Page 1 of 1

ప్రశ్న నెం.670 (28-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ముందస్తు ఆలోచనతో ఈ లైనును పనిచేయించడం".

Posted: Sat Dec 28, 2024 7:47 am
by Katakam
1) "ముందస్తు ఆలోచనతో ఈ విధానాన్ని పనిచేయించడం అనే వివేక పూరితమైన పద్ధతి పాటించబడి ఉండలేదు. మనసుకు ఏ రకమైన బయటి ఆకర్షణ, వ్యాకులత లేకుండా నీవు విడిగా జీవించి ఉండవలసింది. మీ పిల్లల పట్ల నీకు ఉన్న ప్రేమ నిన్ను కఠినంగా ఉండనివ్వలేదు, వాళ్ళు చెడిపోయిన వాళ్ళుగా తయారవడానికి ఇది కారణం అయి ఉంది" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?