సమాధానం నెం.033 - ప్రశ్న నెం.033 (3-7-2021) విషయం "రెగ్యులేషను".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.033 - ప్రశ్న నెం.033 (3-7-2021) విషయం "రెగ్యులేషను".

Post by Katakam »

1) రెగ్యులేషను లేదా నియంత్రణ అంటే ఏమిటి?

2) మాస్టరు గారి డైరీల ప్రకారం మాస్టరు గారి చేత చేయబడిన సెల్ఫ్ రెగ్యులేషను, కోర్సులుగా ప్రాక్టీసు చేయించబడిన గాడ్స్ రెగ్యులేషను, స్త్రీ దేవతా (నీచ అంశలు) రెగ్యులేషను, గ్రహాల రెగ్యులేషన్లు అనే వాటి నుంచి ఈ మాట తీసుకోబడింది. వివరణ అవసరం అని అనిపించింది.

3) నియంత్రణ అంటే ఉన్న తీరు గానీ లేదా పనిచేస్తున్న తీరు గానీ ఉండవలసిన తీరుకు లేదా ఉండబోయే/రాబోయే ఉత్తమ తీరుకు అనుగుణంగా మారేలా కట్టడి చేయబడడమే నియంత్రణ.

4) అది వ్యక్తి సంబంధమా, సృష్టి సంబంధమా, సృష్టి స్థాయి స్థూల ఉనికిల/వస్తువుల సంబంధమా?

5) నియంత్రణ అనేది యోగపరంగా వ్యక్తి సంబంధం, సృష్టి.సంబంధం, సృష్టి స్థాయి స్థూల ఉనికిల/వస్తువుల సంబంధం కూడ. సృష్టి లక్ష్యంలో భాగంగా యోగపరంగా చెప్పుకున్న రెక్టిఫికేషను, ఎడ్జస్టుమెంటు అనేవి నియంత్రణలో భాగమే. మృతత్వ లక్షణం నుంచి అమృతత్వ స్థితికి రావడానికి జరిగే ప్రక్రియలు సమస్తం వ్యక్తి సంబంధం, సృష్టి సంబంధం కూడ. ప్రస్తుతం గ్రహాలు పనిచేసే తీరు రాబోయే నూతన సృష్టి విధానానికి అనుగుణంగా పనిచేయవలసిన అవసరానికి సంబంధించి జరిగేవి అన్నీ నియంత్రణలో భాగమే.

6) గాడ్స్ రెగ్యులేషను, స్త్రీ దేవతా (నీచ అంశలు) రెగ్యులేషను, గ్రహాల రెగ్యులేషన్లు - ఇవి ఏమిటి?

7) సృష్టి ఆరంభంలో లేనిది, మానవ మేథస్సు పరిఢవిల్లిన అనంతరం రూపొందించబడినది అయిన దేముళ్ళ/దేవుళ్ళ అంశం మానవ మానసాలలో ఆధ్యాత్మిక జీవనం అనే పేరుతో లౌకిక జీవనంలో ఎంత మమేకం అయిపోయిందో వివరణ అక్కర్లేని విషయం. మనిషిలోనే ఉన్న దివ్యత్వానికి లేదా దైవత్వ అంశకు దేవుళ్ళ అంశం పూర్తిగా భిన్నం, విరుద్ధం కూడ. సృష్టి/యోగ లక్ష్యానికి కూడ అది విరుద్ధం. మనుషులలో, విషయాలలో పాతుకుపోయిన దేముళ్ళ/దేవుళ్ళ అంశం యొక్క ప్రభావం నియంత్రించబడడానికి చేయబడిందే గాడ్స్ రెగ్యులేషను.

8) స్త్రీ దేవతలు (నీచ అంశలు) అనే నీచ అంశల అమ్మవార్లకు సంబంధించి మనుషులలో, విషయాలలో సృష్టి/యోగ లక్ష్య విరుద్ధంగా, మానవ అంతస్థిత దివ్యత్వానికి/దైవత్వ అంశానికి విరుద్ధంగా పాతుకుపోయిన అమ్మవార్ల అంశం యొక్క ప్రభావాన్ని నియంత్రించడానికి చేయబడిందే పురుష సంబంధ గాడ్స్ రెగ్యులేషనుకు సమాంతరమైన స్త్రీ దేవతా (నీచ అంశలు) రెగ్యులేషను.

9) ప్రస్తుత సృష్టి విధానానికి అనుగుణంగా పనిచేస్తున్న గ్రహాలు రాబోయే నూతన సృష్టి విధానానికి లేదా సృష్టి నూతన విధానానికి అనుగుణంగా పనిచేయడానికి సంబంధించి చేయబడినవే గ్రహాల రెగ్యులేషన్లు.
Post Reply