సమాధానం నెం.011 (19-5-2021) విషయం "ఇనిషియేషను".
Posted: Sun May 30, 2021 8:22 am
1) ఇనిషియేషను అంటే ఏమిటి?
2) ఇనిషియేషను అంటే యోగా ప్రాక్టీసు ఆరంభించడానికి జరిగే యోగ ప్రవేశ ప్రక్రియ.
3) ఇనిషియేషనుకు అర్హత ఏమిటి?
4) మాస్టరు గారి వద్ద మీడియములుగా చేరిన కొందరి గత జన్మల గొప్ప స్థాయిలను పరికించి చూస్తే, ఇనిషియేషనుకు అర్హత గత జన్మలలో చేసిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సాధనల ఫలితానికి సంబంధించి ఉంటుంది అని చెప్పుకోవడానికి తటపటాయించవలసిన అవసరం లేదని అనిపిస్తుంది. అంతేకాదు, గత జన్మల గొప్ప స్థాయి లేకుండా యోగంలో ఇనిషియేషను/యోగప్రవేశం జరగడం అసాధ్యమని చెప్పుకోవడం ఎంతయినా సమంజసం. అలా అని ఎవరికి వారికి తమ అర్హత గురించి తెలుస్తుందా లేదా అనేది వేరే విషయం, యోగంలో చేరాలి అనే ఆసక్తి/తపన ఉండడం తప్ప.
5) ఇనిషియేషనుకు అర్హత ఎవరు నిర్ణయిస్తారు?
6) మాస్టరు గారి కాలంలో ఈ కార్యక్రమాన్ని కొన్ని పద్ధతుల ద్వారా మాస్టరు గారే చేసేవారు అనేది డైరీలలో చూడనవుతుంది. ప్రస్తుత కాలంలో యోగ కేంద్రాలను నిర్వహించే వ్యక్తులు కుతూహలం ఉండి వచ్చేవారికి ఇనిషియేషను ఇవ్వడం జరుగుతోంది. అర్హతను నిర్ణయించడం చేస్తున్నారా అంటే చేస్తుండకపోవచ్చు అని చెప్పుకోవడానికే అవకాశం ఎక్కువ. ఎందుకు అంటే అప్పట్లో మాస్టరు గారు పాటించిన పద్ధతులు పాటించడం ఇప్పుడు సాధ్యం కాదేమో అనేది ఊహించదగిన విషయం గనుక.
7) ఇనిషియేషనులో ఏం జరుగుతుంది?
8) ఇనిషియేషను ఇచ్చే వ్యక్తి నుండి ఇనిషియేషను తీసుకునే వ్యక్తికి యోగా లింకు లభిస్తుంది. అంటే ఇనిషియేషను ఇచ్చే వ్యక్తిలో పనిచేస్తున్న ప్లెంటీ ఆఫ్ ప్రాణా ఇనిషియేషను తీసుకునే వ్యక్తిలో లింకుగా ప్రవేశిస్తుంది, వ్యక్తిగతంగా యోగా ప్రాక్టీసు చేసుకోవడానికి ఆరంభం కలుగుతుంది.
9) యోగా ప్రాక్టీసు చేసుకోవడానికి ఇనిషియేషను తప్పనిసరి అవసరమా? ఇనిషియేషను లేకుండా యోగా ప్రాక్టీసు చేసుకునే అవకాశం లేదా?
10) మాస్టరు గారి కాలంలో అయితే అంతే. ప్రస్తుత కాలంలో ఆ పరిస్థితిలో మార్పు కాననవుతుంది. ఉదాహరణకు, గత జన్మలో మీడియం అయి ఉండి మరుజన్మ తీసుకుని ప్రస్తుతం ఉన్నట్లయితే, పరిస్థితి ఏమిటి అనేది సమంజసంగా వేసుకోదగిన ప్రశ్నయే కదా. గత జన్మలోనే యోగా లింకు ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఇనిషియేషను అవసరం అవుతుందా అనేది యోచించదగిన అంశమే. ఎందుకు అంటే, సృష్టి విధానంలోని జన్మల పరంపరలో ప్రగతి సంబంధమైన కొనసాగింపు అనుక్రమణిక తప్పక ఉంటుంది అనేది కాదనలేని విషయమే కదా. యోగా లింకు ఉండి ఉన్న దృష్ట్యా ఏదో ఒక రకంగా యోగా లింకు కొనసాగుతుందని, అలాంటివారికి ప్రత్యేకించి ఇనిషియేషను ప్రక్రియ
అవసరం ఉండకపోవచ్చునని కొంతమంది సాధకుల విషయాలు చూసిన/తెలిసిన మీదట అనిపిస్తున్న విషయం.
11) మాస్టరు గారి కాలానికీ, ఇప్పటికీ మధ్య చోటు చేసుకున్న డెవలప్మెంట్ల దృష్ట్యా, యోగ విషయాలు వినడం వలన కూడ ప్రత్యేకంగా ఇనిషియేషను ప్రక్రియ అవసరం లేకుండానే యోగా లింకు ప్రక్రియ జరిగి ప్రాక్టీసు చేసుకుంటున్న సందర్భాలు కూడ లేకపోలేదు. అవి చెదురుమదురు సంఘటనలే తప్ప, ఏకంగా ఇనిషియేషను అక్కర్లేదు అని చెప్పడానికి వీల్లేదు.
12) యోగ సాధకులలో ఎవరి ద్వారా అయినా ఇనిషియేషను తీసుకునే అవకాశం ఉందా?
13) ఉంది అని చెప్పడం సమంజసమని అనిపించినా, ఇచ్చే ఆ యోగ సాధకునికి తన ద్వారా వేరొకరికి యోగా లింకు చేరడానికి అవకాశం ఉంది అనే లోతుల నమ్మకం ఉండడం అవసరం అని అనిపిస్తున్న విషయం.