1) "తీసుకునే ఆహారం కొంచెమే అయినా దేహ వ్యవస్థ మరీ అంత బలహీనంగా ఉండదు. అవయవాల కార్యక్రమం సరిగానే పనిచేస్తుంటుంది, సాధారణ జీవితంలో 30 సంవత్సరాల సత్తువను చూపేటందుకు గాను క్షీణ స్థితిని కనబరచదు" - మాస్టరు గారి డైరీలలో 21-4-1922 న "సూచన" అనే శీర్షిక మరియు "స్వయం యొక్క దేహ వ్యవస్థ" గురించి అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ఏ విషయానికి కొనసాగింపు కాదు అని, కానీ ప్రస్తావన చేయబడుతున్న సూచనల తీరును గమనిస్తే, ఏవో నిగూఢమైన విషయాలు తొంగిచూస్తున్నాయి అని తెలియనగును.
3) తీసుకునే ఆహారం కొంచెమే అయినా దేహ వ్యవస్థ మరీ అంత బలహీనంగా ఉండదు. తీసుకునే ఆహారం కొంచెమే అయినా అని అన్నపుడు, స్పష్టంగా తెలియవలసిన ఖచ్చితమైన విషయం ఏమిటి అంటే కొంత కాలంగా మాస్టరు గారు తీసుకునే ఆహారం కొంచెం గానే ఉంటోంది అని. ఈ వాక్యం లోని మిగతా భాగానికి వెళ్ళబోయే ముందు ప్రశ్నించుకోవలసిన విషయం ఏమిటి అంటే మాస్టరు గారు ఆహారం కొంచెం గానే తీసుకోవడం అనే దానికి చెప్పుకోదగిన కారణం ఏమయినా ఉందా అనేది. ఉంది అనేది సమాధానం. సమాధానం ఉంది అని వచ్చింది గనుక, తత్సంబంధిత విషయం కూడ రావలసిందే కదా. కాకపోతే, విషయం రావడంలో మాస్టరు గారు కొద్ది రోజులలో స్థూలం వదిలిపెట్టబోతున్నారు అనే విషయాన్ని కూడ దృష్టిలో ఉంచుకుని విషయాన్ని చెప్పుకోవలసిన అవసరం. ఏమిటి అంటే. కొంత కాలంగా మాస్టరు గారు ఆహారం కొంచెమే తీసుకోవడం. దీనికి కారణం యోగ సంబంధ ప్రక్రియల ప్రభావమా లేదా ఆరోగ్య సంబంధమా అని ప్రశ్నించుకుంటే, రెండూనూ అనేది సమాధానం. తీవ్రాతితీవ్ర ముగింపు దశల ప్రక్రియల ప్రభావం యోగ సంబంధం అయితే, కొద్ది కాలంలో స్థూలం వదిలి పోవడానికి ఆంతరికంగా సిద్ధం కావడం ఆరోగ్య సంబంధం, సూక్ష్మంగా. దేహ వ్యవస్థ మరీ అంత బలహీనంగా ఉండదు. బలహీనంగా ఉంది అనేది ఖచ్చితం. కాకపోతే, దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వీలు లేని విధంగా మరీ అంత బలహీనంగా కాదు అనేది ఇక్కడి విషయం.
4) అవయవాల కార్యక్రమం సరిగానే పనిచేస్తుంటుంది. అవయవాల కార్యక్రమం అని అన్నపుడు, బాహ్య క్రియలను నిర్వర్తించే బాహ్య శరీర అవయవాలు, శరీరం లోపల ఆంతరిక క్రియలను నిర్వర్తించే ఆంతరిక అవయవాలు అని తీసుకోనగును. అంటే అవయవాల కార్యక్రమం సరిగానే పనిచేస్తుంటుంది లేదా వాటి కార్యక్రమంలో ఎలాంటి తేడా ఉండదు అని.
5) సాధారణ జీవితంలో 30 సంవత్సరాల సత్తువను చూపేటందుకు గాను క్షీణ స్థితిని కనబరచదు. సాధారణ జీవితంలో. సాధారణ జీవితంలో అని అన్నపుడు, మాస్టరు గారి డైరీల లోనే చెప్పబడిన "యోగా ప్రాక్టీసును ఫిజికల్ అసిస్టుమెంటు కోసం ఉపయోగించకూడదు" అనే ఆంక్ష లోని లోతుల అర్థం అయిన "యోగా ప్రాక్టీసు అదిగా ఫిజికల్ అసిస్టుమెంటు కోసం ఉపయోగపడడం" అనే దానిని ఇక్కడ అన్వయించుకోవచ్చునా అనేది ప్రశ్న. అన్వయించడానికి వీల్లేదు అనేది నిశ్చయమైన సమాధానం. ఎందుకు అంటే ఇక్కడ ప్రస్తుతం చెప్పబడుతున్న విషయం యోగ విధాన పరమైన సూత్ర ప్రాయంగా మాత్రమే చెప్పబడింది గనుక, దానిని మాస్టరు గారికి గానీ, మీడియములకు గానీ స్థూల స్థాయి ప్రక్రియగా అన్వయించనవదు గనుక, అప్పటికి అలాంటి పరిస్థితి -అంటే సాధారణ జీవితంలో లేదా జీవన సంబంధ వ్యవహారాలలో యోగా ప్రాక్టీసు పరంగా ప్రయోజనం కలగడం- నెలకొనలేదు అనేది ఎంతో సమంజసంగా చెప్పుకోనయిన విషయం గనుక.
