సమాధానం నెం.045 - ప్రశ్న నెం.045 (27-7-2021) విషయం "మరణం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.045 - ప్రశ్న నెం.045 (27-7-2021) విషయం "మరణం".

Post by Katakam »

1) మరణం అంటే ఏమిటి?

2) మరణం అంటే చనిపోవడం. ప్రాణం వెడలిపోగా, స్థూల శరీరంలో సమస్త క్రియాకలాపాలు ఆగిపోగా, స్థూలం అచేతనమై కూలిపోవడం.

3) మరణం దేనికి సంబంధించింది - స్థూలానికా, సూక్ష్మానికా, మూలానికా?

4) మరణం స్థూలానికి సంబంధించింది కాదు, ఎందుకు అంటే ఒకసారి ఒక స్థూలం కూలిపోయిన తరువాత అదే స్థూలం మళ్ళీ రాదు గనుక, వేరే ఇంకొక స్థూలం వస్తుంది గనుక.

5) ఈ ప్రతిపాదన విడ్డూరం అనిపించడం సహజమే. వివరణ దానిని తీరుస్తుంది. మరణించేది స్థూలమే. కానీ, మరుజన్మకు వచ్చేది మరణించిన స్థూలం కాదు. వేరే స్థూలం వస్తుంది. ఏ జన్మకు ఆ జన్మకు వేర్వేరు స్థూలాలే. మరణం మరణంతో ఆగకుండా మరో జన్మకు దారితీస్తుంది, కానీ ఆ జన్మ మరణించిన స్థూలంది కాదు. ఏ జన్మకు ఆ స్థూలం సంబంధించిందో, ఆ జన్మకు సంబంధించిన ఆ స్థూలానికి మాత్రమే మరణం.

6) మనం ఇక్కడ చెప్పుకుంటున్న మరణం కేవలం ఒక జన్మకు మాత్రమే పరిమితమయింది కాక, ఒక సృష్టి అంశంగా సృష్టి స్థాయిదిగా జరుగుతున్న ప్రక్రియకు సంబంధించిన ఒక నిరంతరాయ ప్రక్రియగా మాత్రమే వివరించబడుతోంది గనుక, మరణం అనేది స్థూలానికి సంబంధించింది కాదు, ఒక జన్మకు సంబంధించి మరణం ఆ జన్మకు సంబంధించిన స్థూలానిదే అయినప్పటికీ.

7) మరణం సూక్ష్మానికి సంబంధించింది కాదు. శక్తితత్త్వ సంబంధమైన సూక్ష్మానికి మరణం లేదు, ఏ జన్మకు ఆ జన్మకు సంప్రాప్తించే ప్రారబ్ద కర్మను ఆధారం చేసుకుని మార్పులు చేర్పులు తప్ప.

8) మూలానికి మరణమే లేదు. స్థూలాలు మారినా, సూక్ష్మాలలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, మూలం ఎలాంటి మార్పులు లేని శాశ్వత ఉనికి.

9) మరణం దేనికి సంబంధించింది అనే విషయం తెలియాలి అంటే మరణం అనే మాటకు ప్రత్యామ్నాయంగా యోగంలో వాడబడిన పంజర మార్పిడి అనే పదాన్ని విశ్లేషించవలసిందే.

10) దేనికి పంజరం అనే దానికి సమాధానం చెప్పుకోవడం లోనే విషయం స్పష్టంగా తెలిసే అవకాశం.

11) స్థూలం అనే పంజరం సూక్ష్మానికా అంటే కాదనేదే సమాధానం. ఎందుకు అంటే స్థూల ఉనికిలో సూక్ష్మం క్రియాశీలకంగా ఉండడం అనేది ప్రాణం లేదా మూలం ఉండడం అనేదానితో సంబంధం కలిగి ఉంది గనుక, సూక్ష్మానికి స్థూలం పంజరం కాదు.

12) ఇకపోతే మిగిలింది మూలం/ప్రాణం. ప్రతి జన్మకూ స్థూలంలో ప్రవేశించేది, స్థూలం నుండి వెడలిపోయేది మూలమే/ప్రాణమే గనుక, స్థూలం మూలానికే/ప్రాణానికే పంజరం.

13) సృష్టి లక్ష్యం అనేది ప్రాణం స్థూలం యొక్క కలయికయే, ప్రాణం యొక్క శాశ్వత ఆవాసానికి స్థూలం సిద్ధం కావడమే ఫిజికల్ ఎస్టాబ్లిష్ లేదా స్థూల స్థాపన. మరణం లేని మూలానికి/ప్రాణానికి స్థూలం నుంచి విడిపోవలసిన అవసరం లేకుండా ఉండడమే అమృతత్వం కదా.

14) సృష్టిలో మరణం ఎందుకు ఉంది?

15) ఇది వ్యక్తి స్థాయి విషయంగా కాక సృష్టి విధానంగా మాత్రమే జరుగుతున్న పరిస్థితి. యోగ సంబంధంగా జరిగిన క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలు, వాటికి లిఖిత రూపం కలిగించిన సమస్త యోగా రికార్డులు ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. సృష్టి లక్ష్య సిద్ధి యొక్క అంతిమ స్థాయికి ఒక మధ్యంతర అవస్థగా మాత్రమే ఒక ప్రతికూల ప్రక్రియగా మరణం ఉంది అని మాత్రమే ప్రస్తుతానికి చెప్పుకోనవుతుంది.
Post Reply