సమాధానం నెం.047 - ప్రశ్న నెం.047 (31-7-2021) విషయం "వ్యక్తి ప్రాధాన్యత".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.047 - ప్రశ్న నెం.047 (31-7-2021) విషయం "వ్యక్తి ప్రాధాన్యత".

Post by Katakam »

1) వ్యక్తి ప్రాధాన్యత అంటే ఏమిటి?

2)వ్యక్తి ప్రాధాన్యత అంటే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం. నడుస్తున్న బృహత్ సృష్టిలో, మహత్ సృష్టిలో జరిగేది ఏదయినా వ్యక్తి ద్వారానే స్థూల సృష్టిలో గనుక, జరిగేదానికి సంబంధించిన ప్రాధాన్యతను మనిషికి/వ్యక్తికి ఇవ్వడమే వ్యక్తి ప్రాధాన్యత.

3) వ్యక్తి ప్రాధాన్యతకు యోగంలో ఉన్న స్థానం ఏమిటి?

4) యోగారంభం సమయంలో వ్యక్తి ప్రాధాన్యత ఉన్నట్లు కనుపించదు. యోగా ప్రాక్టీసు ఊపు అందుకుని, విషయ అవగాహనకు అవకాశాలు పెరిగిపోతున్న తరుణంలో వ్యక్తి ప్రాధాన్యత కూడ స్థానం సంతరించుకుంది అని అనిపిస్తున్న విషయం. దానికి తోడు మాస్టరు నామం లేదా ప్రాక్టీసు నామం ఫిజికలు మాస్టరు గారి నామ ప్రథమాక్షరాలకు సంబంధించిందేమో అనుకోవడానికి పూర్తి ఆస్కారం ఉన్న కారణంగా ప్రస్తుత సృష్టి విధానంలో ప్రబలంగా ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ఫిజికలు మాస్టరు సీ.వీ.వీ. గారి పట్ల సహజంగానే ఉధృతమయింది. అది నేటికీ అలాగే ఉంది, అప్పటి కంటె ఇంకా పెరిగింది అని చెప్పుకోవడం ఎంతయినా సమంజసం. అది ప్రాంతాల వారీగా మీడియముల పట్ల కూడ ఆ వ్యక్తి ప్రాధాన్యత పాదుకుంది అనేది సత్యదూరం కాదు.

5) విషయ ప్రాధాన్యత అంటే ఏమిటి?

6) వ్యక్తికి కాక వ్యక్తి ద్వారా వచ్చిన విషయానికి ప్రాధాన్యత ఇవ్వడమే విషయ ప్రాధాన్యత. గొప్ప వాళ్ళు చెప్పింది గొప్ప విషయమే అవుతుంది అనేది వ్యక్తి ప్రాధాన్యత. గొప్ప విషయాలు గొప్ప వాళ్ళ నుంచే వస్తాయి అనేది విషయ ప్రాధాన్యత. కానీ, ప్రస్తుత సృష్టి విధానంలో విషయం యొక్క గొప్పతనం తెలిసినా తెలియకపోయినా, ప్రాధాన్యత వ్యక్తికి ఇవ్వడమే పరిపాటిగా ఉంది.

7) విషయ ప్రాధాన్యతకు యోగంలో ఉన్న స్థానం ఏమిటి?

8) యోగంలో కూడ విషయ ప్రాధాన్యతను మించి వ్యక్తి ప్రాధాన్యతకే ప్రముఖమైన స్థానం ఉందని చెప్పుకోవడమే సముచితం. అది సముచితమేనా అనే ప్రశ్న వేసుకుంటే, ప్రస్తుత పరిస్థితులలో అది సముచితం, అదే సముచితం అని అనుకోవడానికే అవకాశం ఎక్కువ.

9) వ్యక్తి ప్రాధాన్యత, విషయ ప్రాధాన్యత ఈ రెండిటిలో ఏది ఉత్తమం అని ప్రశ్న వేసుకుని చూస్తే, చెప్పుకోదగిన సమాధానం మరియు ఒక రకంగా మింగుడుపడని వాస్తవం ఏమిటి అంటే యోగ లక్ష్య సిద్ధిలో భాగంగా ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఇతరుల మీద ఆధారపడని స్వతంత్రత అనే పరిపూర్ణత సంతరించబడవలసిన నేపథ్యంలో విషయ ప్రాధాన్యతదే ప్రథమ స్థానం, వ్యక్తి ప్రాధాన్యతది ద్వితీయ స్థానం అని చెప్పుకోవడం సముచితం మాత్రమే కాదు, ముదావహం కూడ.
Post Reply