1) వస్తుతః మీడియం అంటే ఏమిటి?
2) మీడియం అంటే వస్తుతః సాధనం అని అర్థం. మాస్టరు గారితో సహా మొత్తం 752 మంది మీడియములు సాధనాలే. మాస్టరు గారు మీడియం నెం .1. "మన చుట్టూ జరుగుతూ పోతున్న సాధారణ సృష్టిక్రమవికాసానికి సమాంతరంగా నడుస్తున్న నూతన ప్రాణానికి వాహకులు అవుతారు అనే అర్థంలో మాస్టరు సీ.వీ.వీ. గారి అనుయాయులను 'మీడియములు' అన్నారు" (శ్రీ యస్. నారాయణ అయ్యరు గారి 'నూతన యోగం' యొక్క ముందుమాట). దీనికి ప్రస్తుతానికి చెప్పుకోదగిన అర్థం ఏమిటి అంటే ప్లెంటీ ఆఫ్ ప్రాణా లింకును అర్హులైన ఇతరులకు పంచడానికి సాధనాలుగా పనిచేసేవారు అని.
3) మాస్టరు గారి కాలంలో హేలీస్ తోకచుక్క ద్వారా తనకు అందిన ప్లెంటీ ఆఫ్ ప్రాణా లింకును మిగతా 751 మంది మీడియములకు మాస్టరు గారే ఇనిషియేషను ప్రక్రియ ద్వారా ఇచ్చారు. యోగ కేంద్రాలను నిర్వహించే యోగ సాధకులు ఆ ఇనిషియేషను ప్రక్రియ ద్వారా ప్లెంటీ ఆఫ్ ప్రాణా లింకును సాధనాలుగా ఇతరులకు ఇవ్వడం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి.
4) స్వామి, పరమహంస, సరస్వతి లాగ అది ఒక ఆధ్యాత్మిక స్థాయికి సంకేతమా?
5) సాంప్రదాయ విధానంలో ఆధ్యాత్మిక స్థాయిలకు సంకేతాలు అయిన ఆ పదాల లాంటిది కాదు మీడియం లేదా సాధనం అనే మాట. సృష్టి విధానంలో ఇప్పటివరకు బయటపడని ఒక గొప్ప రహస్యాన్ని ఇముడ్చుకుని ఉంది సాధనం అనే అర్థం ఉన్న మీడియం అనే మాట. అది ఏమిటి అంటే స్థూలంగా మనిషి తనలో పనిచేసే శక్తితత్త్వానికి లేదా అంతశ్శక్తికి సాధనంగా పనిచేస్తూ దానినే 'నేను' అనుకుంటున్న పరిస్థితి నుండి తనలోని దివ్యత్వానికి లేదా అసలైన 'నేను' కు సాధనంగా పనిచేయగలిగిన పరిస్థితికి రావడం అనేది మీడియం అనే పదం వాడడం లోని ఔచిత్యం. "ఏకం ఆ ఏకంను చూడాలి" (డైరీ 20-6-1921) లేదా దాని సమానార్థకమైన 'నేను ఆ నేనును చూడాలి' అనే లక్ష్య సంబంధ వాక్యంలోని అర్థం మీడియం అనే మాట లోతులలో అన్యాపదేశంగా గుంభనంగా ఇమిడి ఉంది.
6) మన యోగంలో మీడియముల పాత్ర ఏమిటి?
7) మన యోగంలో మీడియముల పాత్ర ఏమిటి అని అన్నపుడు, అది మాస్టరు గారి కాలానికి మాత్రమే కాక నేటి కాలానికి కూడ అన్వయం చేసి చెప్పుకోవలసిన అవసరం. ఇది ఎందుకు అంటే ఈ యోగం ముఖ్యంగా మూలానికి, సృష్టి విధానానికి సంబంధించింది గనుక, సృష్టి ప్రజ మొత్తానికి లక్ష్య సిద్ధి చేరినపుడే యోగ/సృష్టి లక్ష్యం పూర్తయినట్లు లెక్క గనుక.
8) మాస్టరు గారి కాలపు మీడియములు మరల జన్మ తీసుకుని ఇప్పుడు ఉన్నవారు గానీ, అర్హత ఉన్న దృష్ట్యా ఇప్పుడు యోగంలో చేరి యోగా ప్రాక్టీసు చేస్తున్నవారు గానీ మీడియం అనే మాటకు ఉన్న అర్థంలో యోగ వ్యాప్తికి, యోగ క్రియలకు, యోగ ప్రక్రియలకు సాధనాలు అవుతారు అనేది ఖచ్చితమైన విషయం. కాకపోతే, ఆ జరిగే ప్రక్రియలు స్థూల శరీరాల మాధ్యమంగా సూక్ష్మంగా, సూక్ష్మాతిసూక్ష్మంగా జరుగుతాయి అనేది మాత్రమే ప్రస్తుతానికి చెప్పుకోదగిన విషయం. ఎందుకు అంటే యోగ పరంగా జరిగే ప్రక్రియలు మానవ మేథస్సుకు అందే స్థాయిలో ఉండవు గనుక.
సమాధానం నెం.040 - ప్రశ్న నెం.040 (17-7-2021) విషయం "మీడియం".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm