సమాధానం నెం.189 - ప్రశ్న నెం.189 (11-5-2022) విషయం "మాస్టరు గారి 'స్వయం - అనుభూతి, ముఖ్యమైన వైఫల్యాలు' - 4".
Posted: Mon May 16, 2022 7:49 am
1) 4వ ముఖ్యమైన వైఫల్యం "నిర్మిత దేహాకృతిలో పునర్నమూనీకరణం జరుగుతుందని తెలిసి కూడ చేతల ద్వారా మరియు స్వాభావిక ప్రవృత్తికి లోను కావడం ద్వారా దానికి భంగం కలిగించడం" అని వ్రాయబడి ఉన్న దానికి లోతుల అర్థం ఏమిటి?
2) ముందుగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే వైఫల్యంగా పేర్కొనబడిన దీనిలో ఏం జరుగుతుందో మాటల పరంగా వ్యక్తం చేయబడినప్పటికీ, దాని లోతుల వాస్తవ స్థితి ఏమిటి, ఆ కార్యక్రమం ఏమిటి -అంటే మాటలలో వ్యక్తం చేయబడిన కార్యక్రమం జరుగుతున్న స్థాయి ఏమిటి- ఇలాంటి మరికొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియబడవలసిన అవసరం. కాకపోతే, అవి ఎంతమేరకు బయటపడతాయో ముందుగా చెప్పుకోలేని పరిస్థితి.
3) దీనికి ముందు చెప్పుకున్న సదరు మూడు వైఫల్యాలకు ఈ వైఫల్యం ఎంతో భిన్నం అని, చెప్పుకోబడిన ఈ నాలుగవ వైఫల్యం అప్పటి ఏ ఇతర మీడియములకు గానీ, వస్తుతః ఇప్పటి యోగ సాధక సమాజానికి గానీ అన్వయించనవదు అని కొంత స్పష్టంగానే తెలిసే అవకాశం. ఎందుకు అంటే అది పునర్నమూనీకరణానికి సంబంధించిన విషయం గనుక, నిర్మిత దేహాకృతిలో జరుగుతుందని చెప్పుకోబడిన పునర్నమూనీకరణానికి సంబంధించిన విషయం గనుక.
4) కాకపోతే, ఖచ్చితంగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఇది మాస్ఠరు గారి వైఫల్యం కాదు అని, అలాగే వైఫల్యంగా చెప్పుకోబడిన ఈ యోగ క్రియకు సంబంధించి తెలియవలసిన విషయం ఏదో ఉంది అని.
5) ఈ సంబంధంగా ప్రస్తుతం ప్రశ్నలు మాత్రమే ఉత్పన్నం కావడం జరుగుతోంది, సమాధానాలు మాత్రం భవిష్యత్తుతో (అది చిరకాలమా, అచిరకాలమా అనేది ప్రస్తుతానికి తేలని విషయమే) ముడిపడి ఉన్న యోగ లక్ష్య సిద్ధికి మాత్రమే సంబంధించినవి.
6) "నిర్మిత దేహాకృతిలో పునర్నమూనీకరణం జరుగుతుంది" అనే పదజాలానికి సంబంధించి. లిఖిత రూపానికి వచ్చిన యోగ సాహిత్యంలో ఎలాంటి తేడాకు ఎటువంటి ఆస్కారం ఉండదు. కానీ, ఆ పదజాలాన్ని అర్థం చేసుకోవడంలో మాత్రమే పొరపాటుకు/ అపార్థానికి/ విపరీతార్థానికి అవకాశం ఉండవచ్చు, ఉంటుంది; ఎందుకు అంటే అలా అర్థం చేసుకోవడంలో (అక్కడ ఉన్నది యథాతథంగా అర్థం కావడానికి భిన్నంగా) పనిచేసేది కేవలం అనేకానేక పరిమితులతో కూడిన మానవ మేథస్సు మాత్రమే గనుక. పునర్నమూనీకరణం జరుగుతున్న నిర్మిత దేహాకృతి అనేది మాస్టరు గారికి సంబంధించిందా, మాస్టరు సీ.వీ.వీ. కి సంబంధించిందా, మాస్టరు సీ.వీ.వీ. యొక్క స్వయానికి సంబంధించిందా, మాస్టరు సీ.వీ.వీ. ని ఒక (మొదటి) మీడియముగా ఉపయోగించుకున్న దేనికో సంబంధించిందా. ఇది కేవలం ప్రశ్న మాత్రమే.
7) నిర్మిత దేహాకృతిలో జరిగే పునర్నమూనీకరణం స్థూల స్థాయి సంబంధం కాదు అని చెప్పుకోవడానికే అవకాశం మెండు. ఎందుకు అంటే యోగ ప్రక్రియలు, ప్రయోగాలు స్థూలాన్ని, స్థూల స్థాయిని ఇంకా తాకలేదు, దానికి ఇంకా కొంత వ్యవధి (గ్యాపు) ఉంది అనేది మాస్టరు నోట్సులో ఉన్న విషయం గనుక.
8) ఈ నేపథ్యంలో, స్థూలాన్ని తాకని యోగ ప్రక్రియలకు చేతల ద్వారా మరియు స్వాభావిక ప్రవృత్తికి లోను కావడం ద్వారా భంగం కలిగించడం అనేది సాధ్యపడే విషయమేనా అనేది కేవలం ప్రశ్న మాత్రమే. దానికి సమాధానం తెలిసే అవకాశమే లేదు. ఎందుకు అంటే ఏం జరిగిన దృష్ట్యా మాస్టరు గారు అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో యోగ రికార్డుల పరంగా లేదు గనుక, ఆనాటి మీడియముల రచనా వ్యాసంగాలలో కూడ ఎక్కడా ఆ ప్రస్తావన లేదు గనుక. పైన చెప్పుకున్నట్లుగా, లిఖిత విషయంలో తేడా ఉండే అవకాశం ఉండదు, కానీ ఇక్కడ పైపై విషయంగా అర్థం కావడం కూడ సాధ్యపడని అంశం.
9) ఈ విషయంగా యోగ సాధక సమాజానికి తెలియవలసిన విషయం ఏమిటి?
10) మొదటిది ఇది మాస్టరు గారికి సంబంధించి వైఫల్యం కాదు, ఇది మాస్టరు గారి స్థూల స్థాయికి సంబంధించి వ్యక్తిగతం కాదు. రెండవది జరిగే యోగ ప్రక్రియల గురించి తెలియడం, తెలియకపోవడం అనేది వ్యక్తుల చేతులలో/ పరిధిలో ఉండదు. ఒకవేళ తెలిసింది అని అనిపిచినా, అది సంపూర్ణంగా తెలిసినట్లు తీసుకోవడం కూడదు. ఎందుకు అంటే తెలుసుకోవడం అనే ప్రక్రియలో మేథస్సుదే పాత్ర గనుక, యోగ క్రియల, ప్రక్రియల, ప్రయోగాల లోతులు ఎంత గొప్ప స్థాయివి అయినా అవి మేథస్సుకు అందవు గాక అందవు గనుక.