Page 1 of 1

సమాధానం నెం.093 - ప్రశ్న నెం.093 (31-10-2021) విషయం "అమ్మవార్లు".

Posted: Fri Nov 05, 2021 7:47 am
by Katakam
1) అమ్మవార్లు అంటే ఏమిటి?

2) అమ్మవార్లు అంటే ప్రస్తుత సృష్టి విధానం లోని సాంప్రదాయ ఆధ్యాత్మికత ప్రకారం మానవ దశ మరియు జంతు దశ జీవుల చేత పూజలు అందుకుంటున్న వివిధ స్థాయిల దేవీలు, పురుష దేముళ్ళకు సమాంతరమైన స్త్రీ దేవీలు, ముగ్గురమ్మల మూలపుటమ్మ అని పిలువబడే ఆదిశక్తి యొక్క అంశలుగా పరిగణించబడే దేవీలు. అంతేకాదు, పురాణ ప్రసిద్ధి గాంచిన స్త్రీ దేవీలు (ఉదా: లక్ష్మి, పార్వతి, సరస్వతి, వగైరా) మొదలుకుని గ్రామ దేవతల వరకు, స్థూలంగా జన్మించి కొన్ని మహిమలు చూపించిన ప్రాంతాల వారీ మహిళలకు వారు బ్రతికి ఉండగానూ మరియు చనిపోయిన అనంతరమూ రకరకాల సామాజిక నామాలతో ఆదిశక్తి అనే నామం కూడ జోడించండి పూజలు పునస్కారాలతో కొలువబడుతూ ఉన్న అందరూ అమ్మవార్లే.

3) పురాణ ప్రసిద్ధి గాంచిన చదువుల తల్లి సరస్వతీ దేవి, ధన ధాన్య ప్రదాయిని లక్ష్మీ దేవి, శక్తి స్వరూపిణి మరియు శక్తి ప్రదాయిని పార్వతీ దేవి, పార్వతీ దేవి అంశలుగా అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లు, వాటికి అనుబంధమైన అష్టోత్తర శత శక్తి స్థానాలు, వాటికి అనుబంధమైన షోడశోత్తరశత సహస్ర శక్తి స్థానాలు, వాటిలో కొలువుండి పూజలు అందుకునే అందరూ అమ్మవార్లు గానే పరిగణించబడుతున్నారు. శక్తిమయమైన ప్రస్తుత సృష్టి విధానంలో పురుష దేముళ్ళను లేదా అయ్యవార్లను మించి అమ్మవార్లు మానవ మానసాలలో, అందులో ముఖ్యంగా మహిళా లోకపు మానసాలలో, ప్రముఖ స్థానం వహించి ఉన్న పరిస్థితి.

4) ఏ విధంగా అయితే దేముళ్ళు మానవ మేథస్సు యొక్క సృష్టియో, అదే మాదిరిగా అమ్మవార్లు, రకరకాల విభిన్న స్థాయిల అమ్మవార్లు అందరూ మానవ మేథస్సు యొక్క సృష్టియే, స్థూల జన్మలో మహిమలు చూపించిన వారిని మినహాయించి.

5) మాస్టరు గారి డైరీలో 3-7-1919 న నియంత్రించబడవలసిన అవసరానికి తగినట్లుగా చేయించబడిన "స్త్రీ దేవతా (నీచ అంశల లోని వారు) రెగ్యులేషన్లు" అనే నామం లోనే ఈ విషయం అత్యంత గుంభనంగా సృష్టి స్థాయి లోతుల విషయంగా విశ్లేషించబడి ఉంది. ఏమిటి అంటే ఏకైక శక్తి అధికారిక స్థాయి అయిన అసలు ఆదిశక్తిని, సృష్టి చేసిన ఆదిశక్తిని మినహాయించి, మిగతా అమ్మవార్లు అందరూ నీచ అంశలకు సంబంధించిన వారే అని. ఈ మాట శరాఘాతంగా అనిపించడం సహజమే, ముఖ్యంగా ఉన్నత స్థాయిలుగా పూజించబడుతున్న సరస్వతి, లక్ష్మి, పార్వతి, అష్టాదశ పీఠాల శక్తులు, వగైరా వాటి గురించి. సృష్టి శక్తులకు దేముళ్ళ, అమ్మవార్ల స్థాయిలు కల్పించబడి, విగ్రహాలుగా పూజించబడుతున్న దృష్ట్యా, ఆ భావన సమంజసం అనిపించినా, అసలు వాస్తవం, సృష్టి స్థాయి ప్రక్రియ లోతుల వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధం.

6) అమ్మవార్లకు, భగవతికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

7) అమ్మవార్లు మానవ మేథస్సు యొక్క సృష్టిగా ప్రస్తుత సృష్టి విధానంలో కల్పిత ఛాయా రూపాలు. భగవతి -అసలు ఆదిశక్తికి మరో పేరు- సృష్టి చేసిన స్థాయి, సృష్టిని నడుపుతున్న (సృష్టిని నడపడం అనేది సృష్టిని నిర్వహించడం లేదా సృష్టిని నిర్వహణ చేయడం అనే కార్యక్రమానికి అతీతమైన, భిన్నమైన కార్యక్రమం అని తెలియనగును) స్థాయి. యోగ పరంగా ఆరిజిన్ టూ లేదా రెండవ ఆది అని చెప్పబడిన స్థాయి.

8) మానవ జీవితంలో అమ్మవార్ల పాత్ర ఏమిటి?

9) మనిషికి అందుబాటులో ఉన్న త్రికరణాలు లేదా మూడు సాధనాలు అయిన మనసు (ఆలోచన), వాక్కు (మాట), కాయకర్మ (చేత) అనేవి అమ్మవార్ల లేదా నిజంగా లేని వారి అదుపు ఆజ్ఞలలో వస్తుతః పూర్తిగా ఉన్నాయి అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. ఈ యోగా ప్రాక్టీసు వలన డెవలప్ అయిన గమనికయే ఈ వివరణ బయటపడడానికి ఆధారం.