ప్రశ్న నెం.003 (5-5-2021) విషయం "యోగా ప్రాక్టీసు వలన ప్రయోజనం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Admin
Site Admin
Posts: 16
Joined: Sat May 08, 2021 3:02 am

ప్రశ్న నెం.003 (5-5-2021) విషయం "యోగా ప్రాక్టీసు వలన ప్రయోజనం".

Post by Admin »

ప్రశ్న - యోగా ప్రాక్టీసు వలన సాధకునికి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఏమిటి? ఎంతోమంది బాహాటంగా చెప్పే 'బాగుంటుంది' అనే మాటకు అర్థం ఏమిటి? యోగా ప్రాక్టీసు చేయబడేది కేవలం 'బాగుండడం' కోసమేనా? పన్నెండు సంవత్సరాల అవిరళ యోగా ప్రాక్టీసు అనంతరం ఫిజికల్ మాస్టరు సీ.వీ.వీ. గారికి ఒనగూడిన ప్రయోజనం మాస్టరు గారి డైరీలో 21-4-1922 న లిఖించబబడిన దాని ప్రకారం ఏమిటి అంటే - నియంత్రించే ప్రభావం పనిచేస్తుంది, ఆలోచన తీరు కరెక్టుగా వర్తిస్తుంది,. ఒక భావన చేస్తే దానికి ఫలితం ఉంటుంది, అవును లేక కాదు అని సమాధానం పొందుతూ నీవు వర్తించగలుగుతావు - అని. ఇది ఫిజికల్ మాస్టరు గారి సంగతి. అనేక సంవత్సరాల తరబడి చేసే యోగా ప్రాక్టీసు అనంతరం యోగ సాధకునికి యోగా ప్రాక్టీసు వలన గుర్తించబడేలా ఒనగూడే లేదా ఒక రకంగా ఒనగూడవలసిన వ్యక్తిగత ప్రయోజనం ఏమిటి? అది 'గమనిక' సంబంధం అని చెప్పుకోనయితే, నిర్దిష్టమైన ఆ ప్రయోజనం ఏమిటి?
Post Reply