సమాధానం నెం.038 - ప్రశ్న నెం.038 (13-7-2021) విషయం "ఈ యోగంలో కోర్సుల ప్రాక్టీసు".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.038 - ప్రశ్న నెం.038 (13-7-2021) విషయం "ఈ యోగంలో కోర్సుల ప్రాక్టీసు".

Post by Katakam »

1) శ్రీ వి.ఎల్.యన్. మూర్తి, నరసరావుపేట అనే యోగ మిత్రుడు తెలుగులో అడిగిన విషయాలకు ఇది సమాధానం.

2) ప్రశ్న - కోర్సుల గురించి, సి.వి.వి. గారు వారి సాహిత్యంలో గాని, డైరీలలో గాని, ఎం టీ ఏ లెటర్స్ లో గాని, ఎక్కడైనా మీరు కోర్సులు చేయండి, అప్పుడే ఈ యోగం మీకు సిద్ధిస్తుంది అని కానీ, లేక మీరు కోర్సులు చేయక్కర్లేదు అని కానీ చెప్పడం జరిగిందా?

3) మాస్టరు గారి రికార్డులలో కోర్సులు చేయండి, అప్పుడే మీకు యోగం సిద్ధిస్తుంది అని గానీ, అలాంటి అర్థం వచ్చేలా గానీ లేదా కోర్సులు చేయనక్కర్లేదు అని గానీ ఎక్కడా వ్రాయబడి లేదు.

4) అసలు ఈ కోర్సుల అవసరం ఉందా?

5) మాస్టరు గారి కోర్సులు (నామాలు, కోర్సులు, రెగ్యులేషన్లు, ఎడ్జస్టుమెంట్లు) ఎందుకు చేయించబడ్డాయో, వాటి అవసరం ఏమిటో తెలియకుండా ఈ కోర్సుల అవసరం ఉందా అనే ప్రస్తుత ప్రశ్నయే అసమంజసం. ఎందుకు అంటే మాస్టరు గారి కాలంలో చేసిన కోర్సులను ఇప్పుడు చెయ్యడం జరుగుతోంది గనుక. కాబట్టి, ఆ కోర్సులు ఎందుకు చేయాలో తెలిసి చేస్తున్నామా లేదా మాస్టరు గారి కాలంలో చేసిన కోర్సులను ఒక సాంప్రదాయంగా పాటించి ఇపుడు చేస్తున్నామా అనేది ఆ కోర్సులు చేస్తున్నవారు తేల్చుకోవలసిన విషయం గనుక. అలాగే కోర్సులు చేయనవసరం లేదని చెప్పేవారు కూడ కేవలం 'మాస్టరు సీ.వీ.వీ. నమస్కారం' అనే మాస్టరు/ప్రాక్టీసు నామం చేస్తే సరిపోతుందా అని వాళ్ళుగా తేల్చుకోవలసిన విషయం.
మాస్టరు గారి కాలానికి సంబంధించి ఇవ్వబడిన నిర్దేశాలే తప్ప, భవిష్య సంబంధంగా కోర్సులు చేయాలి లేదా కోర్సులు చేయనక్కర్లేదు అనే నిర్ణయం రికార్డుల పరంగా ఎక్కడా లేదు. తర్కం, సహేతుకత దృష్ట్యా ఎవరెవరి అభిప్రాయం వారి నిర్ణయాధికారమే కదా. ఏది ఏమయినా, కె. కోర్సులో చెప్పిన "ఎలాగైనా, ప్రాక్టీసు మాత్రం చెయ్యాలి" అనేది మాత్రమే ఏకైక ఆవశ్యకత.

6) Briktha రహిత తారక రాజయోగం అన్నది ఓ కఠినమైన లెక్క అనుకుంటే, దాని ఆన్సర్ రాబట్టడానికి సి.వి.వి. గారు స్వయంగా చేసుకున్న రఫ్ వర్క్ గా ఈ కోర్సులను భావించవచ్చా?

