సమాధానం నెం.041 - ప్రశ్న నెం.041 (19-7-2021) విషయం "గురుశిష్య పరంపర, ఈ యోగం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.041 - ప్రశ్న నెం.041 (19-7-2021) విషయం "గురుశిష్య పరంపర, ఈ యోగం".

Post by Katakam »

1) గురుశిష్య పరంపరకు, ఈ యోగానికి ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి?

2) ప్రత్యక్షంగా ఏ సంబంధమూ లేదు. మాస్టరు గారి కాలంలోని యోగ సభ్యులను గురువు, శిష్యులు అనే మాటల ఊసే లేకుండా మాస్టరు గారితో సహా అందరినీ మీడియములు అని పేరు పెట్టడంలోనే ఈ విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. జన సామాన్య పదాలతో ఈ సంస్థకు "యోగా స్కూలు ఫ్రెండ్సు సొసైటీ" అని పేరు పెట్టడంలోనే గురుశిష్య పరంపరకు గానీ, వస్తుతః గురుశిష్య పరంపరకు సంబంధించిన ఆధ్యాత్మిక సాంప్రదాయబద్ధ మాటలకు గానీ ఈ యోగంలో స్థానం లేదు అని ని‌ర్ధారణ చేసుకోనవుతుంది.

3) పరోక్షంగా మాత్రమే గురుశిష్య పరంపరతో ఈ యోగానికి సంబంధం ఉంది. అది కూడ పరంపరగా కాక, పరంపరలో కనుగొనబడిన సృష్టి సంబంధ ప్రాథమిక విషయాలను, ఆ జ్ఞానాన్ని ఒక స్థాయి సమాచారంగా తీసుకుని, వాటి ఆధారంగా వాటి కంటె అతీతమైన యోగ సంబంధ సమాచారాన్ని రికార్డులలో ప్రక్షిప్తం చేయడంలో మాత్రమే. మొత్తం యోగా రికార్డులను నిశితంగా పరిశీలించి, అర్థం చేసుకోగలిగితే ఈ విషయం స్పష్టమవుతుంది.

4) మహోన్నతమైనది, సాంప్రదాయబద్ధమైనది అయిన గురుశిష్య పరంపర యోగంలో లేకపోవడానికి కారణమేమిటి?

5) గురుశిష్య పరంపర వస్తుతః ఆధ్యాత్మికతకు సంబంధించింది, ఆధ్యాత్మిక మహానుభావులకు సంబంధించింది, జన సామాన్యపు సామాజికానికి కాక మేథో మహానుభావులు లేదా జ్ఞానులు అనే ప్రత్యేక వర్గానికి సంబంధించింది. యోగం అలా కాక లక్ష్య సిద్ధి సంబంధంగా సమస్త మానవాళికి సంబంధించింది, ప్రత్యేకంగా ఏ ఒక్క వర్గానికీ సంబంధించింది కాదు.

6) గురుశిష్య పరంపర యొక్క ఉద్దేశ్యం అది కాకపోయినప్పటికీ, సర్వసమానత్వం అనే మాటకు ఆ పరంపరలో చోటే లేదు. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, శిష్యుడు గురువు అవుతాడు, అయినా తన గురువుకి శిష్యుడే, గురువులు శిష్యులు అందరూ సామాన్య జన సమాజంలో ఎన్నటికీ ఒకటి కాలేని ప్రత్యేక వర్గమే, సామాన్య జనానీకానికి బోధకులే. యోగ లక్ష్యంగా చెప్పుకోబడిన ప్రతి ఒక్కరికీ పరిపూర్ణత్వం అనే అంశానికి గురుశిష్య పరంపర లోని తారతమ్యత పూర్తిగా విరుద్ధం.

7) సాంప్రదాయబద్ధంగా మహోన్నతమైనది అయిన గురుశిష్య పరంపర యోగంలో లేకపోవడానికి ఇవి ప్రధాన కారణాలలో కొన్ని మాత్రమే.

8) గురుశిష్య పరంపర ఆనవాళ్లు ఈ యోగంలో ఏమయినా ఉన్నాయా?

9) ఈ యోగంలో ఏమీ లేవు. యోగ సాధకులలో ఉన్నాయి అని చెపితే, వినడానికి బాధాకరమే అయినా, అది కనుపిస్తున్న వాస్తవం. ఎలా అంటే, గతంలోని మహోన్నత సాంప్రదాయబద్ధ విధానంలో అమోఘమైన స్థాయిలను పొందినవారే అప్పటి మీడియములు మరియు ఇప్పటి యోగ సాధకులు అయి ఉన్నారు గనుక, ఆ లక్షణాల ప్రభావమే యోగా ప్రాక్టీసులోని కదిలింపులు, కుదిలింపుల కారణంగా బయటికి వ్యక్తమవుతూ యోగ వ్యవహారాలలో ఆ ఛాయలను/ఆనవాళ్లను ప్రస్ఫుటంగా కనుపింపచేస్తోంది గనుక.
Post Reply