1) ఈ మధ్య కాలంలో ఈ యోగ లక్ష్య సిద్ధికి సంబంధించింది ఈ స్థూలం కాదు, ఈ భూమి కాదు అని ప్రచారమయింది కదా. అది ఎంతవరకు నిజం?
2) ఆ ప్రచారం కేవలం పూర్తి స్థాయి అవాస్తవం మాత్రమే. ఇది మోక్షం అంటే స్థూలం కూలిపోయిన అనంతరం సూక్ష్మంగా/ఆత్మగా దేముడిలో ఐక్యం అయిపోవడం అనే సృష్టి లక్ష్య విరుద్ధ సిద్ధాంతానికి అనుగుణంగా చెప్పబడిందే, సృష్టి లక్ష్యం గురించి స్వయంగా తెలియక, పైనుండి అందింది అర్థమూ కాక చేయబడిన ప్రచారం మాత్రమే.
3) అది వాస్తవం కాకుంటే, యోగ లక్ష్య సిద్ధికి ఈ స్థూలం, ఈ భూమి సంబంధంగా ఉన్న వాస్తవం ఏమిటి?
4) బ్రతికి ఉండగా చేసుకున్న పుణ్యం ఆధారంగా మరణానంతరం దేముడిలో ఐక్యం అయిపోవడమే మోక్షం అనే అర్థంలో ఉన్నదే సృష్టి లక్ష్యం అయినట్లయితే, సృష్టి జరగవలసిన అవసరం ఏమిటి, మిగతా జీవజాతులు మరియు మానవుల ఆవిర్భావానికి అర్ధం ఏమిటి. తెలియనిది తెలియనిది మాత్రమే అవుతుంది తప్ప, ఆ తెలియని దానిని లేదు అని అనడానికి లేదు కదా. తెలియని సృష్టి లక్ష్యాన్ని లేదా తెలిసింది అసమంజసమని నిర్ధారణ అయిన సృష్టి లక్ష్యాన్ని తెలుసుకోవడం లోనే, మానవ ఉనికి లక్ష్యం, సృష్టి లక్ష్యం గురించి అందే అవకాశం. అందుకే డైరీలో 14-11-1912 న మీడియములకు వేసిన ఏడు ప్రశ్నలలో "మోక్షం అంటే ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి" అనే రెండవ ప్రశ్న.
5) సూక్ష్మం నుండి స్థూలానికి వచ్చి, వెనక్కి వెళ్ళి మళ్ళీ సూక్ష్మంలో కలవడమే మోక్షం అని అనుకునే పక్షంలో, స్థూలానికి రాకుండా సూక్ష్మంగానే ఉండిపోతే మోక్ష స్థితిలో ఉన్నట్లే కదా.
6) మృత్యోర్మా అమృతం గమయ అనే అభ్యర్థనా పూర్వక వేదసూక్తం అర్థ రహితం కాదు కదా. మరణం నుండి అమృతత్వం వైపుకు మమ్ములను నడిపించవలసినది అనే సూక్తానికి లోతుల అర్థం చెప్పుకుంటే, మరణం లేని సూక్ష్మానికి, మూలానికి/ప్రాణానికి అమృతత్వం అనేది అవసరం లేదు గనుక, మరణానికి లోనవుతున్న స్థూలానికే అమృతత్వం సంబంధించి ఉంది అనేది ఒప్పుకోదగిన, ఉన్న వాస్తవం కాదా. ఈ మానవ స్థూలానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది గనుకనే, యోగ క్రియలు, ప్రక్రియలు, ప్రయోగాలు సమస్తం స్థూలాల లోనే జరిపించబడవలసిన అవసరం, ఫిజికల్ ఎస్టాబ్లిష్ లేదా స్థూలం సుస్థాపన కావడం అనేది యోగ లక్ష్యంగా పేర్కొనబడిన అంశం.
7) అలాగే, ఈ యోగ లక్ష్య సిద్ధికి స్థావరం ఈ భూమియే. ఈ భూమి మీద తప్ప సృష్టిలో ఎక్కడా జీవ సృష్టి లేదు అనేది విజ్ఞాన శాస్త్రం కూడ నిర్ధారించిన విషయం.
8) డైరీలో 14-11-1912 న మీడియములకు వేయబడిన ఏడు ప్రశ్నలలో "ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించిందీ మీరు తెలుసుకోవాలి" అనే మూడవ ప్రశ్న అన్యాపదేశంగా ఈ విషయాన్నే నిర్ధారిస్తుంది.
9) యోగ లక్ష్యం సిద్ధించవలసింది ఈ భూమి మీద జన్మ తీసుకున్న ఈ స్థూలాలలోనే. ఇది వాస్తవం, ఇదే వాస్తవం.
సమాధానం నెం.046 - ప్రశ్న నెం.046 (29-7-2021) విషయం "ఈ యోగ లక్ష్య సిద్ధి - ఈ స్థూలం, ఈ భూమి".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm