1) గురుశిష్య పరంపరకు, యోగ పరంపరకు ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి?
2) లేదు అనేది ఖచ్చితమైన సమాధానం. కానీ, గురుశిష్య పరంపర గురించి, యోగ పరంపర గురించి కొంత వివరంగా తెలుసుకోవలసిన అవసరం.
3) గురుశిష్య పరంపర అనేది సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే సంబంధించింది. అది సామాన్య జనానీకానికి గానీ, సృష్టికి గానీ సంబంధించింది కాదు, సృష్టికి సంబంధించిన విషయాలు జ్ఞానులుగా వాళ్ళ ఆధ్యాత్మిక పరిశోధనల పరిధి లోనివే అయినప్పటికీ.
4) యోగ పరంపరకు సంబంధించి, డైరీలో 10-12-1912 న "ఈ సొసైటీలో మీ (= మీడియముల) స్థాయి, మీ ఫిజికలు మాస్టరు స్థాయి, ఆయన మాస్టరు యొక్క స్థాయి, 'వన్ పాయింటు' స్థాయి. ఈ క్రమాన్ని మార్చకూడదు" అని వ్రాయబడి ఉంది. ఈ స్థాయీ క్రమం సొసైటీకి సంబంధించి మాత్రమే చెప్పబడింది. అంటే సొసైటీలో పనిచేసే స్థాయిలకు సంబంధించి మాత్రమే చెప్పబడింది. మీడియములు, ఫిజికలు మాస్టరు స్థూల స్థాయిలు. ఫిజికలు మాస్టరు యొక్క మాస్టరు (= అసలు మాస్టరు), మాస్టరు కంటె పై స్థాయిది అయిన 'వన్ పాయింటు' లేదా 'ఏకం బిందువు' సూక్ష్మ స్దాయిలు, ఖచ్చితంగా చెప్పుకుంటే మూల స్థాయిలు.
5) ప్రపంచమంతా చెప్పుకునే భగవంతుడికి యోగ పరంపరలో స్థానం లేకపోవడానికి కారణం ఏమిటి?
6) ముందుగా చిన్న వివరణ. భగవంతుడు అనేది వ్యక్తి సంబంధం అనే విధంగా వాడుకలో ఉన్న మాట. అది వ్యక్తి కాదు, వ్యక్తి స్థాయి కాదు గనుక, దానిని భగవత్తత్త్వం అని వ్యవహరించడం మాత్రమే సమంజసం.
7) "ఈ యోగంలో ముఖ్యంగా ఆరిజిను గురించి, సృష్టి విధానం గురించి చెప్పబడింది" (డైరీ 14-11-1912). ఆ ఆరిజిను లేదా ఆరిజిన్ వన్ యే భగవత్తత్త్వం. అది నిష్క్రియాత్మక స్థితిలో ఉంది. పనిచేసే స్థాయిలను మాత్రమే సొసైటీలో పరంపరగా చెప్పుకోవడం జరిగింది గనుక, ఆరిజినుకు లేదా ఆరిజిన్ వన్ కు యోగపరంగా చెప్పబడిన పరంపరలో స్థానం లేదు.
8) యోగ పరంపరను సృష్టి పరంపరగా తీసుకోవచ్చునా?
9) లేదు, తీసుకోవడానికి వీల్లేదు. సృష్టి స్థితి లయం లను నిర్వహించే బ్రహ్మ విష్ణువు శివుడు, వాటికి పైన ఆదిశక్తి అని తెలియడం మాత్రమే తప్ప, సృష్టి పరంపర అంటూ ఏదీ ప్రత్యేకంగా చెప్పబడలేదు గనుక, యోగ పరంపరకు మరియు లేని సృష్టి పరంపరకు లింకు పెట్టడానికి వీల్లేదు. అదీగాక, "ఈ నూతన విధానంలో బ్రహ్మ శివుడు విష్ణువు లకు ఎలాంటి సంబంధం కల్పించకూడదు. ఎవరయినా పై త్రిమూర్తిత్వం గురించి చర్చించినా లేదా పోలిక తెచ్చినా, వాళ్లు శాశ్వతంగా బహిష్కరించబడతారు" అనేది డైరీలో 14-11-1912 న మీడియములకు సూచించబడిన విషయం.
సమాధానం నెం.042 - ప్రశ్న నెం.042 (21-7-2021) విషయం "గురుశిష్య పరంపర, యోగ పరంపర".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm