సమాధానం నెం.006 - ప్రశ్న నెం.6 (8-5-2021) విషయం "ఫారిన్ మ్యాటరు".
Posted: Fri May 21, 2021 12:14 pm
ఫారిన్ మ్యాటరు అంటే ఏమిటి?
ఫారిన్ మ్యాటరు అంటే యోగపరంగా బాహ్య పదార్థం లేదా కర్మ పదార్థం అని అర్థం.
పేరున్న ఒక సీనియరు యోగ సాధకుడు గతంలో ప్రచురించి ప్రచారం చేసిన 'ఫారిన్ మ్యాటరు అంటే విదేశీ పదార్థం' అనే మాటలకు, మాస్టరు గారు డైరీలో లిఖించిన ఫారిన్ మ్యాటరు అనే మాటలకు ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి?
ఏ సంబంధం లేదు.
మాస్టరు గారి కాలంలో మాస్టరు గారి కుటుంబపరంగా జరిగిన ఒక విషయం ఎలాగో ప్రచారమై, దాని ఆధారంగా కొన్ని సామ్యాల దృష్ట్యా రూపకల్పన చేయబడినదే ఆ ప్రచారం అని అనిపిస్తుంది. పుస్తకాలలో ప్రచురితమైన కథనాల ఆధారంగా విషయంలోకి వెళ్తే, వెంకమ్మ గారి గురించి మాస్టరు గారు 'ఆమెలో ఫారిన్ మ్యాటరు ఎక్కువగా ఉంది' అని అనేవారట. ఫారిన్ మ్యాటరు అంటే మామూలు అర్థంలో విదేశీ పదార్థం అని మాత్రమే అనుకోవడానికి అవకాశం ఉన్న దృష్ట్యా, వెంకమ్మ గారిలో విదేశీ పదార్థం ఎక్కువగా ఉంది అని అనుకుని, అప్పట్లో పేరుగాంచిన హెచ్.పి. బ్లావట్స్కీ అనే విదేశీ వనితయే వెంకమ్మ గారిగా జన్మ తీసుకుందని, ఆ కారణంగానే వెంకమ్మ గారిలో విదేశీ పదార్థం ఎక్కువగా ఉందని, మాస్టరు గారి మాటలకు ఆ అర్థాన్ని ఆపాదించినట్లుగా అనిపిస్తుంది. నమ్మదగిందిగానే ఉంది కదా, అది కూడ ఒక పేరున్న సీనియరు యోగ సాధకుడు వ్రాసిన విషయం కూడ కాబట్టి.
ఈ ప్రచారం తప్పకుండా మాస్టరు గారి డైరీలు ఇంగ్లీషులో ఆ తరువాత తెలుగులో ప్రచురణ కాక ముందరి సంగతి అయి ఉండాలి. ఎందుకు అంటే మాస్టరు గారి డైరీలో ఫారిన్ మ్యాటరు అనే మాటకు అర్థం కూడ ఇవ్వబడింది గనుక, వాటిని చదివిన తరువాత అలాంటి ప్రచారం ఎవరూ చేయరు గనుక, ఒక పేరున్న సీనియరు యోగ సాధకుడు అలా చేస్తాడని భావించడం కూడ అసమంజసమే గనుక.
ఫారిన్ మ్యాటరు అంటే మునుపటి ప్రవృత్తులు లేక పూర్వ కర్మలు లేక కర్మసంబంధ విధానం అని మాస్టరు గారి డైరీలో ఉన్న మాటలకు అర్థం ఏమిటి?
మునుపటి ప్రవృత్తులు, పూర్వ కర్మలు రెండూ గత జన్మల కర్మల ప్రభావానికి సంబంధించినవే, వాటి మధ్య తేడా వాటి దారుఢ్యతకు సంబంధించింది.
పూర్వ కర్మలు వాటి అత్యంత బలీయత/కుదింపు కారణంగా మనిషి నైజంలో/స్వభావంలో పూర్తిగా ఇమిడిపోయి ఉంటాయి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే అవే మనిషి నైజం/స్వభావం అయిపోయి ఉంటాయి. ఆ స్వభావంతో/నైజంతో ప్రవర్తించడమే తప్ప, దానికి సంబంధించి తెలియడమనేది ఏమీ ఉండదు.
మునుపటి ప్రవృత్తులు కూడ నైజంలో/స్వభావంలో భాగమే అయినప్పటికీ, వాటి బలీయత/కుదింపు తక్కువగా ఉన్న కారణంగా ప్రవర్తనగా బయటపడడంలో వాటి సంబంధమైన తప్పులు/లోపాలు గుర్తించబడదగి ఉంటాయి.
పూర్వ కర్మలలో మార్పు అనే మాటకు చోటు ఉండదు, మార్పు అసంభవం, ఆ జన్మకు అంతే.
కానీ, మునుపటి ప్రవృత్తుల విషయంలో మార్పుకు సంబంధించి ప్రయత్నం చేయాలనే ఆలోచనకు అవకాశం మాత్రం ఉంటుంది.
