, ఆ వర్కు "నింపబడిన వ్యూ వ్యాపించేలా చేయబడింది" అనేదిగా తెలియనగును.
3) బయటికి వికీర్ణం చెందడం అనేది ఒక్కటే వేచి ఉంచబడిన విషయం. బయటికి వికీర్ణం అనే మాటలకు వివరణ చెప్పుకోబోయే ముందు, తెలియవలసిన, తెలిసి తీరవలసిన విషయం ఏమిటి అంటే ఈ జరిగే ప్రక్రియలు సమస్తం మూల స్థాయిలకు, మూల స్థాయి స్థూలానికి మాత్రమే సంబంధించినవి తప్ప, మాస్టరు గారికి గానీ, సృష్టి స్థాయిలకు గానీ సంబంధించినవి కావు అని. ఎందుకు అంటే ఇవి అర్థం కావడం మామూలుగానే అసాధ్యం అయినప్పటికీ, దీనికి భిన్నమైన భావన వలన అవి అర్థం కావడం కేవలం అసంభవం మాత్రమే అవుతుంది గనుక. బయటికి వికీర్ణం చెందడం అని అన్నపుడు, ఆంతరికంగా మూల ప్రాణం లేదా ఆరిజిను లేదా డైరెక్టు లైను మాస్టరు లేదా మొదటి ఆది యొక్క మూల స్థాయి స్థూలానికి/ స్థూలంలో జరుగుతున్న ప్రక్రియ మూల స్థాయిదిగా మూల సృష్టికి (9వ శూన్య స్థితి అయిన మూల సృష్టికి) వికీర్ణం చెందడం లేదా కిరణ రూపంగా ప్రసారం కావడం అని తెలియనగును. అనేది ఒక్కటే వేచి ఉంచబడిన విషయం. స్పష్టమేనని అనిపిస్తున్నా, వికీర్ణం చెందడం అనే దాని లోతులు తదుపరి మాటలలో స్పష్టంగా తెలియనవుతుంది.
4) తన లక్షణాన్ని వికీర్ణం చెందించకుండా. తన. తన యొక్క. వ్యూ యొక్క. సంకల్పం యొక్క. సంకల్పం మూల ప్రాణం లోనే బయలుదేరినప్పటికీ, వ్యూ మూల ప్రాణంలో నిండడం ఎలా అయితే అవసరం అయ్యిందో, అదే మాదిరిగా వ్యూ మాత్రమే వికీర్ణం చెందడం, దాని లక్షణం వికీర్ణం చెందకుండడం అనేది విషయం. ఒక విధాన పరమైన లోతుల సృష్టి స్థాయి విషయంతో దీనికి కొంత స్పష్టత వచ్చే అవకాశం. సూర్యుని కిరణాల వలన మానవ దేహాలకు వేడిమి ప్రసరిస్తుంది అనేది మాత్రమే ఒక వాస్తవ విషయంగా సృష్టికి తెలుసు. కానీ, కిరణాల లోతులలో లక్షణ పరమైన కార్యక్రమం ఒకటి నడుస్తోందని చూచాయగా కూడ తెలియని, తెలియరాని విషయమే. సూర్యుడు కర్మ సాక్షి అనే మాటల లోతులలో యోగ పరంగా బయటపడిన విషయమే లక్షణ సంబంధమైన లేదా కిరణాల లక్షణ సంబంధమైన అంశం. అదే కిరణాల మాధ్యమంగా ఎవరి ప్రారబ్ద సంబంధమైన కార్యక్రమాలు వారికే అన్వయం అయ్యే విధంగా సృష్టి వాతావరణానికి, వ్యక్తి ఆంతరికానికి మధ్యన ఉన్న సారూప్య అవినాభావ సంబంధం ఆధారంగా జరుగుతున్న సృష్టి స్థాయిల మానవ సంబంధ కర్మ పరమైన కార్యక్రమం. తన లక్షణాన్ని వికీర్ణం చెందించకుండా అని అన్నపుడు, ఈ అన్వయం తోనే అర్థం చేసుకోవలసిన విషయం.
5) విశ్వ వత్తిడి నడుమ తేలియాడుతున్న దాని లాగ. విశ్వ వత్తిడి. స్పష్టంగా తెలియవలసిన అవసరం ఉన్న మాటలు. సృష్టి ఆరంభం మొదలుకుని -ముఖ్యంగా మానవ సృష్టి ఆరంభం మొదలుకుని- మనిషిలో మేథస్సు పరిఢవిల్లడం ఆరంభం అయిన నాటి నుండి పైనుండి వచ్చిన ఆధ్యాత్మిక సాహిత్యానికి మేథావి మహానుభావులు చేసిన మేథో భాష్యాలు, దానికి అనుగుణంగా వాక్రుచ్చిన శాస్త్రాలు, సూత్రాలు, సంహితలు, వగైరాలు మానవ సమాజానికి మార్గదర్శకం అయ్యాయి. మేథావి మహానుభావులను ప్రశ్నించిన వారు, వారు చెప్పిన విషయాలతో విభేదించిన వారు వితండవాదులుగా పరిగణించబడ్డారు. మేథో మహానుభావుల సృష్టి అయిన దేవుళ్ళను, దేముళ్ళ అంశాన్ని విరోధించిన వారు నాస్తికులు అయ్యారు. మేథో మహానుభావుల మేథో పూరిత వ్యాసంగాలే విశ్వ విధానం అయ్యింది. దానికి భిన్నమైన భావనను కలిగి ఉండడం అనే దాని మీద విశ్వ విధానపు ప్రభావం పనిచేస్తుంది అనేది అక్షర సత్యం. ఆ ప్రభావమే విశ్వ వత్తిడి. ఇక్కడ చెప్పుకున్నది అంతా సృష్టి స్థాయిల సంబంధం, అర్థం అయినా కాకపోయినా. అలాంటి విశ్వ వత్తిడి నడుమ తేలియాడుతున్న దాని లాగ. సాంద్రత ఎక్కువగా ఉన్న దానిలో లేదా ఉన్న దాని మీద (ముఖ్యంగా ద్రవ రూప సంబంధంగా) తేలియాడుతుంది అనేది గ్రహించదగిన విషయమే. దానినే ఇక్కడ అన్వయించుకోవలసిన అవసరం.
6) ఆంతరికం ఉంచబడింది. తన లక్షణాన్ని వికీర్ణం చెందించకుండా వ్యూ యొక్క ఆంతరికం ఉంచబడింది. ఇక్కడ విధాన పరమైన ఒక విషయాన్ని, ఇంతకు ముందు ఎంతో గుంభనంగా పరోక్షంగా మాత్రమే చెప్పుకోబడినప్పటికీ, చెప్పుకోవలసిన అవసరం. తాకడం, చొచ్చుకుపోవడం, లోపలి తత్త్వాన్ని బయటికి నెట్టడం, తన తత్త్వాన్ని దాని లోపల క్రమేణా నింపడం అనేది విధానం. దానికి అనుగుణంగా, కొంత భిన్నంగా కూడ, ఇక్కడ విషయం ఏమిటి అంటే వ్యూ బయటికి వికీర్ణం చెందడం, అది కూడ తన లక్షణాన్ని వికీర్ణం చెందించకుండా. అటుపిమ్మట కొన్ని ప్రక్రియల అనంతరం లక్షణాన్ని వికీర్ణం చెందించడం.
7) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
8) ప్రస్తుత ప్రశ్న విషయం లోని వివరణ అర్థం కావడమే (అది అంత తేలికగా సాధ్యం కాదు) విశేషం అని తెలియనగును.