సమాధానం నెం.128 - ప్రశ్న నెం.128 (9-1-2022) విషయం "తలాలు, ఉప తలాలు".
Posted: Fri Jan 14, 2022 7:49 am
1) తలాలు, ఉపతలాలు అంటే ఏమిటి?
2) సృష్టి విధానంలో, సృష్టి నిర్మాణ పరంగా, సృష్టి క్రమవికాసానికి అనుగుణంగా మనిషిలో ఏర్పరచబడిన స్థాయిలనే/ భాగాలనే యోగ పరంగా తలాలు అని, ఆ తలాల లోని విభాగాలను లేదా భాగాల లోని భాగాలను ఉపతలాలు అని పేర్కొనడం జరిగింది.
3) వస్తుతః ఫిజికలు (స్థూలం), యాస్ట్రలు (నక్షత్రకం), మెంటలు (మానసికం), బుద్ధిక్ (బుద్ధ్యాత్మకం), నిర్వాణిక్ (నిర్వహణాత్మకం), పరనిర్వాణిక్ (పరనిర్వహణాత్మకం), మహాపర నిర్వాణిక్ (మహాపర నిర్వహణాత్మకం) అనేవి ఏడు తలాలు. ప్రతి తలం మరల ఏడు ఉపతలాలుగా/ విభాగాలుగా విభజించబడడం జరిగింది. ప్రతి తలం లోను మళ్ళీ అవే పేర్లతో ఏడు ఉపతలాలు. అంటే మొత్తం 7 తలాలు, 49 ఉపతలాలు.
4) ఈ తలాల, ఉపతలాల విభజనకు ఆధారం ఏమిటి అనేది కొంత తెలియవలసిన అవసరం. మూల/ శూన్య స్థితులలో, స్థాయిలలో జరిగిన ప్రక్రియలకు అనుగుణంగా సూక్ష్మ సృష్టి కంటె ముందే ఉన్న సృష్టి విధానం, ఆ సృష్టి విధానానికి అనుగుణంగా సూక్ష్మ సృష్టి నిర్మాణం మరియు స్థూల సృష్టి నిర్మాణం. స్థూల సృష్టి నిర్మాణానికి అనుగుణంగా మొదలైన స్థూల సృష్టి. మానవ మేథస్సు పరిఢవిల్లిన తరువాత సృష్టి క్రమవికాసం అనే పేరుతో సృష్టి విధానంలో భాగంగా లేదా ప్రథమాంకంగా స్థూల సూక్ష్మ సృష్టులు దిగజారిపోవడం. ఈ విధానం మొత్తం ఆధారంగానే, జరిగిన మూల, సూక్ష్మ, స్థూల సృష్టులకు ప్రతీకగా మానవ రూపం మరియు లక్షణ పరంగా మానవ నైజం. ఈ తలాల, ఉపతలాల విభజనకు ఇదే ఆధారం. అందుకే, మనిషి విశ్వానికి (ఖచ్చితంగా చెప్పాలి అంటే విశ్వం కంటె ముందరి స్థితులకు, స్థాయిలకు కూడ) సూక్ష్మాతిసూక్ష్మ ఆకృతి.
5) సాంప్రదాయ ఆధ్యాత్మికత లోని చక్రాలకు, వీటికి సంబంధం ఏమిటి??
6) సాంప్రదాయ ఆధ్యాత్మికత లోని చక్రాలు - మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం. ఇది మేథో మహానుభావులకు మానవ రూపం పరంగా అందిన విభజన, ఆ మాటలకు అర్థాలు గానీ, అది మానవ రూప సంబంధంగా లక్షణ పరమైన విభజన అని గానీ ఈషణ్మాత్రం తెలియకపోయినప్పటికీ. ఈ యోగ పరమైన విభజన ఈ సాంప్రదాయ ఆధ్యాత్మిక నామాలకు సమాంతరంగా, కానీ అర్థవంతమైన వేరే పదాలుగా (సాంప్రదాయ ఆధ్యాత్మిక
చక్రాల నామాలు కూడ అర్థవంతమే అయినప్పటికీ, వాటి అర్థాల గురించి ఎప్పుడూ పరిగణన చేయబడనే లేదు, కేవలం యోగ పరంగా మాత్రమే వాటి లోతుల అర్థాలు తెలిసే అవకాశం) చేయబడింది. వాటన్నిటి సమిష్టి రూపమే మనిషి యొక్క దేహ వ్యవస్థ.
7) మనిషి దేహ వ్యవస్థలో తలాల, ఉపతలాల పాత్ర ఏమిటి?
8) పైన చెప్పుకున్నట్లుగా, తలాల పరంగా వాటి అర్థాలను ఆధారం చేసుకుని వాటి లోతులకు, లోతుల లోతులకు వెళ్ళగలిగితే, మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉన్నాడు, ఎందుకు అలా ఉన్నాడు, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, వాటి ప్రభావం మనిషి మీద ఎలా పనిచేస్తుంది, ప్రస్తుతం జంతు మనిషిగా ఉన్న మనిషి అసలైన, నిజమైన, సృష్టి లక్ష్య సంబంధమైన మనిషిగా తన లోని దివ్యత్వ స్థాయికి ఎలా చేరుకుంటాడు, వగైరా విషయాలకు సంబంధించి చక్కని అవగాహన కలిగే అవకాశం. యోగా రికార్డులలో ఈ తలాల గురించి సుదీర్ఘమైన వివరాలు ఉన్నాయి.
9) సృష్టి లక్ష్యంలో తలాల, ఉపతలాల పాత్ర ఏమిటి?
10) సృష్టి విధానం, సృష్టి నిర్మాణం, సృష్టి క్రమవికాసం, ప్రస్తుత సృష్టి విధానం, రానున్న నూతన సృష్టి విధానం అన్నీ సృష్టి లక్ష్యంలో భాగమే. విశ్వానికి సూక్ష్మాతిసూక్ష్మ ఆకృతి అయిన మనిషిలో విశ్వ ఆవిర్భావానికి ముందు ఉన్న స్థితులు, స్థాయిలు కూడ నిగుంభితంగా నిక్షిప్తమై ఉన్నాయి. మనిషిలో పైనుంచి క్రిందికి ఏర్పడిన తలాల లోతులకు క్రింది నుంచి పైకి క్రమబద్ధంగా వెళ్ళగలిగితే, సృష్టి లక్ష్యంలో తలాల, ఉపతలాల పాత్ర ఇట్టే తెలిసిపోతుంది. కాకపోతే, ఆ 'ఇట్టే' అనేది ఎంత దుష్కరమో, అసాధ్యానికి మరియు అసంభవానికి ఎంత దగ్గరగా ఉందో తెలియడం కూడ చాలా చాలా కష్టమే.