6) 30 సంవత్సరాల సత్తువను. 30 సంవత్సరాల వయసులో ఉండే సత్తువను. 30 సంవత్సరాల సత్తువ అని అన్నపుడు, వయసు పరంగా 30 సంవత్సరాలకు శారీరికంగా పూర్తి స్థాయి సత్తువ ఉంటుంది అనేది ఇక్కడి విషయం. దీనిని సాధారణ జీవితంలో సాధారణ విషయంగా మాత్రమే తీసుకోనవుతుంది. మాస్టరు గారి కాలం నాటికి ఇది శారీరికంగా మాత్రమే కాక మానసికానికి కూడ అన్వయించనవుతుంది. ఇక్కడ చెప్పుకోదగిన విశేషమైన ఒక విషయం ఏమిటి అంటే తరం మార్పు అనేది -అంటే ఒక తరానికి ఇంకొక తరానికి, ముఖ్యంగా మానసిక/ మేథో స్థాయిలలో లేదా తెలివితేటలు, కళలకు సంబంధించిన ప్రగతి/ డెవలప్మెంటు వగైరాలలో, కలిగే మార్పు అనేది- వేగవంతం అవుతుంది అని యోగా రికార్డులలో చెప్పబడిన దానికి అనుగుణంగా అత్యంత శీఘ్ర గతిని సంతరించుకున్న తరం మార్పును గత 24 సంవత్సరాలుగా (టెంత్ రొటేషన్ వర్కింగ్ వండర్స్లో భాగంగా) చూడనవుతుంది.
7) చూపేటందుకు గాను. పైన చెప్పుకున్నట్లుగా, చూపేటందుకు గాను లేదా 30 సంవత్సరాల సత్తువను చూపేటందుకు గాను అనేది కూడ యోగ విధాన పరంగా సూత్ర ప్రాయంగా మాత్రమే చెప్పబడిన విషయం అని తెలియనగును. అంతేకాదు, 30 సంవత్సరాల సత్తువను స్థూలంలో/ స్థూలంగా చూపడం అనేది మాస్టరు గారి కాలానికి అప్పటికి గానీ, ఆ తరువాత కాలానికి గానీ కాక, అప్పటి భవిష్యత్తుకు మాత్రమే యోగ లక్ష్య సిద్ధికి సంబంధించినదిగా జరగనయేది అని, అది సృష్టి లక్ష్య సిద్ధిలో భాగంగా మాత్రమే అని తెలియనగును. దీనిలో కేవలం విధాన పరంగా చెప్పుకోనయిన విషయం ఏమిటి అంటే మాస్టరు గారి డైరీలలో యోగ పరంగా చేయబడిన యోగ క్రియలు, ప్రక్రియలు సమస్తం మూల స్థాయిలలో జరిపించబడిన ప్రయోగాలు మాత్రమే అని, 12 సంవత్సరాల పర్యంతం నిరంతరాయంగా చేయబడినవి తదుపరి కాలంలో స్థూల స్థాయికి దిగి రావలసిన యోగ పరమైన అవసరం అని, "టెంత్ రొటేషన్ వర్కింగ్ వండర్స్" లో భాగంగా కొన్ని అద్భుతాలు మాత్రమే ప్రత్యేక గమనికకు తెలియబడుతున్నాయి అని, ఇక్కడ చెప్పుకున్న 30 సంవత్సరాల సత్తువను చూపడం అనే దానికి ఇంకా సమయం పట్టవచ్చునని అందుతున్న విషయం అని.
8) క్షీణ స్థితిని కనబరచదు. క్షీణ స్థితిని కనబరచదు అనే మాటలు వినగానే, గుర్తుకు వచ్చేది ఆరు ఒప్ఫందాల లోని "ప్రస్తుత శరీరమే క్షీణింపు లేకుండా" అనే మూడవ ఒప్పందం. ఇది సృష్టి లక్ష్యంలో భాగమైన యోగ లక్ష్యంలో భాగంగా నెరవేరవలసి ఉన్నదే తప్ప నెరవేరింది కాదు అని గమనించనగును. సూత్ర ప్రాయంగా చెప్పిన ఈ మాటలు చెప్పిన సమయానికి మూల స్థాయిల సంబంధం మాత్రమే అయినప్పటికీ, వస్తుతః ఇది కేవలం స్థూల స్థాయికి సంబంధించి మాత్రమే లేదా స్థూల స్థాయిలో మాత్రమే జరగవలసి ఉంది అని తెలియనగును.
9) ప్రస్తుత ప్రశ్న విషయం మాస్టరు గారిని ఉద్ధేశించి చెప్పబడినదే అయినప్పటికీ, అది మాస్టరు గారికి సంబంధించింది కాదు అని అప్పటికి చెప్పుకోలేకపోయినప్పటికీ, మాస్టరు గారు స్థూలాన్ని వదిలివేశారు అనే వాస్తవాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు నిస్సందేహంగా, నిస్సంశయంగా చెప్పుకోనవుతుంది. మరి ఎవరికి/ దేనికి సంబంధించింది అనేది దానికి అప్పట్లో చెప్పబడింది అప్పటి భవిష్యత్తుకు -అంటే ప్రస్తుత వర్తమానానికి, స్వంత స్థూలం తీసుకున్నదిగా తెలియబడుతున్న మూల ప్రాణానికి- సంబంధించింది అని చెప్పుకోనవుతుంది.
10) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
11) యోగా రికార్డులలో ఉన్న వాస్తవాలను అంగీకరించగలిగిన పరిస్థితి ఇంకా రాలేదు అని తెలియనగును.
సమాధానం నెం.691 - ప్రశ్న నెం.691 (8-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - 30 సంవత్సరాల సత్తువ".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm