సమాధానం నెం.039 - ప్రశ్న నెం.039 (15-7-2021) విషయం "గమనిక-2".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.039 - ప్రశ్న నెం.039 (15-7-2021) విషయం "గమనిక-2".

Post by Katakam »

1) సమాధానం నెం.013 - ప్రశ్న నెం.013 (26-5-2021) విషయం "యోగా ప్రాక్టీసులో గమనికకు ఉన్న ప్రాముఖ్యత" కు కొనసాగింపుగా గమనిక గురించి వేరే మరికొంత సమాచారం ఇవ్వడానికి ప్రస్తుత ప్రశ్న, సమాధానం సంబంధించి ఉన్నాయని తెలియనగును.

2) వస్తుతః గమనిక అంటే ఏమిటి?

3) గమనిక లేదా గమనించడం అనే మాట చూడడం, గుర్తించడం, పరిశీలించడం, పరిశోధించడం, మొదలైన మాటలకు పర్యాయ పదంగా కొద్దిపాటి అర్థం మార్పులతో సామాజికంగా వాడబడుతున్న పదం.

4) యోగపరంగా గమనిక అంటే ఏమిటి?

5) అబ్జర్వ్ అనేది ఈ మాటకు ఆంగ్ల పదం. అబ్జర్వ్ అనే మాటకు మూల అక్షరాల పరంగా చెప్పుకుంటే పైన ఉండి గమనించడం అని అర్థం. అంటే పైనుంచి ఉపకరించడం అని అర్థం. పైనుంచి అంటే గమనించబడే జరుగుతున్న దాని ఎలాంటి ప్రభావానికి లోబడకుండా అని అర్థం. ఉపకరించడం అంటే జరుగుతున్న దాని లోతులు కదలడానికి, జరుగుతున్న దాని లోతులు బయటపడడానికి, జరుగుతున్న దాని లోతులు అర్థం కాబడడానికి సహకరించడం అని అర్థం. మొత్తంగా 'పైనుంచి ఉపకరించడం' అంటే జరుగుతున్న దాని లోతుల ప్రభావానికి ఏమాత్రం లోబడకుండా జరుగుతున్న దాని వెనుకనున్న అసలు ఉద్దేశ్యమైన ఆ జరుగుతున్న దాని లోతులు కదలడం, జరుగుతున్న దాని లోతులు బయటపడడం, జరుగుతున్న దాని లోతులు అర్థం కాబడేలా ప్రకటితం కావడం అనే జరుగుతున్న దానికి సహకరించడం అని అర్థం. తెలుగు మాట అయిన గమనిక ఇదే అర్థాన్ని ప్రతిబింబిస్తుంది. గమనిక అనే మాటకు ప్రక్రియ పరంగా ఇదే సరయిన అర్థం.

6) గమనిక సాధకునికి ఎలా ప్రయోజనకరం?

7) గమనిక అనేది అది గమనించే జరుగుతున్న దాని ప్రభావానికి ఏమాత్రం లోబడని కారణంగా గమనించబడే ఆ జరుగుతున్న దానికి ప్రేరణగా పనిచేస్తుంది.

8) కాకపోతే, ఈ గమనిక జరుగుతున్న దాని ప్రభావానికి లోబడకుండా ఉండడం అనేది ఒక్కసారిగా సాధ్యం కాకపోవచ్చు. జరుగుతున్న దాని ప్రభావానికి లోబడి ఉండే స్థాయి నుండి లోబడని స్థాయికి రావడానికి సమయం పట్టవచ్చు.

9) ఉదాహరణకు - యోగా ప్రాక్టీసు సమయంలో ఆలోచనలు రావడం, ఆ ఆలోచనలు వేగం సంతరించుకోవడం జరిగినపుడు, ఆలోచనలతో మమేకమై మనమే ఆలోచనలు చేస్తున్నట్లు ఉండడం అనేది గమనిక ఆలోచనల ప్రభావానికి లోబడి ఉన్నట్లు లెక్క. వచ్చే ఆలోచనలు వస్తూనే ఉండగా, ఆలోచనల నుండి విడిపడి ఆ ఆలోచనలను గమనించడం చేయగలిగే పరిస్థితి రావడమే గమనిక జరుగుతున్న దాని ప్రభావానికి లోబడకుండా ఉండడం.

10) ఇది యోగపరమైన గమనికకు ప్రాథమిక స్థాయి. యోగా ప్రాక్టీసు వలన ఈ గమనిక దేహ వ్యవస్థకు అలవాటు పడి, దాని స్దాయిలు పెరుగుతూ పోవడమే యోగ సాధకునికి వ్యక్తిగత ప్రయోజనం.

11) జరుగుతున్న దాని లేదా గమనించబడే దాని ప్రభావానికి లోబడకుండా పనిచేసే గమనిక స్థాయి ఇంకా మెరుగుపడితే, జరుగుతున్న దానికి లేదా గమనించబడే దానికి ఆ గమనికయే ప్రేరణగా పనిచేస్తుంది. ఇది కేవలం అనుభవైకవేద్యం, అంటే అనుభవం లోకి రావడం వలన మాత్రమే తెలియదగినది. ఆ తెలియడంలో పనిచేసేది కూడ గమనికయే.

12) యోగా ప్రాక్టీసు గమనికగా దాని విశిష్టత ఏమిటి?

13) ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈ గమనిక సామాజిక వ్యవహారాలలో పనిచేసే గమనికకు పూర్తిగా భిన్నమైనది. ఈ గమనిక గమనిక అనే మాటకు ఉన్న మౌలికమైన అర్థం నుండి తీసుకోబడింది.

14) సృష్టి ఆరంభం మొదలుకుని ఈ యోగ ఆరంభం ముందు వరకు గమనిక అనేది ఏ ఆధ్యాత్మిక సాధనకు సూక్ష్మ సాధనంగా ఎన్నడూ ఉపయోగించబడనే లేదు. దాని మౌలిక అర్థం మానవ జీవన/జీవిత విధానంలో ఎన్నడూ ఏ రకంగానూ అన్వయం చేయబడలేదు, అన్వయం చేయవలసిన అవసరం ఎన్నడూ ఏ రకంగానూ ఉత్పన్నమే కాలేదు. ఎందుకు అంటే మౌలిక అర్థం లోని అసలైన గమనిక స్థాయిని ఉపయోగించగలిగిన మానవ స్థూలం మాస్టరు గారిలో ప్లెంటీ ఆఫ్ ప్రాణా ప్రవేశించి ఈ యోగం ఆరంభమయే ముందు వరకు ఈ సృష్టిలో లేకపోవడమే గనుక.
Post Reply