INDEPENDENCE DECLARATION

From birth to death all are adopting certain methods chalked out by our fore fathers after careful and deep study of sastras. There are classified codes of behaviour and modes of worship of the Lord Creator for the different castes. As a chaste woman supports her husband in whatever career he deems fit for his life and follows him, so also we are following those codes of behaviours without any attempt to develop our wisdom. We are doing what we should to maintain a family life and support our children and when old age sets in, we while away our time with the thought that we have done our duty in this birth and that we should have a good future and also a good next birth; by leading such a life we are not able to understand the cause of creation, why we are born, how many births are yet to be taken, what is the goal of all this and why and how our children are born through us.

There is no time in family life to investigate and get wisdom from these questions. How can we get at a solution without pondering on them and if we only feel that we are not able to know the answers to those questions and so pass our life time blindly? Proper steps should be taken and some time should be devoted for investigation and realisation. With the object to make everyone understand these problems easily, this society was started.

Certain methods are given to us to get wisdom, to pass on our life time without difficulty, to worship the Lord in the way our elders have prescribed and establish our mind in immortality. It is very difficult to follow these methods, and moreover they are meant to lead to further births.

The secret and the cause of creation are taught here in a simple manner to make one a wiseman, however ignorant or poor one may be; ways are being paved to give all wisdom during family life without discarding it, and to lead one to live without disease, and decay due to old age and death. Not only we, but also those who are closely associated with us will be able to enjoy these benefits.

All will agree that practice of Yoga is necessary to know who we are, why we came here and where we are going. It was made out by Yogis that yoga must be practised with the power of Kundalini. In this process different methods were formulated and it was declared by Pathanjali rishi that Raja Yoga is the best of all. This is also called Ashtanga Yoga. By this method of yoga at the time of cessation of expiration if the kundalini power begins to work in the body, outside consciousness will cease and a state of samadhi will occur. It is very difficult for all to attain this state. It is stated as a dogma that if it (cessation of expiration) happens and the kundalini begins to work in the body, the kundalini will enable us to attain the pure state by stages.

The object for doing so is to follow the conclusion of our elders that this mortal body is fit for nothing, that it is subject to decay, and that we must purify our astral and destroy the ideas of the past that come through mental reflections and attain the pure state. It is clear from this that we cannot realise the Lord with this body. Moreover, our elders have named the creative order as Sankyapatha. The vedantis state the creative order in a different way and proclaim that all are taking place in a mayavic state that this world is an illusion. Some others say that the personified Lord limited in shape and form has created this universe as a sport for him; and when we think about all what others say, we get at a doubt and confusion as to which of them should be followed.

The cause for all these should be only One; to realise that there should be only one way; when it is so why are different schools of thought formed by members of different religions? Is it not also a creation of the Lord? Will it be wise to try religion after religion without any practical experience?

This society is started for the above reasons with the object of making all human beings without any exception to realise the Lord within this physical body through the wisdom revealed by Kundalini in a conscious state and making them adepts by enabling them to clear their doubts through internal questioning and experiencing intimate knowledge and self realisation.

MASTER
The Yoga School,
2, East Dabir St.,
Kumbakonam,
India.

 

స్వతంత్ర ప్రకటన

జననం మొదలుకుని మరణం వరకు సర్వులూ మన పూర్వీకులు శాస్త్రాలను శ్రద్ధగా, లోతుగా అధ్యయనం చేసిన పిమ్మట లిఖించిన కొన్ని పద్ధతులను పాటిస్తున్నారు. విభిన్న వర్ణాలకు సంబంధించి వర్గీకరించిన ప్రవర్తనా నియమావళి మరియు ప్రభువును ఆరాధించే పద్ధతులు వాటిలో ఉన్నాయి. ఎలా అయితే శీలవతి అయిన ఒక స్త్రీ అతని (తన భర్త యొక్క) జీవితం కోసం అతనికి అర్హం అని అనుకున్న ఏ జీవనోపాధిలో అయినా తన భర్తకు తోడ్పాటును అందిస్తుందో, అదే మాదిరిగా మనం మన విజ్ఞతను పెంచుకునే ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఆ ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తున్నాం.

సాంసారిక జీవితాన్ని గడపడానికి మరియు మన పిల్లలకు ఆధారంగా ఉండడానికి మనం చేయవలసింది మనం చేస్తున్నాం; వృద్ధాప్యం లోకి అడుగు పెట్టినపుడు, మన కర్తవ్యాన్ని మనం నిర్వహించి ఉన్నాం, మనకు ఒక మంచి భవిష్యత్తు, అలాగే ఒక ఉత్తమ భవిష్య జన్మ ఉండాలి అనే ఆలోచనతో మనం కాలం వెళ్ళబుచ్చుతుంటాం; అలాంటి జీవితాన్ని గడపడం వలన సృష్టికి కారణం గానీ, మనం ఎందుకు జన్మించాం అని గానీ, ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవలసి ఉంది అని గానీ, ఎందుకు ఎలా మన పిల్లలు మనకు జన్మించారు అని గానీ మనకు తెలియకుంది.

ఈ ప్రశ్నలను పరిశోధించడానికి, వాటి నుంచి విజ్ఞతను పొందడానికి సాంసారిక జీవితంలో మనకు సమయం లేదు. వాటి గురించి యోచన చేయకుండానూ, ఆ ప్రశ్నలకు సమాధానాలను మనం తెలుసుకోలేక పోతున్నాం గనుక మన జీవిత కాలాన్ని గ్రుడ్డిగా గడిపివేస్తున్నాం అని మాత్రమే మనం అనుకోవడం వల్లనూ, మనం పరిష్కారాన్ని ఎలా పొందగలం? పరిశోధించి అవగాహన చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి, కొంత సమయాన్ని కేటాయించాలి. ఈ సమస్యలను ప్రతి ఒక్కరూ తేలికగా అర్థం చేసుకునేలా చేసే ధ్యేయం తోనే ఈ సొసైటీ ఆరంభించబడింది.

విజ్ఞతను పొందడానికి, కష్టం లేకుండా మన జీవితాన్ని గడపడానికి, మన పూర్వీకులు విధించి ఉన్న మార్గంలో ప్రభువును కొలవడానికి, ఇంకా అనశ్వరత్వం పట్ల మన మనసును దృఢపరుచుకోవడానికి కొన్ని పద్ధతులు మనకు ఇవ్వబడ్డాయి. ఈ పద్ధతులను పాటించడం చాలా కష్టం, అంతేకాకుండా అవి ఉత్తర జన్మలకు దారితీయడానికే ఉద్దేశించబడ్డాయి.

ఎవరు ఎంతటి అజ్ఞానులు లేదా పేదలు అయినా, వాళ్ళను విజ్ఞులుగా చేయడం కోసం సృష్టి యొక్క రహస్యం, కారణం ఇక్కడ తేలిక రీతిలో బోధించబడ్డాయి; సాంసారిక జీవితాన్ని త్యజించకుండా విజ్ఞతను మొత్తంగా ఇవ్వడానికి, ఇంకా జబ్బు, వృద్ధాప్యం వలన క్షీణింపు/ క్షయం మరియు మరణం లేకుండా జీవించి ఉండేలా ముందుకు నడిపించడానికి దారులు వేయబడుతున్నాయి. మనం మాత్రమే కాక, మనతో సన్నిహిత సంబంధం కలిగిన వారు కూడ ఈ ప్రయోజనాలను అనుభవించగలుగుతారు.

