Page 1 of 1

ప్రశ్న నెం.022 (14-6-2021) విషయం "మాంగీ రూటు, న్యూ లైను, గ్రహాలు" అనుబంధం.

Posted: Mon Jun 14, 2021 7:45 am
by Katakam
సమాధానం నెం.017 కు సంబంధించి ఒక యోగ మిత్రుడు, శ్రీ లంకా ఆనందరావు, చేసిన వ్యాఖ్యలు.

'మాంగీ రూట్ ' అంటే తోకచుక్కలు ప్రయాణించే మార్గం అని మీకు ఎవరు చెప్పారు, ఎక్కడ చదివారు..
తోకచక్కలు విశ్వాంతరాళాలను చుట్టిరావడం ఏమిటి.. తిరుగు ప్రయాణం ఏమిటి, శక్తిని సేకరించడం ఏమిటి, ఆ శక్తిని భూమికి అందించడం ఏమిటి...
ఈ సిద్ధాంతం మీరు ఎక్కడ నుండి సంపాదించారు ?? మీకు ఎలా తెలుసు?? దేనిని ఆధారంగా చేసుకుని చెబుతున్నారు???
సొంత ఆలోచనలు, ఊహాగానాలు వద్దు సార్...
నిర్దిష్టమైన ఆధారాలు వుంటే చెప్పండి...