సమాధానం నెం.191 - ప్రశ్న నెం.191 (15-5-2022) విషయం "మాస్టరు గారి 'స్వయం - అనుభూతి, ముఖ్యమైన వైఫల్యాలు' - 6".
Posted: Fri May 20, 2022 7:45 am
1) ) 6వ ముఖ్యమైన వైఫల్యం "ట్రాన్సు మీడియముతో వ్యవహరించడంలో నేర్చుకోవలసింది చాలా ఉంది" అని వ్రాయబడి ఉన్న దానికి లోతుల అర్థం ఏమిటి?
2) 'ట్రాన్సు మీడియముతో వ్యవహరించడం' అని అన్నపుడు, ఆ ట్రాన్సు మీడియం ఎవరు అనేది ఖచ్చితంగా తెలియవలసిన అవసరం. ఆ ట్రాన్సు మీడియం సీ.వీ. (వెంకమ్మ) అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే దైనందిన యోగ కార్యక్రమాలలో -అంటే యోగా ప్రాక్టీసు సంబంధంగా, పైనుంచి వచ్చే సమాచారం వగైరాలను అందచేసే సంబంధంగా, యం.టీ.ఏ. ద్వారా వచ్చే యోగా రికార్డులను మాస్టరు గారు వ్రాసుకోవడానికి చెప్పే సంబంధంగా- పనిచేసింది ఉన్న ముగ్గురు ట్రాన్సు మీడియములలో -అంటే (యస్.యస్. (సుందరం), సీ.వీ. (వెంకమ్మ), అమ్మణి లలో- సీ.వీ. (వెంకమ్మ) మాత్రమే గనుక.
3) ముందుగా చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇది మాస్టరు గారి వైఫల్యం కాదు అని. ఎందుకు అంటే ఇది భార్యాభర్తలు అయిన వెంకమ్మ, వెంకాసామిరావు లకు సంబంధించిన విషయం కాదు గనుక, ఇది యోగ ప్రక్రియలకు ట్రాన్సు మీడియముగా ఉపయోగపడిన సీ.వీ. కి మరియు ట్రాన్సు మీడియం అయిన సీ.వీ. ని ఉపయోగించుకున్న సాధనం అయిన మొదటి మీడియం సీ.వీ.వీ. కి లేదా మాస్టరు సీ.వీ.వీ. కి లేదా ఫిజికలు మాస్టరుకు సంబంధించింది గనుక. ఇది మాస్టరు గారికి వ్యక్తిగత విషయం కాదు, కానేరదు.
4) మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న డైరెక్టు సమాధానంగా "నా నుండి సూచనలు పొందడంలో టి.యం. (= ట్రాన్సు మీడియం, సీ.వీ.) విఫలమైందని అనుకోవద్దు. అలాంటి క్షణంలో ఆమె అలానే ఉంచబడింది. పిలిచిన ఏ క్షణంలో అయినా నాదయిన ఏ రకం వర్కుకు అయినా కేవలం హాజరవడం కోసం మాత్రమే ఆమె డెవలప్ చేయబడింది" అని వ్రాయబడి ఉన్న లిఖిత భాగం ఇక్కడ ప్రస్తావనీయం. ఇది సక్రమమైన రీతిలో అర్థమైన పక్షంలో, తెలియవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే ట్రాన్సు మీడియంగా సీ.వీ. ఉపయోగించుకోబడడంలో ఫిజికలు మాస్టరు అయిన మాస్టరు సీ వీ.వీ. కూడ ఆ డైరెక్టు స్థాయికి/ స్థితికి నెం.1 మీడియంగా సాధనం మాత్రమే.
5) వైఫల్యంగా చెప్పుకోబడిన ఇది వెంకాసామిరావు గారికి గానీ, మాస్టరు గారికి గానీ వ్యక్తిగత విషయం కాదని చెప్పుకున్న మీదట, సదరు విషయం డెవలప్మెంటుకు సంబంధించిన ఒక నిరంతరాయ ప్రక్రియ మాత్రమే అవుతుంది. ఆ డెవలప్మెంటు సృష్టి స్థాయి ప్రక్రియగా మూల స్థాయిల నుండి స్థూల స్థాయిలలో చోటు చేసుకోవలసిన అవసరం ఉన్నది మాత్రమే. ఎలా అనేది ప్రస్తుత పరిస్థితులలో అర్థం కావడం కేవలం అసంభవం.
6) స్థూల స్థాయి లేదా స్థూల శరీరం సూక్ష్మ, మూల స్థాయిలకు కేవలం సాధనం మాత్రమే అనే విషయం ఇదమిత్థంగా, నిస్సందేహంగా తెలిసి వచ్చి, దానికి నిర్ధారణగా, ఋజువుగా స్థూల శరీరంలో, స్థూల శరీరాన్ని సాధనంగా చేసుకుని జరిపే/ జరిపించబడే సూక్ష్మ ప్రక్రియలను గుర్తించగలిగే గమనిక స్థాయి గణనీయంగా పెరిగినపుడు మాత్రమే, ఈ పై విషయం కొంత కొంత అర్థమయే అవకాశం. దీనికి ఆధారం కె. కోర్సులో 28-5-1910 న గుంభనంగా చెప్పబడిన "ముందుగా మానసిక సంబంధిత ప్రాంతాలు అవి ఒకదానికి మరొకటి ఎలా అనుసంధానం అయి ఉన్నాయో గమనించవలసినది. అటుపిమ్మట ఉన్నతతర ప్రాంతాల యొక్క మరియు భ్రమించేయబడి దాగి ఉంటున్న ఏకం యొక్క మూల సూత్రాలను గుర్తించవలసినది' అనే లిఖిత భాగం.
7) ఈ విషయంగా యోగ సాధక సమాజానికి తెలియవలసిన విషయం ఏమిటి?
8) మొదటిది, ఇది మాస్టరు గారి వైఫల్యం కాదు, మాస్టరు గారికి వ్యక్తిగత విషయం కాదు అని. రెండవది చాలా లోతుల విషయం. అయినా, విషయంగా చెప్పక తప్పదు. మాస్టరు యొక్క నోట్సులో 11-2-1922 న చెప్పబడిన "మీడియం/ సాధనం ద్వారా సూచించడం" అనే ప్రక్రియ సంబంధంగా భార్య నుండి భర్తకి లేదా భర్త నుండి భార్యకు వచ్చే నిగూఢ సూచనలను గమనించడానికి సంబంధించింది వైఫల్యంగా పేర్కొనబడిన ఈ అంశం. అందుకు గణనీయంగా వృద్ధి చెందిన గమనిక స్థాయి మాత్రమే ఎంతయినా అవసరం.