మునుపటి ప్రవృత్తులు - ఇవి గత జన్మల కర్మ ప్రభావం యొక్క దారుఢ్యత లేదా తీవ్రత తక్కువగా ఉన్నటువంటివి. అంటే మనసు, మాట, చేత ద్వారా ప్రవర్తనగా బయటపడే విషయాలలో యుక్తాయుక్త విచక్షణకు -అంటే తన ప్రవర్తనలో తప్పు/లోపం ఉంది అని తెలియడానికి- మరియు దానిని మార్చుకునే ప్రయత్నం చేయాలని అనుకోవడానికి అవకాశం మాత్రం ఉంటుంది. అవి ఎంత పాతవి అనే కాల సంబంధం లేకుండా దారుఢ్యత తక్కువగా ఉన్నటువంటివే మునుపటి ప్రవృత్తులు లేదా అచిరకాల ప్రవృత్తులు.
పూర్వ కర్మలు - ఇవి గత జన్మల కర్మ ప్రభావం యొక్క దారుఢ్యత లేదా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటివి. ఎంత ఎక్కువగా అంటే మనసు, మాట, చేత ద్వారా ప్రవర్తనగా బయటపడడంలో ఈషణ్మాత్రం గుర్తించడానికి వీలులేనంత, అసలు ఒక ప్రభావానికి లోబడి ప్రవర్తిస్తున్న కనీస విషయం సైతం తెలియడానికి వీలులేనంత. ఇవి స్వభావంలో లేదా ఉండే తీరు మీద ప్రభావం చూపేదానిలో అత్యంత దారుఢ్యమైన లేదా కుదింపయిన కర్మ భాగం. ప్రవర్తనపరంగా అలా ఉండడమే తప్ప, ఆ ప్రభావాన్ని గుర్తించాలనే ఆలోచన రావడానికి కూడ ఏమాత్రం అవకాశం లేనంత. ఎంత పాతవి అనే సంబంధం లేకుండా దారుఢ్యత దృష్ట్యా మాత్రమే పూర్వ కర్మలు మునుపటి ప్రవృత్తుల కంటె పురాతనమైనవి.
కర్మసంబంధ విధానం - పై రెండిటి కర్మ కేవలం వ్యక్తిగత జన్మలలో చేసిన క్రియల యొక్క ఫలితంగా వచ్చేది మాత్రమే. వ్యక్తి యొక్క ప్రథమ జన్మకు ముందు వ్యక్తిగత క్రియల ఫలితమైన వ్యక్తిగత కర్మకు అవకాశం లేదు కదా. కానీ కర్మ లేనిదే జన్మ ఉండదు. వ్యక్తికి ప్రథమ జన్మకు ముందు, ప్రథమ జన్మకు కారణంగా సృష్టి కర్మ -అప్పటివరకు జరిగిన సృష్టి క్రమవికాసంలో వ్యక్తికి వ్యక్తి స్థాయిదిగా సంక్రమించే కర్మ- సంక్రమించడమే కర్మసంబంధ విధానం. లోతుల అర్థంగా చెప్పుకోవాలి అంటే సృష్టి వికాసంగా జరిగే క్రమమే సృష్టి కర్మ.
సాంప్రదాయబద్ధమైన కర్మవిధానం లోని సంచితం, ప్రారబ్దం, ఆగామి అనేవాటికి పైన చెప్పుకున్న డైరీలోని పదాలకు ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, ఏమిటి, ఎలా?
వస్తుతః సంబంధం లేదు, అవీ ఇవీ రెండూ కూడ కర్మ విభాగం క్రిందికే వస్తాయి అని మాత్రమే తప్ప. అంతే.
డైరీలోనివి వ్యక్తిగత క్రియల ఫలితంగా సంక్రమించే కర్మ యొక్క దారుఢ్యతకు మరియు వ్యక్తికి సంక్రమించే సృష్టి కర్మకు సంబంధించినవి. సాంప్రదాయబద్ధమైన కర్మ భాగాలు కాలసంబంధమైన విభజనకు -అంటే భూత వర్తమాన భవిష్యత్తులకు- సంబంధించినవి.
పైన డైరీలో చెప్పిన కర్మసంబంధ విధానం అనే మాటకు సృష్టిలో ఇంతవరకు చెప్పుకోబడని ప్రత్యేకత లేదా ప్రత్యేక అర్థం ఏమిటి?
ప్రస్తుత సృష్టి గతుల నేపథ్యంలో మనిషి తీసుకునే జన్మలలో ప్రథమ జన్మకు ఏ కర్మ కారణం అవుతుంది అనే ప్రశ్నయే సృష్టిలో ఉత్పన్నం కాలేదు అని చెప్పుకోవడం అసమంజసం కాదని అనిపిస్తుంది. అలాంటి ఒక ప్రశ్నను లేవనెత్తకుండానే, ఏకంగా ఆ ప్రశ్నకు సమాధానమే కర్మసంబంధ విధానం అని డైరీలో ఇవ్వబడింది. వ్యక్తి యొక్క ప్రథమ జన్మకు కారణంగా సృష్టి కర్మ సంక్రమించడం అనేదిగా మానవ సృష్టి ఆరంభానికి ముందే ఉన్నటువంటి విధానం కర్మసంబంధ విధానం. పైన డైరీలో చెప్పబడిన కర్మసంబంధ విధానం అనే మాటకు సృష్టిలో ఇంతవరకు చెప్పుకోబడని ప్రత్యేకత లేదా ప్రత్యేక అర్థం ఇదే.