Page 1 of 1

సమాధానం నెం.130 - ప్రశ్న నెం.130 (13-1-2022) విషయం "స్థూల దేహం".

Posted: Tue Jan 18, 2022 7:47 am
by Katakam
1) స్థూల దేహం/ శరీరం అంటే ఏమిటి?

2) స్థూల దేహం/ శరీరం అనే మాటలకు ముందుగా విడివిడిగా అర్థాలు చెప్పుకుని, ఆ తరువాత వాటి సంయుక్త అర్థాన్ని చెప్పుకోవలసిన అవసరం. అది కూడ అక్షరాల మూల స్థాయిల నుండి. స్థూలం అంటే నిలిచి ఉండడానికి (లేదా శాశ్వతంగా ఉండడానికి) అనువైన ఉనికిగా‌ ఆరంభమైనది అని దీని కంటె ముందుగానే చెప్పుకోవడం జరిగింది.

3) దేహం అంటే ఇవ్వబడినదిగా (ప్రాణంతో కూడి ఇవ్వబడినదిగా) భూమి మీద ఉండి ప్రాణం లేకుండా పోతున్నది అని. శరీరం అంటే ప్రాణం ఉన్నట్లుగా ఉండి (కేవలం ప్రాణతరంగంతో కూడి ఉండి) అగ్నిమయమై ఉన్న కారణంగా అగ్నికి (మృత్యువుకు) ఆహుతి అయి లేకుండా పోతున్నది అని.

4) మొత్తంగా స్థూల దేహం/ శరీరం అంటే ప్రాణం ఉన్న ప్రాణి చేత ప్రాణానికి క్రింది స్థాయి రూపంగా ధరించబడి ఉన్నది అని. సాధారణంగా వాడుకలో స్థూలం అని అన్నపుడు, దానిని వస్తుతః స్థూల దేహంగా లేదా స్థూల శరీరంగా తీసుకోనవుతుంది.

5) స్థూల దేహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

6) "శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం" (ధర్మాన్ని సాధించడానికి శరీరమే మొట్టమొదటిది అయి ఉంది లేదా ధర్మానికి శరీరమే మొట్టమొదటి సాధనం అయి ఉంది) అనేది పురాణ సూత్రం అయి ఉన్నప్పటికీ, స్థూలం ఏర్పడడానికి ఉన్న ఉద్దేశ్యం/ లక్ష్యం మానవ మేథస్సుకు అందక, మరణానంతరం పునర్జన్మ లేకుండా పోవడానికి ప్రయత్నించడమే స్థూలం యొక్క ప్రయోజనం అనే సృష్టి లక్ష్య విరుద్ధ భావనకు ప్రచారం కల్పించబడిన దృష్ట్యా, స్థూల దేహం విలువ లేనిది అయ్యింది. స్థూల జన్మకు వచ్చిన మనిషికి సంబంధించి ఏది జరగాలన్నా, ఏది చేయాలన్నా స్థూలం ఉండడం తప్పనిసరి అవసరం.

7) స్థూల దేహానికి, స్థూల దేహ వ్యవస్థకు మధ్య ఉన్న తేడా ఏమిటి?

8) బయటికి కనుపించేదిగా గానీ, లోపల కనుపించకుండా ఉన్నదిగా గానీ ఉన్న స్థూల పదార్థ సమస్తమే స్థూల దేహం. స్థూల దేహం లోపల -అంటే స్థూల పదార్థ శరీర భాగాల లోపల- సూక్ష్మంగా జరిగే శక్తి క్రియాకలాపాల సమస్తాన్ని కూడ కలుపుకుని ఉన్నదే స్థూల దేహ వ్యవస్థ. అంటే స్థూల పదార్థంతో కూడిన స్థూల దేహం లేదా స్థూల దేహ భాగాలు మరియు స్థూల దేహ భాగాలలో జరిగే శక్తి క్రియాకలాపాలు, వీటన్నిటినీ కలుపుకుంటే, అదే స్థూల దేహ వ్యవస్థ.

9) సృష్టి లక్ష్యంలో స్థూల దేహం యొక్క పాత్ర ఏమిటి?

10) సృష్టి లక్ష్యంలో స్థూలానిది కేవలం పాత్ర మాత్రమే కాదు, సృష్టి లక్ష్యానికి అర్థం, పరమార్థం స్థూల శరీరమే. సృష్టి లక్ష్యానికి ప్రాథమిక, మాధ్యమిక, అంతిమ అవసరం కేవలం స్థూల శరీరమే. 'శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం' అనే సూక్తం వస్తుతః స్థూల శరీరానికి, సృష్టి లక్ష్యానికి సంబంధించే విధంగా చెప్పబడిందే. కాకపోతే, అలా అని తెలియాలి అంటే స్థూల దేహంలో, స్థూల దేహ వ్యవస్థలో ఇమిడి పోయి ఉన్న సృష్టి పదార్థం లేదా కర్మ విధాన సంబంధ పదార్థం సమస్తం శూన్యీకరించబడవలసిందే, శూన్య పదార్థంతో నింపబడవలసిందే. అందుకు అవసరంగా స్థూలం లేదా స్థూల దేహం నిలిచి ఉండవలసిందే. సృష్టి లక్ష్యంలో పాలు పంచుకోవాలి అంటే స్థూలంతో కూడి ఉండవలసిందే. స్థూలాన్ని విడిచి వెళ్లిన వాళ్ళు గానీ, స్థూలం లేకుండా పోయిన వాళ్ళు గానీ స్థూలాన్ని పొందడం తప్పనిసరి అవసరం.