సమాధానం నెం.074 - ప్రశ్న నెం.074 (23-9-2021) విషయం "దానం, ధర్మం".
Posted: Tue Sep 28, 2021 8:03 am
1) దానం, ధర్మం అంటే ఏమిటి?
2) దానధర్మాలు అనే జంట పదాల లోని దానం, ధర్మం అనేవి పుణ్య సంపాదన కోసం మనిషి చేసే పుణ్య కార్యాలుగా భావించబడుతున్నాయి. కాకపోతే, దానం, ధర్మం అనేవి ఒకే కార్యానికి, అంటే ఇవ్వడం అనే కార్యానికి, పర్యాయ పదాలుగా మాత్రమే వాడబడుతున్నాయి. కనీస అర్థంలో అది భిక్షం వేయడంగా పరిగణించబడుతోంది. తనకు ఉన్నంతలో భిక్షం వేయడం మొదలుకుని పుణ్య కార్యాలకు వితరణ చేయడమే దానధర్మాలుగా తీసుకోబడుతోంది.
3) దానం, ధర్మం అనే మాటలను కొంచెం లోతులకు వెళ్ళి చెప్పుకుంటే, దానం అంటే తాను ఇస్తున్నాను అనే భావనతో ఇవ్వడం. ధర్మం అంటే తాను ఇస్తున్నాను అనే భావన లేకుండా మరియు మనిషిగా అది తన విధ్యుక్త ధర్మం అనే భావనతో ఇవ్వడం. రెండిటిలోను సామాన్య ధర్మం అయిన ఇవ్వడం అనేది తోటి వారికి ఓపిన మేరకు సాయం చేయడం అనే పుణ్య కార్యమే, పుణ్య సంపాదనకు ఉద్దేశించిన కార్యమే.
4) దానం, ధర్మం అనేవి కేవలం పుణ్య సంపాదన కోసమేనా?
5) మహానుభావులు, మహాత్ములు ఉగ్గడించిన ఆధ్యాత్మిక సాంప్రదాయంలో మనిషి పుణ్య సంపాదన కోసమే దానధర్మాలు చేయాలి అనేది శాస్త్రం. ఎందుకు చేయాలి అనే దానికి చెప్పబడిన సమాధానం ఏమిటి అంటే పుణ్య కార్యాలతో పరలోక సుఖాలను గడించడం లేదా భగవంతుడిలో ఐక్యం కావడం అనే మోక్షానికి అర్హత సంపాదించుకోవడం. ఏది ఏమయినా, దానధర్మాలు పుణ్య సంపాదన కోసం మాత్రమే అనేది మానవ మానసాలలో నాటుకుపోయిన సృష్టి లక్ష్య విరుద్ధ భావన. ఎందుకు అంటే పుణ్య కార్యాల ఫలితంగా 4పై
న చెప్పిన పరలోక సుఖాలు మరియు భగవదైక్యం మనిషికి, మనిషిగా, మనిషి రూపంగా ఇతర క్రింది స్థాయి జీవ దశల అనంతరం ఏర్పడిన స్థూలం యొక్క ఉనికిని, సుదీర్ఘమైన సృష్టి క్రమవికాసంలో ఒక అర్థం, పరమార్థం ఉన్న మానవ స్థూలం యొక్క ఉనికిని బుద్ధి లేని పరిమితమైన మేథస్సుతో అపహాస్యం చేసినట్లే, చేస్తున్నట్లే కదా.
6) సృష్టి లక్ష్యం ఏమిటో గ్రహింపజాలని మరియు ఆ కారణంగా మనిషికి లక్ష్యమైన మోక్షానికి పూర్తి విరుద్ధమైన అర్థాన్ని ప్రతిపాదించిన మానవ మేథస్సు, ఆ మోక్షం కోసమే పుణ్య సంపాదన అనే భావాన్ని సామాన్య మానవ మానసాలలో విజయవంతంగా నాటుకునేలా నమ్మబలికిన మానవ మేథస్సు మానవ సమాజం మీద సృష్టి లక్ష్య సంబంధంగా చేసిన ఘాతుకానికి ప్రత్యక్ష సాక్ష్యమే కదా.
7) దానం, ధర్మం అనే వాటికి సృష్టి/ యోగ లక్ష్య పరంగా అర్థం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?
8) దానధర్మాలు అనే రెండు పదాలుగా లేదా జంట పదంగా కాక, దానం ధర్మం లేదా దానమే ధర్మం అనే మూల స్థాయి అర్థం, పద ప్రయోగం సృష్టి/ యోగ లక్ష్యానికి సంబంధించింది మాత్రమే కాక లక్ష్యాన్ని చేరడానికి/ చేరుకోవడానికి మార్గాన్ని కూడ గుంభనంగా సూచిస్తుంది. అది ఏమిటి అంటే దానం అనే మాట ఇవ్వడం/ సాయం/ వితరణ అనే సామాన్య అర్థాన్ని మించి ఇచ్చుకోవడం, అర్పించుకోవడం, సమర్పించుకోవడం అనే ప్రక్రియకు ప్రతీక. ఇచ్చుకోవడం/ అర్పించుకోవడం/ సమర్పించుకోవడం అంటే తాను కాని దానిని తనకు ఇచ్చుకోవడం/ అర్పించుకోవడం/ సమర్పించుకోవడం. అదే ఇచ్చుకోవడం/ అర్పించుకోవడం/ సమర్పించుకోవడం అనే దానికి పూర్తి స్థాయి అర్థంగా సర్వ సమర్పణ. సర్వ సమర్పణ అనేది మాటగా అందరికీ పరిచయమే. దాని అసలైన అర్థానికి సంబంధించిన మాటయే, మానవ ఉనికికి అర్థాన్నీ, పరమార్థాన్నీ, దానికి సంబంధించిన ప్రక్రియనీ సూచించే మాటయే దానమే ధర్మం.
9) అంటే దానం -పైన చెప్పుకున్న అర్థం లోని దానం- అనేదే ధర్మం అని. ధర్మం శరీర సంబంధం గనుక, శరీర ధర్మం అనే మాటలోనే ఆ అర్థం ఇమిడి ఉంది గనుక, శరీరం ఏర్పడడానికి ఉన్న ఉద్దేశ్యమే లేదా లక్ష్యమే శరీర ధర్మం గనుక, ఆ ధర్మాన్ని నెరవేర్చడానికి మార్గం దానం అనేదే దానమే ధర్మం అనే పదాల మూల అర్థం.
10) అంటే తనకు ఉన్న దానిని లేదా నేనును/ ప్రాణాన్ని ఆవరించి, ప్రథమ జన్మకు సంక్రమించిన సృష్టి కర్మ భాగాన్ని ఆ నేనుకు/ ప్రాణానికి ఇచ్చుకోవడం, అర్పించుకోవడం, సమర్పించుకోవడం, సమర్పణ చేసుకోవడం, సర్వ సమర్పణ కావించుకోవడం. ఇదే యోగ విధానం లోని ఒక మితి. ఆ మాటలను ప్రస్తావించకుండా వాటికి సంబంధించిన లక్ష్య పరమైన ప్రక్రియను సుదీర్ఘంగా వివరించినవే యోగా రికార్డులు.