సమాధానం నెం.037 - ప్రశ్న నెం.037 (11-7-2021) విషయం "దేవతలు".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.037 - ప్రశ్న నెం.037 (11-7-2021) విషయం "దేవతలు".

Post by Katakam »

1) శ్రీ డి. చిన్న బాబు అనే యోగ మిత్రుడు ఆంగ్లంలో వేసిన ప్రశ్నలకు ఇది సమాధానం.

2) ఈ భూమి మీద 'దేవతల' కు ఉన్న ఉనికి ఏ రకమైనది?

3) ముందుగా, దేవతలు అనే మాట గురించి కొంత వివరణ. దేవతలు అనే మాట పురుష సంబంధం మరియు స్త్రీ సంబంధం కూడ. ఈ మాట దేముళ్ళకు/దేవుళ్ళకు సంబంధించింది కాదు, పూజలు అందుకునే దేముళ్ళ/దేవుళ్ళ స్థాయి కంటె క్రింది స్థాయివి అయిన గణాలకు సంబంధించింది. అంటే దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుషాదులు అనే గణాలలో దేవ అనే ఒక గణం వారే దేవతలు.

4) భూమి మీది మానవ జీవులు, మిగతా జీవరాశులను మినహాయించి మిగతా ఎవరూ లేదా ఏదీ స్థూలం కానటువంటి సూక్ష్మ స్థాయిలు మాత్రమే, సూక్ష్మ ఉనికిలు మాత్రమే. ఆకాశంలో స్థూలంగా కనుపించే సృష్టి స్థాయి స్థూల వస్తువులు, ఉదా: గ్రహాలు, గ్రహ శకలాలు, నక్షత్రాలు, యాస్టరాయిడ్లు వగైరా, కూడ మినహాయింపులో భాగమే. 'దేవతలు' స్థూల ఉనికిలు కాదు అనేది ఇక్కడ తేల్చి చెప్పుకోవలసిన అంశం.

5) వాళ్ళు ఉండేది స్థూల/భౌతిక రూపంగానా లేదా స్థూలానికి భిన్నమైన అభౌతిక/సూక్ష్మ రూపంగానా?

6) పైన చెప్పుకున్నట్లుగా, దేవతలు అంటే స్థూల/భౌతిక ఉనికిలు లేదా స్థూల/భౌతిక రూపధారులు కాదు. దేవతలు అభౌతిక/సూక్ష్మ ఉనికిలు మాత్రమే, స్థూల/భౌతిక రూపధారులు అయిన మనుషులలోని సూక్ష్మ మానసిక లక్షణాంశాలలో పనిచేసే క్రింది స్థాయి సృష్టి/విశ్వ/ప్రకృతి శక్తులు మాత్రమే.

7) సృష్టిలో దేవతలు నిర్వహించే పాత్ర, ప్రత్యేకించి 'మానవ జీవితం' మీద వాటి ప్రభావం, ఏమిటి?

8) సృష్టిలో దేవతలు నిర్వహించే పాత్ర, ప్రత్యేకించి 'మానవ జీవితం' మీద వాటి ప్రభావం అనే పదజాలాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకోవలసిన అవసరం. ఏమిటి అంటే మనుషులు తమ ప్రారబ్ద కర్మను అనుభవించడంలో భాగంగా తమ సహజ స్వభావంతో ప్రవర్తించడంలో సందర్భ సహితంగా బయటపడే లక్షణాలలో సూక్ష్మ ప్రభావంగా పనిచేసే సృష్టి/విశ్వ/ప్రకృతి శక్తులే దేవతలు.

9) ఆధ్యాత్మిక సాంప్రదాయంలో దేవతలుగా పేర్కొనబడిన సృష్టి/విశ్వ/ప్రకృతి శక్తులు ప్రస్తుత సృష్టి విధానంలో పనిచేస్తూ, ప్రస్తుత సృష్టి విధానాన్ని నూతన సృష్టి విధానంగా లేదా సృష్టి నూతన విధానంగా ఆవిష్కరింపచేయడానికి సమకట్టిన ఈ నూతన యోగంలో జరిగే యోగ క్రియలు, యోగ ప్రక్రియలు, యోగ ప్రయోగాలకు ఉద్విగ్నమై, మార్పుకు లోబడే ప్రక్రియలలో భాగంగా ముందుగా తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తాయి.

10) మాస్టరు గారి డైరీలో 5-7-1918 న "డైరెక్టు సమాచార ప్రసారం" అనే ఉపశీర్షిక క్రింద మాస్టరు గారిని ఉద్దేశించి చెప్పబడిన "నీకు సహాయపడేవారిని సృష్టి శక్తులు తుదముట్టిస్తాయి, పరమ దారుణమైన బాధలు చుట్టుముడతాయి" అని, 25-8-1918 న మాస్టరు గారిని ఉద్దేశించి "స్వయానికి - డైరెక్టు సూచన" గా "ప్రాక్టీసులు చేస్తున్నంత కాలం అనుక్షణం కనిపెట్టుకుని ఉంటూ కాస్మిక్ (= సృష్టి/ప్రకృతి శక్తుల) ప్రభావం నుండి నిన్ను నేను కాపాడుకోవాలి" అని, 16-8-1919 న మాస్టరు గారికి సూచనగా "హీనమైన కష్టాలలో సైతం నీవు కాల్ ను నిర్వహించాలి, ప్రకృతి శక్తుల వత్తిడిని ఒక పరీక్షగా తట్టుకుని నిలబడాలి" అని ఉన్న లిఖిత భాగాలు పై దానినే సూచిస్తాయి.
Post Reply