సమాధానం నెం.119 - ప్రశ్న నెం.119 (22-12-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం, 7 ప్రశ్నలు - 2వ ప్రశ్న"

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3868
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.119 - ప్రశ్న నెం.119 (22-12-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం, 7 ప్రశ్నలు - 2వ ప్రశ్న"

Post by Katakam »

1) 1వ ప్రశ్నకు, "మోక్షం అంటే ఏమిటి, ఇది మీకు తెలియాలి" అనే 2వ ప్రశ్నకు సంబంధం ఏమిటి?

2) కేవలం ప్రశ్నను బట్టి కాక, అది ఉత్పన్నం కావడానికి వెనుక ఉన్న కారణాల లోతులకు వెళ్ళి పరిశీలించగలిగితే, 1వ ప్రశ్నకు మరియు 2వ ప్రశ్నకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే 1వ ప్రశ్నకు సమాధానం 2వ ప్రశ్న లోనే ఉంది అని.

3) మరి అలా అని డైరెక్టుగానే చెప్పవచ్చు కదా, ఇలా అర్థం కానంత గుంభనంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే విధాన పరంగా ఏ మనిషికి అయినా తనకు బాగా తెలుసును అని అనిపించే ఏ విషయానికి అయినా భిన్నమైన ప్రతిపాదనను అంగీకరించడం అంత తేలికైన విషయం కాదు, దాదాపు అసంభవం అని చెప్పుకోవచ్చు; ప్రస్తుత సృష్టిలో ఉన్న ఈ విధానాన్ని ఈ యోగ విధానంలో -అంటే లోతులలో నిల్వ అయి ఉన్న గత జన్మల సారమైన గొప్ప జ్ఞానం, అనుభవం అనే కర్మ పదార్థాన్ని కదిలించి, కుదిలించి కూరుకుపోయిన చోటు నుంచి బయటికి నెట్టడం అనే ఈ యోగ విధానంలో- భాగంగా విషయాన్ని చెప్పడంలో గుంభనత్వాన్ని పాటించి, కదలని ఆ లోతులను కదిలించి కుదిలించి, విషయపు లోతులకు వెళ్ళాలి -అది సాధ్యం అయినా కాకపోయినా- అనే ఒక బలమైన కుతూహలాన్ని రేకెత్తించడం అనేది గుంభనత్వానికి కారణం. ఎందుకు అంటే ఎవరు ఎంత గట్టిగా మొత్తుకుని చెప్పినా, తమకుగా తెలిసి వచ్చిన విషయానికి ఇచ్చే విలువ అసాధారణమే గనుక.

4) రెండవ ప్రశ్నకు వివరణ ఏమిటి?

5) ఎవరికి వారికి తెలియడం అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని కుతూహలం రేకెత్తించబడినా, దేనికి సంబంధించి కుతూహలం పనిచేసిందో, దానికి సమాధానం -అంటే కుతూహలానికి లేదా కుతూహలం యొక్క బలీయతకు కాకుండా, కుతూహలం కలగడానికి వెనుక ఉన్న కారణానికి సమాధానం- రావడానికి రహస్యపు జాడ కూడ రెండవ ప్రశ్నలో ఇవ్వబడింది.

6) అదే "మోక్షం అంటే ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి" అనేది. అంటే మోక్షం అంటే ఏమిటో మీకు తెలిసి, మీ లోతులలో నిక్షిప్తమైనది కాదు, దానికి భిన్నమైన, అతీతమైన అసలు అర్థం ఉంది, అది తెలుసుకోబడాలి అనేదే రెండవ ప్రశ్న యొక్క వ్యక్తం చేయబడని లోతుల ఉద్దేశ్యం. తెలుసుకోమని చెప్పడం లేదా తెలియడానికి వీలు లేనంత గుంభనంగా చెప్పడమే యోగ సాహిత్య లక్షణం, యోగ విధానం.

7) ఇప్పుడు పైన చెప్పుకున్నది అంతా ప్రశ్నకు సంబంధించిన వివరణయే తప్ప, ప్రశ్నకు సమాధానం కాదని, సమాధానానికి సంబంధించిన వివరం కాదని స్పష్టంగానే తెలుస్తుంది. ఇదివరకు అనేక సందర్భాలలో మోక్షం అనే మాటకు అర్థం చెప్పుకున్నప్పటికీ, ఈ ప్రశ్నల వరవడిని -అంటే 1వ ప్రశ్నకు 2వ ప్రశ్న సమాధానం కావడం, అలాగే 2వ ప్రశ్నకు 3వ ప్రశ్న సమాధానం అవుతుంది అనే వరవడిని- దృష్టిలో ఉంచుకుని, 3వ ప్రశ్నకు అనుసంధానించి 2వ ప్రశ్నకు సమాధానాన్ని వివరంగా తెలుసుకోవలసిన అవసరం.

8) ఈ యోగ లక్ష్య సిద్ధిలో ఈ ప్రశ్న యొక్క ప్రాధాన్యత ఏమిటి?

9) ప్రశ్నకు సమాధానం అవసరం. కానీ, ప్రశ్న యొక్క అవసరం ఏమిటో కూడ తెలియవలసిన అవసరం. లోతులకు వెళ్ళి చెప్పుకుంటే, ఉన్న సమాధానాన్ని బయటికి రప్పించడం కోసమే ప్రశ్న. కోట్ల కోట్ల కోటానుకోట్ల సంవత్సరాల సృష్టి క్రమవికాసంలో అలా మేథస్సుకు అంది, దానికి తార్కికత మరియు హేతుబద్ధత జోడించబడి, మానవ మానసాలలో సృష్టించబడిన దేముళ్ళ అంశం ఆసరాతో ప్రతిష్ఠించబడి, వ్యక్తి దేహ వ్యవస్థ మరియు విశ్వ/ సృష్టి వ్యవస్థ సమస్తం అణువణువునా నిక్షిప్తమై కూరుకుపోయిన/ పాతుకుపోయిన మోక్షం అనే మాటకు చెప్పబడిన విపరీత అర్థానికి భిన్నమైన అసలైన సృష్టి లక్ష్య సంబంధ, మానవ ఉనికి లక్ష్య సంబంధ అర్థాన్ని వెలికితీయడమే ఈ ప్రశ్న యొక్క ఉద్దేశ్యం, ప్రాధాన్యత.
Post Reply