మనం ఎవరిమి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని తెలుసుకోవడానికి యోగాన్ని ప్రాక్టీసు చేయడం అవసరం అనేది అందరూ ఒప్పుకునే విషయమే. కుండలినీ శక్తితో యోగాన్ని ప్రాక్టీసు చేయాలి అని యోగులు తెలుసుకున్నారు. ఈ ప్రక్రియలో విభిన్న పద్ధతులు సూత్రీకరించబడ్డాయి; అన్నిటిలో రాజ యోగమే ఉత్తమం అని పతంజలి ఋషి ప్రకటించాడు. దీనినే అష్టాంగ యోగం అని కూడ అంటారు. ఈ పద్ధతి వలన నిశ్శ్వాస ఆగినపుడు కుండలినీ శక్తి శరీరంలో పనిచేయడం ఆరంభిస్తే, బాహ్య స్ఫురణ ఆగిపోయి, సమాధి స్థితి కలుగుతుంది. అందరూ ఈ స్థితిని సాధించడం చాలా కష్టం. నిశ్శ్వాస ఆగడం సంభవించి, శరీరంలో కుండలిని పనిచేయడం ఆరంభించినట్లయితే, శుద్ధ స్థాయిలను దశల వారీగా మనం పొందేలా కుండలిని చేస్తుంది అనేది మూఢ విశ్వాసం అని చెప్పబడింది.

అలా చేయడానికి ధ్యేయం ఏమిటి అంటే ఈ నశ్వర శరీరం దేనికీ పనికి రానిది; అది క్షీణింపుకు/ క్షయానికి లోనయి ఉంది; మన యాస్ట్రలును మనం శుద్ధి పరిచి, మానసిక ప్రక్రియల ద్వారా వచ్చే గత సంబంధ యోచనలను నాశనం చేసి, శుద్ధ స్థితిని పొందాలి; అని మన పూర్వీకులు చేసిన తీర్మానాలను పాటించడమే. మనం ఈ శరీరంతో ప్రభువు సాక్షాత్కారాన్ని పొందలేం అనేది దీని వలన స్పష్టం అవుతుంది. అంతేకాక, మన పూర్వీకులు సృష్టి క్రమాన్ని సాంఖ్య పథం అని పేర్కొని ఉన్నారు. వేదాంతులు సృష్టి క్రమాన్ని భిన్నమైన రీతిలో నుడువుతున్నారు, సమస్తం మాయా పూరిత స్థితిలో జరుగుతున్నాయి, ఈ జగత్తు మిథ్య అని ఉద్ఘాటిస్తున్నారు. వ్యక్తి రూపాన్ని పొందిన ప్రభువు పరిమిత ఆకారంతో, రూపంతో విశ్వాన్ని తనకు ఒక క్రీడగా సృష్టించి ఉన్నాడు అని మరి కొందరు చెప్తున్నారు. ఇతరులు చెప్పిన మొత్తం గురించి మనం ఆలోచించినపుడు, వాటిలో దేనిని మనం అనుసరించాలి అని మనకు అనుమానం, గందరగోళం కలుగుతుంది.

వీటన్నిటికీ కారణం ఒక్కటే అయి ఉండాలి; అది సిద్ధించాలి అంటే ఒకే ఒక మార్గం ఉండాలి; అది అలా ఉన్నపుడు, విభిన్న మతవాదుల చేత రూపొందించబడిన విభిన్న మత సాంప్రదాయాలు ఎందుకు ఉన్నాయి? ఇది కూడ ఆ ప్రభువు యొక్క సృష్టి కాదా? ఎలాంటి వాస్తవిక అనుభవం లేకుండా మతాలను ఒకటొకటిగా ప్రయత్నించడం విజ్ఞత అవుతుందా?

పై కారణాల వల్లనే, ప్రజ్ఞా స్థితిలో కుండలిని చేత వెల్లడించబడే విజ్ఞత ద్వారా ఏ ఒక్కరినీ మినహాయించకుండా సమస్త మానవాళిని ఈ స్థూల శరీరం లోపలే ప్రభువును సాక్షాత్కరించుకునేలా చేయడం; మరియు ఆంతరిక ప్రశ్నింపు, ఇంకా ఆంతరంగిక జ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభవించడం ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకునేలా వాళ్ళను చేయడం ద్వారా వాళ్ళను నిష్ణాతులుగా తయారు చేయడం; అనే ధ్యేయంతో ఈ సొసైటీ ఆరంభించబడింది.

మాస్టరు,
ది యోగా స్కూలు,
2, తూర్పు డబీరు వీధి,
కుంబకోణం
భారత దేశం.
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

All rights reserved ©yogam.org 2021
v