ప్రశ్న నెం.004 (6-5-2021) విషయం "యోగం".
-
Admin
- Site Admin
- Posts: 16
- Joined: Sat May 08, 2021 3:02 am
ప్రశ్న నెం.004 (6-5-2021) విషయం "యోగం".
ప్రశ్న - వస్తుతః యోగం అంటే ఏమిటి? జంట పదాలయిన యోగం, క్షేమం (అంటే ఒకానొక ఆర్దంలో కలిసిరావడం, కలిసివచ్చింది భద్రంగా ఉండడం) అనే వాటిలోని యోగం అనే మాటకు, యోగ సాధకులుగా మనం ప్రాక్టీసు చేస్తున్న యోగం అనే మాటకు ఏఘయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి? మనకు సాంప్రదాయబద్ధంగా వస్తున్న కర్మ యోగం, జ్ఞాన యోగం, రాజ యోగం, భక్తి యోగం, సాంఖ్య యోగం, వగైరా వాటిలోని యోగం అనే మాటకు, మనం ప్రాక్టీసు చేస్తున్న యోగం అనే మాటకు ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి? సాంప్రదాయబద్ధంగా వాడే ఆధ్యాత్మికత (ఆది + ఆత్మ + ఏకత) అనే మాటలోని పదభాగమైన ఏకత అనే మాటకు లేదా మొత్తంగా ఆధ్యాత్మికత అనే మాటకు, మనం ప్రాక్టీసు చేస్తున్న యోగం అనే మాటకు ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి? పైన చెప్పిన ఇతరమైన పదాలలోని యోగం అనే మాటకు భిన్నంగా మనం ప్రాక్టీసు చేస్తున్న యోగం అనే మాటకు వేరే అర్థం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?