సమాధానం నెం.182 - ప్రశ్న నెం.182 (27-4-2022) విషయం "అసతోమా సద్గమయ".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3868
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.182 - ప్రశ్న నెం.182 (27-4-2022) విషయం "అసతోమా సద్గమయ".

Post by Katakam »

1) అసతోమా సద్గమయ అనే సూక్తం యొక్క అర్థం, పరమార్థం ఏమిటి?

2) ముందుగా తెలియవలసింది ఏమిటి అంటే పైనుంచి సమాచారం అందడం అనే ప్రక్రియలో భాగంగా మహానుభావులు అందుకున్న అనేకానేక సూక్తాలలో అత్యంత ముఖ్యమైన మూడు సూక్తాలలో ఇది మొదటిది. దీని అర్థాన్ని బట్టి తేలికగానే అర్థమయే విషయం ఏమిటి అంటే ఇది ఒక అభ్యర్థనాపూర్వక సూక్తం అని, సృష్టి లక్ష్యానికి సంబంధించి అసలైన ఆధ్యాత్మిక కోణంలో వచ్చిన అభ్యర్థనాపూర్వక సూక్తం అని.

3) 'అసత్తు నుండి సత్తు వైపుకు మమ్ములను నడిపించవలసినది' అనేది దీనికి అర్థం. కాకపోతే, సామాజిక స్రవంతిలో ఏ విధంగానూ అన్వయించడానికి వీలులేని ఈ అభ్యర్థన లోని గుంభనమైన మాటల అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవడమే ఇప్పుడు చేయవలసింది. సత్ లేదా దాని తెలుగు పదంగా సత్తు అంటే ఏది ఉందో అదే సత్తు. దానికి వ్యతిరేక పదంగా అసత్తు అంటే ఏది లేదో అదే అసత్తు. అంటే కేవలం మాటల ముక్కుసూటి అర్థంగా చెప్పుకుంటే, లేనిదాని నుండి ఉన్నదాని వైపుకు మమ్ములను నడిపించవలసినది అని. కానీ, దానికి లోతుల అర్థం, అంతకు మించిన లోతుల పరమార్థం తెలియబడవలసిందే.

4) లేనిది, ఉన్నది అని చెప్పుకున్నపుడు, అదిగా లేనిదా లేదా అదిగా ఉన్నదా, కాదంటే దానికి భిన్నంగా ఉండవలసినది దానిలో లేనిదా లేదా ఉండవలసినది దానిలో ఉన్నదా అనేది తెలియవలసిన విషయం. అదిగా లేనిది అయినట్లయితే, దాని గురించి అభ్యర్థన చేయవలసిన అవసరమే లేదు కదా. అదిగా ఉండి, దానిలో ఉండవలసినది లేకుంటేనే, ఆ అభ్యర్థన అభ్యర్థన అవుతుంది. కనుక, లేనిది అన్నపుడు అదిగా ఉండి, దానిలో ఉండవలసినది లేకపోవడం అని; ఉన్నది అన్నపుడు అదిగా ఉండి, దానిలో ఉండవలసినది ఉండడం అని; ఖాయంగా తీసుకోనవుతుంది.

5) ఈ సూక్తం సృష్టి లక్ష్యానికి సంబంధించింది అని అన్నపుడు, ఇది సృష్టికి, సృష్టి లోని మనిషికి సంబంధించింది అని చెప్పుకోవడం ఎంతయినా అవసరం. సృష్టి లక్ష్యం ఏమిటి అనేదే ఇదమిత్థంగా తెలియని, తెలుసుకోలేని మానవ మేథస్సకు ఇదేదో గొప్ప సూక్తం అని తప్ప, దాని లోతులు గ్రహించడం అసంభవమే.

6) కానీ, సృష్టి లక్ష్యమే లక్ష్యంగా, కానీ పూర్తిగా విభిన్న పదజాలాలతో వ్యక్తం చేస్తూ, భూమి మీదికి వచ్చిన ఈ యోగం ఆరంభం అయిన తరువాతనే సృష్టి రహస్యాలు, సృష్టి లక్ష్య సంబంధ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పుకోవడం ఎంతయినా ముదావహం.

7) సంకల్పం అనే ఒక లక్ష్యంతో, ఆ లక్ష్యం దిశగా ఆరంభమైన సృష్టికి, సృష్టి లక్ష్యాన్ని ఆచరణ సాధ్య సాధన (ప్రాక్టీసు) గా చేయడానికి ఆరంభమైన ఈ యోగానికి సంబంధింపచేసి క్లుప్తంగా మాత్రమే చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఉన్నదిగా సృష్టి లోను, ఉన్నవాడిగా మనిషి లోను లేనిది అసలైన ప్రాణం. ఎందుకు అంటే అది సృష్టి మానవుల స్థూల రూపాలలో కేవలం ప్రాణతరంగంగా మాత్రమే ఉంది. కర్మ పదార్థంతో తయారయిన మనిషి యొక్క స్థూలం లోనికి అసలు ప్రాణం దిగిరావడానికి, ఉండడానికి స్థూలం అనేది కర్మ పదార్థం నుండి విముక్తమై తయారు (ఫిజికల్ ఎస్టాబ్లిష్) కావలసిన అవసరం. దానికి సంబంధించిన అంతరార్థమే సూక్తంలో 'లేనిదాని నుండి ఉన్నదాని వైపుకు మమ్ములను నడిపించవలసినది' అనే సృష్టి లక్ష్య సంబంధ అభ్యర్థన.

8) మానవ జీవనంలో, జీవితంలో అసతోమా సద్గమయ అనే సూక్తం యొక్క పాత్ర ఏమిటి?

9) ప్రస్తుత మానవ జీవనంలో, జీవితంలో ఈ సూక్తం యొక్క పాత్ర దేనికి సంబంధించిందో తెలియని ఏదో గొప్ప సూక్తంగా వల్లె వేసుకోవడానికి మాత్రమే పరిమితమై ఉంది అని నిస్తేజంగా చెప్పుకోదగి ఉంది.

10) సృష్టి/ యోగ లక్ష్యంలో అసతోమా సద్గమయ అనే సూక్తం యొక్క పాత్ర ఏమిటి?

11) అసతోమా సద్గమయ అనే సూక్తానిది సృష్టి లక్ష్యంలో, యోగ లక్ష్యంలో కేవలం పాత్ర మాత్రమే కాదు, పైన చెప్పిన దాని అర్థం, అంతరార్థం స్పష్టంగా తె‌లియగలిగితే, ఈ సూక్తం వస్తుతః సృష్టి/ యోగ లక్ష్యానికే సంబంధించి ఉంది అనేది ఎంతయినా ఖచ్చితంగా వ్యక్తి స్థాయికి తెలిసే అవకాశం.
Post Reply