సమాధానం నెం.126 - ప్రశ్న నెం.126 (5-1-2022) విషయం "దెయ్యాలు/ ప్రేతాత్మలు".
Posted: Mon Jan 10, 2022 8:04 am
1) దెయ్యాలు అంటే ఏమిటి?
2) ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం అయిన విషయంగా, దెయ్యాలు అంటే స్థూలంగా జీవించి ఉండగా బలీయమైన కోరికలు ఉండి, అవి తీరని కారణంగా సూక్ష్మ లోకాలకు వెళ్ళలేక, ఆ కోరికల బంధనం కారణంగా భూమి పరిధుల లోనే ఉండిపోయి, ఆ కోరికలతో సూక్ష్మమైన అనుగుణ్యత ఉన్న వేరే శరీరాల ద్వారా వాటిని తీర్చుకోవడానికి ఆ కోరికలు తీరే వరకు సూక్ష్మంగా భూ పరిధులలో ఉండిపోయే ఆత్మలు అని అర్థం. ఇది ఒక రకంగా సాంప్రదాయ బద్ధంగా ప్రచారం పొందిన సమాచారం మాత్రమే. దీనిలో అసంబద్ధమైన విషయాలు కొన్ని ఉన్నాయి అని గ్రహించనగును. అవి తదుపరి విషయాలలో వెల్లడి అవుతాయి.
3) దెయ్యాలకు, దైవానికి సంబంధం ఏమిటి?
4) భాషా పరంగా చెప్పబడిన దైవం ప్రకృతి (సంస్కృత మాతృక పదం), దెయ్యం వికృతి (ప్రకృతికి తెలుగు భాషా పదం) అనే పద సామ్యంలో విషయాలు వెల్లడి అయే అవకాశం, సాంప్రదాయవేత్తలు ఆ మాటలకు చెప్పిన మేథో పరిమిత అర్థాల ప్రభావం నుండి బయట పడగలిగితేనే. ఒక్క మాటలో చెప్పాలి అంటే దైవం, దెయ్యం అనేవి ఒకే మాటకు చెందిన భిన్న భాషా ప్రయోగాలు. కాకపోతే, దైవం అనే మాట దాని అసలైన భగవత్తత్త్వం అనే అర్థంలో కాక, వ్యక్తి రూపానికి దించబడిన/ దిగజార్చబడిన భగవంతుడు అనే పదాన్ని, ఇంకా దించి/ దిగజార్చి దేముడు/ దేముళ్ళు అనే లేనివి, సృష్టించబడినవి అయిన వాటి యాస్ట్రలు స్థాయి అర్థంలో మాత్రమే.
5) దేముడు అనే మాటకు, వికృతి రూప పదమైన దెయ్యం అనే మాటకు రెండిటికీ ఉన్న సంబంధం యాస్ట్రలు స్థాయి అర్థంలో మాత్రమే. దీనినే సాంప్రదాయ బద్ధంగా చెప్పబడిన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే వాటిలో సూక్ష్మ శరీరంగా తీసుకోనవుతుంది. స్థూలాన్ని విడిచిన అనంతరం భూమి పరిధులలో ౼ఖచ్చితంగా చెప్పాలి అంటే భూమి ఉపరితల నుండి బాహ్యానికి విస్తరించి ఉన్న 3000 మైళ్ళ ఈథరిక్/ ఆకాశ పరిధిలో౼ ఉండిపోయే దెయ్యం లేదా ప్రేతాత్మ యాస్ట్రలు/ సూక్ష్మ సంబంధమే, కారణ శరీరంగా పిలువబడే ఆత్మ సంబంధం (సృష్టికి అందని విషయంగా ప్రాణ సంబంధం) లేదా దైవ సంబంధం కానేరదు.
6) దెయ్యాలకు, మనుషులకు సంబంధం ఏమిటి?
7) కేవలం స్థూలానికి, స్థూల స్థాయికి పరిమితమై, మనిషి లోనే ఉన్న సూక్ష్మం గురించి, సూక్ష్మ స్థాయి గురించి ఏమాత్రం అవగాహన లేని మనిషికి, మనిషి మరణానంతరం బలీయమైన స్థూల స్థాయి బంధనాల కారణంగా ఆ బంధనాల నుండి విముక్తి కలిగే వరకు భూమి పరిధులలో ఉండిపోయేది సూక్ష్మం లేదా సూక్ష్మ శరీరమే అనీ, అసలైన అర్థం లోని ఆత్మకు లేదా ప్రాణానికి లేదా సాంప్రదాయంలో చెప్పబడిన కారణ శరీరానికి ఎలాంటి ఏ బంధనాలు ఉండవు అనీ తెలియడం అసంభవమే కదా. ఆత్మ అనే పదానికి అసలైన లోతుల అర్థం తెలియక, తాముగా తమకే తెలియకుండా ఆత్మ అనే పదాన్ని అర్థం కావడానికి/ చేసుకోవడానికి వీల్లేని విధంగా సాంప్రదాయ వేత్తలు ప్రయోగించడం కూడ ఇందుకు ఒక కారణం.
8) దెయ్యాలకు సృష్టి లక్ష్యంలో పాత్ర ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?
9) సాంప్రదాయ పరంగా చెప్పిన అర్థంలో దెయ్యాలకు సృష్టి లక్ష్యంలో ఎలాంటి స్థానం లేదు, పాత్ర లేదు. సాంప్రదాయ పరమైన అర్థంలో, కోరికలు తీరి, బంధనం నుండి విముక్తి కలిగిన తరువాత దెయ్యం లేదా ప్రేతాత్మ అనే మాటకు చోటే ఉండదు. కానీ, దైవం ప్రకృతి, దెయ్యం వికృతి అని చెప్పుకున్ధ దాని ప్రకారం, కోరికలు తీరని కారణంగా, కోరికలు తీరవలసిన అవసరానికి అనుగుణంగా స్థూలానికి లేనటువంటి గొప్ప శక్తులు కలిగినదిగా, సృష్టి లక్ష్య మార్గంలో బలీయమైన కోరికల బంధనం నుండి విడిపించే స్థాయిగా దెయ్యాన్ని/ ప్రేతాత్మను తీసుకోనగును.