సమాధానం నెం.012 - ప్రశ్న నెం.12 (24-5-2021) విషయం "మాస్టరు/ప్రాక్టీసు నామం 'మాస్టర్ సీ.వీ.వీ. నమస్కారం' ".
Posted: Mon May 31, 2021 9:01 am
1) ఆ వాక్యం బీజాక్షరీ మంత్రమా?
2) కాదు, మంత్రమూ కాదు, బీజాక్షర మంత్రమూ కాదు. మననాత్ త్రాయత ఇతి మంత్రః, అంటే మననం చేసేవారిని
రక్షించేది మంత్రం అని కదా. ఈ నామం మంత్ర సంబంధం కాదు. సృష్టికి, సృష్టి లోని మహానుభావులకు సైతం అందని సృష్ఠి లక్ష్యానికి సంబంధించింది.
3) సీవీవీ అనే మూడు అక్షరాలు బీజాక్షరాలా?
4) బీజాక్షరాలు కాదు. బీజాక్షరాలు అంటే అక్షరాలకు బీజ రూపాలు. అంటే పలుకబడే శబ్ద రూప అక్షరాలకు బీజ/మూల రూపాలు. రూపానికి వస్తేనే బీజం కదా. పలుకబడిందే అక్షరం కదా. అంటే శబ్ద రూపానికి వచ్చి పలుకబడిందే అక్షరం, అక్షరాల కలయిక పదం, పదాల కలయిక వాక్యం. బీజాక్షరాల మూలం/బీజం శబ్ద సంబంధంగా సృష్టి ప్రక్రియకు లోబడిన స్థాయి.
5) సీవీవీ అనే మూడు అక్షరాలలో సృష్టి ప్రక్రియ ఇమిడి ఉంది. ఆ ప్రక్రియ ఏమిటో తెలియకపోయినా, మాస్టరు/ప్రాక్టీసు నామం ఒక సూత్రమని, ఒక సంకల్పమని యోగ సాధక సమాజానికి చూచాయగా తెలిసిన విషయం. ప్రస్తుత సృష్టి విధానాన్ని నూతన సృష్టి విధానంగా లేదా సృష్టి నూతన విధానంగా ఆవిష్కరింపచేయడానికి సమకట్టింది ఈ యోగం. మాస్టరు/ప్రాక్టీసు నామం గానీ, అందులోని సీవీవీ అనే మూడు అక్షరాలు గానీ ఆ స్థాయి అర్థానికి సంబంధించినవే.
6) ఇక్కడి సందర్భం సీవీవీ అనే మూడు అక్షరాలకు సంబంధించింది గనుక, వాటి గురించి. ప్రస్తుత సృష్టి నెగెటివ్ సృష్టి, ప్రతికూల సృష్టి, దిగజారిపోతున్న సృష్టి. అందుకే బాగుచేయబడవలసిన అవసరం. నెగెటివ్ ను -ve గా గుర్తిస్తారు.దానికి హ్రస్వ రూపమే మొదటి వీ. నూతన సృష్టి పాజిటివ్ సృష్టి, అనుకూల సృష్టి. పాజిటివ్ ను +ve గా గుర్తిస్తారు. దానికి హ్రస్వ రూపమే రెండవ వీ. సీ అంటే ఆంగ్ల సీ (see) గా చూడడం అనే గమనిక. మొదటి వీ లోతులలో రెండవ వీ ని గమనించడం అనేదే ఆ ప్రక్రియ. ప్రస్తుతం నడుస్తున్న సృష్టి విధానం లోతులలో రాబోయే సృష్టి విధానాన్ని గమనించడం అనేదానికి సంబంధించిన అర్థం.
7) ఇది ఒలిడియరు 9వ నామం లోని "రీస్పెక్ట్ ల్యాస్ట్ వర్కింగ్ ఎవల్యూషన్" లో కాననవుతుంది. నడుస్తున్న చివరి సృష్టిక్రమవికాసాన్ని పునర్వీక్షించవలసింది అని. అంటే "ఆరిజిన్ ప్లెంటీ సెంటీ సెవెంటీ ఫైవ్ టర్నౌట్ ఇమ్మీడియేట్ హిడెన్స్" అనే పైదాని ముందరి భాగంలో ఇమిడి ఉన్న యోగ లక్ష్య సంబంధ ప్రక్రియ తెలియాలి అంటే నడుస్తున్న చివరి సృష్టిక్రమవికాసాన్ని పునర్వీక్షించవలసింది అని. సీవీవీ అనే మూడు అక్షరాలలో ఉన్న సూత్రం ఒక రకంగా ఒలిడియరు 9వ నామం లోని చివరి భాగంలో నిక్షిప్తమై ఉంది.
8) మాస్టరు అనగా ఎవరు?
9) ముందుగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే మాస్టరు అంటే ఎవరు అనే ప్రశ్నయే అసంబద్ధం. మాస్టరు అంటే ఏమిటి అనే ప్రశ్న మాత్రమే సమంజసం. ఎందుకు అంటే ఎవరు ఆనే మాట స్థూల వ్యక్తి సంబంధం గనుక, సృష్టికి అతీతమైన ఒక స్థాయిని స్థూల వ్యక్తిగా వ్యవహరించడం అసమంజసం గనుక. సృష్టి సంబంధంగా ఒక శక్తి రూపమైన యం.టీ.ఏ. ని కూడ స్థూల వ్యక్తిగా వ్యవహరించకూడదు అనేది 'వాట్ ఈజ్ దట్ యం.టీ.ఏ." అని చేయబడిన నామాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.
10) మాస్టరు ఆనే మాట యోగా రికార్డులలో, ప్రత్యేకించి డైరీలలో, ఫిజికలు మాస్టరు అయిన సీ.వీ.వీ. గారికి సంబంధించి కూడ వాడబడింది. అదే మాట పరంపరలో రెండవ స్థాయి అయిన అసలు మాస్టరుకు సంబంధించియే ఎక్కువగా వాడబడింది. మాస్టరు ఎవరు అని ఇక్కడ అడిగిన విషయం అసలు మాస్టరు స్థాయికి మాత్రమే సంబంధించి ఉంది.
11) మాస్టరు అనే మాటకు అర్థం యోగా రికార్డులు మొత్తంలో ఎక్కడా కనుపించదు. అంతేకాదు, అర్థమయే అవకాశం కూడ ఎక్కడా ఇవ్వబడి ఉన్నట్లు కనుపించదు. ఇందులో అర్థం కావలసిన ఒక లోతయిన విషయం ఏమిటి అంటే మాస్టరు అనే మాటకు అర్థం తెలిసే ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడంలో ఏదో ఉద్దేశ్యం తప్పకుండా ఉండి ఉంటుంది అని. కనుక మాస్టరు అంటే ఏమిటి అనేదానికి అర్దం చెప్పే సాహసం చెయ్యడం కూడ భావ్యం కాదని అనిపిస్తుంది.
12) ఆ వాక్యాన్ని ప్రాక్టీసు సమయంలో ఒకసారి అనుకుంటే చాలు. వందలు వేల సార్లు పునశ్చరణ చేయనవసరం లేదని అంటారు. అది ఎంతవరకు నిజం? మన యోగా రికార్డుల ప్రకారం తెలియచేయండి.
13) అది నిజమే. ప్రాక్టీసు సంబంధంగా మాస్టరు/ప్రాక్టీసు నామాన్ని ఒక్కసారి చెప్పుకోవడమే యోగా రికార్డులలో కనుపిస్తుంది. పునశ్చరణ లేదా జపం అనేది రికార్డులలో ఎక్కడా కనుపించదు.