7) లేదు, అలా భావించడానికి ససేమిరా వీల్లేదు. ఎందుకు అంటే ఈ యోగం ముఖ్యంగా ఆరిజినుకు, సృష్టి విధానానికి సంబంధించింది గనుక, ఫిజికలు మాస్టరుతో సహా మొత్తం 752 మంది మీడియముల (సాధనాల) స్థూలాల ద్వారా జరిపించబడిన యోగా ప్రాక్టీసు సమస్తం ప్రస్తుత సృష్టికి సంబంధించి మూల స్థాయిలలో సూక్ష్మంగా జరిపించబడిన ప్రయోగాలు మాత్రమే గనుక, యోగం గురించి గానీ యోగా ప్రాక్టీసు గురించి గానీ ఏమాత్రం తెలియని సమస్త మానవాళికి సైతం యోగ లక్ష్య సిద్ధి సంబంధించి ఉంది గనుక.

8) అదే నిజమైతే, ఈ యోగంలో చేరే ప్రతి వారు ఆన్సర్ తెలిసిన లెక్కకు మళ్ళీ మళ్ళీ ఈ రఫ్ వర్క్ చేయాలా?

9) అది నిజం కానే కాదు గనుక, ఈ ప్రశ్న అవసరమే లేదు. యోగంలో చేరేవారు యోగా ప్రాక్టీసు సంబంధిత నిబంధనల మేరకు ప్రాక్టీసు చేయడం ఒక్కటే కావలసింది. మాస్టరు గారి కాలం నాటి ప్రయోగాలు అప్పటికి కాక ఇప్పటికి ఫలితాలను క్రమేణా ఇస్తున్న నేపథ్యంలో ఎలా ప్రాక్టీసు చేసినా, మీమాంసలకు పోకుండా "దృఢ నిశ్చయం, విశ్వాసంతో కూడిన నమ్మకం" తో ప్రాక్టీసు చేయడం ఒక్కటే అవసరం.

10) ప్రయోగం కోసం సి.వి.వి. గారు చేసుకున్న రఫ్ వర్క్ గా ఈ కోర్సులు ఉన్నాయని భావిస్తే, ఈ లెక్కకు ఆన్సర్ అంతా మాస్టర్ సి.వి.వి. నమస్కారం అంటూ కళ్ళు మూసుకుని సాధన చేయడం అనుకోవచ్చా?

11) పైన చెప్పుకున్న దాని దృష్ట్యా, అలా భావన చేసుకోవలసిన అవసరమే లేదు. ఇంకా ఎందుకు అంటే ప్రయోగం ఏ ఒక్క స్థూలానికయినా ఆ స్థూలం సాధనంగా మాత్రమే గనుక. రెండవ భాగపు అనుకోవడం కూడ అవసరం లేనిదే. ఎందుకు అంటే కళ్ళు మూసుకుని సాధన చేయడం అనేది యాథాలాపమైన మొక్కుబడి కాక గమనిక జరగడం, పెరుగుతూ పోయే గమనిక స్థాయిలు డెవలప్మెంట్లు లేదా కనీసం ఆంతరిక మార్పులు, ఫలితాలు గమనించబడడాన్ని సాధ్యం చేయడం అనేది ఒకలాంటి అవసరం గనుక. డైరీలో 21-4-1922 న స్థూల మాస్టరు గారికి 12 సంవత్సరాల అవిరళ, కఠినమైన యోగ ప్రక్రియల అనంతరం కలిగిన స్థూల స్థాయి ప్రయోజనంగా "నియంత్రించే ప్రభావం పనిచేస్తుంది. ఆలోచన తీరు కరెక్టుగా వర్తిస్తుంది. ఒక భావన చేస్తే దానికి ఫలితం ఉంటుంది. అవును లేక కాదు అని సమాధానం పొందుతూ నీవు వర్తించగలుగుతావు" అని సూచించబడిన మాదిరిగా అన్నమాట.

12) కోర్సులు వద్దని వాదించేవారు లోటస్ కాన్ఫరెన్స్లో అందరితో కూర్చుని అక్కడ ప్రాక్టీసు చేయడంలో అర్థం ఏమిటి?

13) కోర్సులు చేసేవారితో సహా ఆ వాదించేవారు అందరికీ ఏమి చేయాలో ఇదమిత్థంగా పాలుపోని, ఏదో ఒకటి చేయక తప్పని గాఢ సందిగ్ధావస్థ అని చెప్పుకోక తప్పదని అనిపిస్తున్న విషయం.
Post Reply