సమాధానం నెం.048 - ప్రశ్న నెం.048 (2-8-2021) విషయం "డైరెక్టు లైను".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.048 - ప్రశ్న నెం.048 (2-8-2021) విషయం "డైరెక్టు లైను".

Post by Katakam »

1) డైరెక్టు లైను అంటే ఏమిటి?

2) డైరెక్టు లైను అంటే మాటగా చెప్పుకుంటే 'సూటి మార్గం' లేదా 'సూటి విధానం' అని అర్థం. యోగా ప్రాక్టీసు సంబంధమైన ప్రక్రియను ఆధారం చేసుకుని చెప్పాలి అంటే యోగా ప్రాక్టీసు సమయంలో ప్రతి యోగ సాధకునిలో ప్లెంటీ ఆఫ్ ప్రాణా ప్రవేశించడంలోనే దాని అర్థం తెలియనవుతుంది. ఒకసారి ఇనిషియేషను లేదా యోగప్రవేశం జరిగిన తరువాత యోగ సాధకునిలో ప్లెంటీ ఆఫ్ ప్రాణా ప్రవేశించడంలో వేరే ఎవరి ప్రమేయం ఉండదు. దానిని ఆధారం చేసుకుని 'డైరెక్టు లైను' అంటే ఎవరి మధ్యవర్తిత్వం లేని సూటి విధానం అని ఒకరకంగా చెప్పుకోనవుతుంది.

3) డైరెక్టు లైను వ్యక్తి సంబంధమా లేదా సృష్ఠి సంబంధమా లేదా రెండిటి సంబంధమూనా?

4) డైరెక్టు లైను వ్యక్తి సంబంధం, సృష్టి సంబంధం, రెండిటి సంబంధం కూడ. ప్రస్తుత సృష్టి విధానం సంబంధంగా లోతులను దర్శించి, వాటిని ఈ యోగంతో, ఈ యోగ విధానంతో పోల్చగలిగితే తప్ప, డైరెక్టు లైను అనే మాటలకు అర్థం తెలిసిరాదు. ఈ సందర్భంగా మాస్టరు గారి డై‌రీలో 10-12-1912 న వ్రాసిన "మీ ప్రాక్టీసును, అనుభవాన్ని ఆధారం చేసుకుని 'డైరెక్టు లైను' విధానమంటే ఇదనీ అదనీ మీకు మీరుగా నిర్ణయానికి రాకూడదు" అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం. అలాంటప్పుడు, 'డైరెక్టు లైను' గురించి ఇపుడు చెప్పడం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తప్పనిసరిగా చెప్పుకోవలసిన అవసరమే.

5) మాస్టరు గారి అప్పటి కాలానికి ఉన్న పరిస్థితికి భిన్నంగా, అప్పటి పరిస్థితికి కొనసాగింపుగా చోటు చేసుకున్న యోగపరమైన డెవలప్మెంట్ల దృష్ట్యా, యోగా రికార్డుల లోని విషయాల అవగాహన పెరిగి ఉన్న దృష్ట్యా మాత్రమే 'డైరెక్టు లైను' గురించి చెప్పుకునే అవకాశం కలిగింది అని మాత్రమే ప్రస్తుతానికి చెప్పుకోనగును.

6) వ్యక్తి సంబంధంగా డైరెక్టు లైను అంటే ఏమిటి?

7) వ్యక్తిగత ఉనికికి మూలమైన ప్రాణం కేవలం ప్రాణం నుండి వెలువడే ప్రాణతరంగంగా మాత్రమే స్థూలంతో సంబంధం కలిగి ఉంది. స్థూలంలో 'నేను' అని చెప్పుకునేది అసలు 'నేను' కాదు. ఇది "నేను ఆ నేనును చూడాలి" అనేదానికి సమానార్థక సూచకమైన "ఏకం ఆ ఏకంను చూడాలి" (డైరీ 20-6-1920) అనే పదాలలో ద్యోతకమవుతుంది. కేవలం ఉండడం మాత్రమే చేసే ప్రాణతరంగం స్థానంలో మూలంగా, మూల ఉనికిగా స్థూల సంబంధ క్రియాకలాపాలను సమస్తాన్ని తాను స్థూలంలో ప్రవేశించడం ద్వారా ప్రాణం/మూలం తన అధీనంలోకి తీసుకోవడమే ఇమ్మీడియేట్ -అంటే మధ్యంతరాల అధికారిక ప్రమేయం లేకుండా, అంటే మధ్యన వర్తించేవి ప్రాణం/మూలం యొక్క అదుపు ఆజ్ఞలకు లోబడి, వర్తించడం- అవుతుంది. అంటే మూలమే/ప్రాణమే తన స్థూలం యొక్క సమస్త కార్యకలాపాలను డైరెక్టుగా నిర్వహించుకోవడం అవుతుంది. ఇండిపెండెన్సీ అనే మాటకు స్వతంత్రత అనే సాధారణ అర్థాన్ని మించి 'డిపెండింగ్ ఆన్ ది ఇన్' లేదా తెలుగు అర్థంగా 'లోపలి దాని మీద ఆధారపడి ఉండడం' అనే ప్రక్రియపరమైన అర్థం సార్థకం అవుతుంది. ఇదే వ్యక్తి సంబంధంగా డైరెక్టు లైను విధానం.

8) సృష్టి సంబంధంగా డైరెక్టు లైను అంటే ఏమిటి?

9) ప్రస్తుత సృష్టి సమస్తం ప్రాణం నుండి విడిపడిన శక్తితో నిండి ఉంది, అంటే శక్తిమయంగా ఉంది. శక్తిమయమైన ప్రస్తుత సృష్టి సృష్టికి మూలమైన ప్రాణంతో నిండడమే, అంటే ప్రాణమయం కావడమే, ప్రస్తుత సృష్టి నూతన సృష్టి కావడం. ప్రాణంతో నిండిన సృష్టిలో మరణం నాస్తి అవుతుంది, అంటే మరణం అనేది లేకుండా పోతుంది. సృష్టి లయ విలయ ప్రళయాల నుండి విముక్తం అవుతుంది. ప్రాణమే సృష్టికి డైరెక్టు లేదా ఇమ్మీడియేట్ -అంటే మధ్యన వర్తించే మధ్యంతరాలు లేని లేదా మధ్యంతరాల ఆధిపత్యం లేని- ఆధారం అవుతుంది. మాస్టరు సీ.వీ.వీ. నమస్కారం అనే మూలసూత్రం లోని నమస్కారం అనే మాటకు ఉన్న అసలైన అర్థం -అంటే తన సృష్టి కార్యక్రమాన్ని పూర్తిచేసిన శక్తి లేదా ఆరిజిన్ టూ లేదా రెండవ ఆది నీ కార్యక్రమాన్ని నీవు చేపట్టవలసింది అని తన మూలమైన ప్రాణానికి లేదా ఆరిజిన్ వన్ కి లేదా మొదటి ఆదికి చేసుకున్న విన్నపం- సార్థకం అవుతుంది. ఇదే సృష్టి సంబంధంగా డైరెక్టు లైను విధానం.
Post Reply