సమాధానం నెం.106 - ప్రశ్న నెం.106 (26-11-2021) విషయం "మాస్టరు గారి దయ".
Posted: Wed Dec 01, 2021 7:54 am
1) ఇది నరసరావుపేట నుండి శ్రీ వేలమూరి లక్ష్మీనరసింహ మూర్తి గారు అనే యోగ మిత్రుడు తెలుగులో వేసిన ప్రశ్నకు సమాధానం.
2) ప్రశ్న భాగం - ఈ యోగ సాధనలో సాధకులు చాలా మంది అంతా 'మాస్టరు గారి దయ' అని నమస్కారం చేసుకుంటే, అన్ని బాధలు తగ్గుతాయని అంటూ ఉంటారు.
3) సమాధానం - అనడానికి, ఇంకా అనుకోవడానికి మరియు జరిగే వాస్తవానికి మధ్య సమన్వయం అంతగా ఉండకపోవడం అనేది జగమెరిగిన సత్యం. ఎందుకు అనేది వ్యక్తి స్థాయి పరిమితులకు లోబడింది కాక, ఏకంగా ప్రస్తుత సృష్టి విధానానికే సంబంధించింది
గనుక.
4) ఈ అనడం, అనుకోవడం అనేది ఈ కాలానికి క్రొత్త విషయం ఏమీ కాదు. మాస్టరు గారి టైములో కూడ ఇదే పరిస్థితి ఉండింది. మాస్టరు గారి డైరీలలో 21-10-1912 న "మీడియముల గురించి" వ్రాయబడి ఉన్న "కొంతమంది మీడియములు తమ ఫిజికలు అసిస్టుమెంటు (= భౌతిక అవసరాలు తీరడానికి సహాయకారిగా చేసుకోవడం) కోసం కొన్ని కోర్సులు ప్రాక్టీసు చేశారు. ఈ లైను ద్వారా పొందదగింది ఫిజికలు అసిస్టుమెంటు మాత్రమే అనే ఆలోచన తోనే వాళ్ళు ప్రాక్టీసు చేస్తూ పోతున్నారు. దీని వలన వాళ్ళకు నిరాశా పూరిత ఆలోచనలు కలుగుతున్నాయి. తమ ఫిజికలు అసిస్టుమెంటు కోసం వాళ్ళు దీనిని (= ఈ యోగా ప్రాక్టీసును) వాడుకోకూడదు" అనే లిఖిత భాగమే దీనికి ఋజువు.
5) ఈ యోగా ప్రాక్టీసు దేని కోసం ఉద్దేశించబడిందో ఈషణ్మాత్రం తెలియకపోవడమే ఇందుకు కారణం. నేటికీ ఆ పరిస్థితిలో చెప్పుకోదగిన మార్పు రాలేదు అని అనుకోవడం కూడ అసమంజసం కాదేమో అని అనిపిస్తుంది.
6) పై 2వ పేరాలో మాదిరిగా 'మాస్టరు గారి దయ' అని అనుకోవడం అనేది ఈ యోగారంభం ముందు వరకు మాత్రమే కాక, యోగారంభం జరిగిన 111 సంవత్సరాల తరువాత కూడ ఇప్పటికీ అప్రతిహతంగా పనిచేస్తున్న సాంప్రదాయ ఆధ్యాత్మికత (వ్యక్తి పూజలను, వ్యక్తి ప్రాధాన్యతను పెంచి పోషించిన దేముళ్ళ పరమైన ఆధ్యాత్మిక పరంపర, ఒక రకంగా గురువుల పరంపర) యొక్క ప్రభావం మాత్రమే. స్వయంగా మాస్టరు గారు ఎన్ని కష్టాలు, బాధలు, అస్వస్థతలు, మానసిక దైన్యతలకు లోనయ్యారో మాస్టరు గారి డైరీలను పరికించితే తెలుస్తుంది.
7) ప్రస్తుత జన్మకు సంబంధించిన ప్రారబ్ద కర్మను తప్పించుకోవడానికి వీల్లేనంతగా అనుభవించి తీరవలసిందే. దానిని తప్పించడం సృష్టికర్తకు కూడ సాధ్యం కాదు గాక కాదు. అలా తప్పించడం సృష్టి విధానానికే విరుద్ధం. ముఖ్యంగా మూలం గురించి, సృష్టి విధానం గురించి చెప్పిన ఈ యోగ విధానానికి కూడ విరుద్ధం.
8) ఈ యోగా ప్రాక్టీసు యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనేది ఎంతో కొంత స్పష్టంగా అయినా తెలియనంత వరకు, ఏ మానసిక దైన్యం కూడ దూరమయే అవకాశం శూన్యం అని చెప్పుకోవడమే సమంజసం.
9) ఆ మాస్టరు గారు ఎవరు? ఆయన సీ.వీ.వీ. గారేనా?
10) యోగ పరంగా మాస్టరు గారు అని అన్నపుడు, అది మాస్టరు సీ.వీ.వీ. గారే. కానీ, 'మాస్టరు గారి దయ' అని అనుకునే వాళ్ళకు, ఆ మాస్టరు గారు ఎవరో, వారి మనసులో ఏమి ఉందో వారికి మాత్రమే తెలియవలసిన అవసరం కదా.
11) లేకపోతే, ఎవరి సెల్ఫ్ మాస్టరుకు వారు నమస్కారం చేసుకొనుట ద్వారా రోగాలు, కష్టాలు పరిష్కరించుకోవచ్చునా?
12) చేసే ఈ యోగా ప్రాక్టీసు యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనేది ఇదమిత్థంగా తెలిసినా తెలియకపోయినా, రోగాలు కష్టాలు (ప్రారబ్ద కర్మ అనుభవంలో భాగమైన రోగాలు కష్టాలు) పరిష్కారం కావడం అసంభవం అనే విషయం తెలియడం ఎంతయినా అవసరం. ఏ పేరు పెట్టి ఏమి చేసినా, ఎలా చేసినా, ఎంత కాలం చేసినా, ఎంతమంది చేసినా సృష్టి ఆరంభానికి లక్ష్యమైన ఈ యోగ లక్ష్యాన్ని వ్యక్తి స్థాయి అవసరాలు తీర్చడానికి దించి, దిగజార్చి, వ్యక్తి యొక్క రోగాలు కష్టాలు పరిష్కరించుకోవడానికి సాధనంగా వాడుకోగలగడం అనేది కేవలం అసంభవం. ఎందుకు అంటే ఈ యోగం ఆరంభం కావడం వెనుక ఉన్న సంకల్పం సృష్టి స్థాయిలను మించి అత్యంత బలీయమైనది, సృష్టించబడిన బుద్ధి జీవి మనిషి యొక్క కుసంస్కార మేథో పరిమితులకు ఏ విధంగా కూడ లోబడేది కాదు. సృష్టి చేత మనిషి శాసించబడే వాడే తప్ప, మనిషి సృష్టిని శాసించేవాడు ఎన్నటికీ కాలేడు, సృష్టి/ యోగ లక్ష్యం నెరవేరిన తరువాత కూడ.