సమాధానం నెం.002 - ప్రశ్న నెం.2 (4-5-2021) విషయం "ప్రాక్టీసు లేదా యోగా ప్రాక్టీసు".
Posted: Fri May 14, 2021 12:43 pm
ప్రాక్టీసు లేదా యోగా ప్రాక్టీసు అంటే ఏమిటి?
మాస్టరు యోగంలో లేదా భృక్త రహిత తారక రాజ యోగంలో చేయబడే ప్రాక్టీసు లేదా సాధన ప్రాక్టీసు లేదా యోగా ప్రాక్టీసు అనబడుతుంది (ప్రస్తుత విషయానికి సంబంధించి).
ఇతర ఆధ్యాత్మిక సాధనలు అయిన ధ్యానం, ప్రార్ధన, తపస్సు, ప్రాణాయామం కంటే యోగా ప్రాక్టీసు ఏ రకంగా భిన్నం?
ధ్యానం (ధీ + యానం లేదా బుద్ధి పయనం లేదా నిలకడ లేని ఆలోచనలు చేసే మనసు ప్రభావం నుండి బయటపడి బుద్ధి స్థిరంగా ఉండి మనసును గమనించడం), ప్రార్థన (ప్ర + అర్థన లేదా ప్రత్యేకించి వస్తుతః వ్యక్తిగత ప్రాథమ్యాల గురించి అర్థించడం/కోరుకోవడం), తపస్సు (వస్తుతః సృష్టిపరమైన విషయాలను తెలుసుకోవాలి అనే తపనతో మానసిక ఏకాగ్రత ద్వారా తెలియని లోతుల మేథో స్థాయి నుండి -అలా అని తెలియకపోయినా- సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించడం), ప్రాణాయామం (శ్వాస ద్వారా లోపలికి ప్రవేశించే ప్రాణవాయువును పూరక కుంభక రేచకాల ద్వారా యమించడం లేదా క్రమబద్ధం చేయడం) అనేవాటిలో చేయబడే సాధన వ్యక్తి స్థాయి ప్రయత్నాలకు పరిమితం. యోగా ప్రాక్టీసులో వ్యక్తి స్థాయి ప్రయత్నానికి చోటు లేదు. ఇతర సాధనలలో శక్తులు సాధించడం పరమావధి. యోగా ప్రాక్టీసులో శక్తులు సాధించడం అనే మాటకు చోటు లేదు, పైపెచ్చు గత జన్మలలో సాధించిన శక్తులు సైతం నిర్వీర్యమైపోతాయి. ఇతర సాధనలలో వ్యక్తి స్థాయి ప్రమేయం (అంటే జరిగేదానిలో జోక్యం కలిగించుకోవడం) ఉండడం తప్పనిసరి. యోగా ప్రాక్టీసులో వ్యక్తి స్థాయి ప్రమేయం శూన్యం. దానికి సమాంతరంగా ఇతర సాధనలలో వ్యక్తి స్థాయి ప్రయోజనాలకు పాత్ర ఉంటుంది. యోగా ప్రాక్టీసులో వస్తుతః వ్యక్తి స్థాయి ప్రయోజనాలకు పాత్ర లేదు.
యోగా ప్రాక్టీసుకు వాటికి మధ్య పోలిక ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?
యోగా ప్రాక్టీసుకు ఇతర సాధనలకు మధ్య వస్తుతః పోలిక లేదు. కానీ, ఉన్న ఒకే ఒక పోలిక ఏమిటి అంటే రెండిటిలోనూ కూర్చుని మాత్రమే ప్రాథమికంగా ప్రాక్టీసు చేయవలసిన అవసరం.
యోగా ప్రాక్టీసులో చేయబడేది ఏమిటి?
యోగా ప్రాక్టీసులో చేయబడే ఒక క్రమణిక ఏమిటి అంటే కూర్చుని, కళ్ళు మూసుకుని, నమస్కారం చేసుకుని, మాస్టరు నామం లేదా ప్రాక్టీసు నామం అనుకుని, చేతులు మోకాళ్ళ మీద ఉంచుకుని, శరీరం మొత్తాన్ని ఒకే యూనిట్టుగా తీసుకుని లోపల ఏమయినా కదలికలు ప్రకంపనలు తెలుస్తాయేమో గమనించాలి అని భావన చేసుకోవడం. యోగా ప్రాక్టీసులో సాధకుని చేత చేయబడేది కేవలం ఇంతవరకే.
ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే యోగా ప్రాక్టీసు చేయబడేదా లేదా దానికదే యాంత్రికంగా జరిగేదా?
యోగా ప్రాక్టీసు వస్తుతః దానికదే యాంత్రికంగా జరిగేది మాత్రమే. చేయబడేది దానికదే యాంత్రికంగా జరిగే ప్రాక్టీసు ముందు వరకు మాత్రమే.
చేయబడేది అన్నట్లయితే, ఆ చేయబడేది ఏమిటి?
చేయబడేది పైన చెప్పుకున్నట్లుగా ప్రాక్టీసుకు స్థూలంగా సిద్ధమై, మానసికంగా భావన చేసుకోవడం వరకు మాత్రమే.
జరిగేది అన్నట్లయితే, ఆ జరిగేది ఏమిటి?
జరిగేది కేవలం కదలికలు ప్రకంపనలు మాత్రమే. అవి గమనించబడడమే యోగా ప్రాక్టీసు.
కదలికలు ప్రకంపనలు ఎందుకు కలుగుతాయి, వాటిని గమనించేది ఏది అని వేసుకోదగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే భావన చేసుకున్న అనంతరం సాధకునిలో ప్రవేశించే ప్లెంటీ ఆఫ్ ప్రాణా స్థూల శరీరంలోని సూక్ష్మ సూక్ష్మాతిసూక్ష్మ అంతర్భాగాలలో పనిచేస్తుంది. దీనినే యోగ క్రియలు లేదా వర్కింగులు అంటారు. అవి కేవలం సున్నితమైన కదలికలు ప్రకంపనలుగా మాత్రమే జరిగే అవకాశం. ఆ కదలికలు ప్రకంపనలు గమనించబడేది ప్లెంటీ ఆఫ్ ప్రాణా కంటే పై స్థాయిది అయిన ప్రాణం/ప్రాణతరంగం చేత మాత్రమే.