1) స్థూలం అంటే ఏమిటి?
2) ఇంద్రియ గోచరమయే శరీర భాగమే స్థూలం అని పరిగణించబడుతుంది. అంటే బయటికి కనుపించే శరీర భాగాలతో పాటు స్థూల శరీరం లోపల స్థూల పదార్థ రూపంగా ఉన్న శరీర భాగాలు సమస్తమూ కలుపుకుని స్థూలం అని పిలువబడుతుంది. అంటే ఇంద్రియ గోచరం కాదగిన స్థూల శరీర భాగాలు సమస్తం స్థూలం అని పరిగణించబడుతుంది.
3) స్థూలం అవసరం ఏమిటి?
4) అంటే స్థూల స్థితుల నుండి, సూక్ష్మ పదార్థ స్థాయిల నుండి, స్థూల పదార్థ రూపాలయిన లోహ వృక్ష జంతు జీవ దశల కొనసాగింపుగా సృష్టిక్రమ వికాసంలో మనిషి దశగా మానవ స్థూల రూపం రావలసిన అవసరం ఏమిటి అనేది దీని అర్థం. వికాస క్రమంలో మానవ స్థూల రూపం దాని ముందరి జీవదశల లక్షణాలను పుణికి పుచ్చుకుని ఉంది అనేది మానవ మేథస్సుకు అందరాని విషయమే. ఈ మధ్య కాలంలో విజ్ఞాన శాస్త్రవేత్తలకు అందిన విషయం ఈ వాస్తవానికి అద్దం పడుతుంది. ఏమిటి అంటే మనిషిలో మానవ కణాలు ఉంది కేవలం10 శాతం మాత్రమే అని. అలాగే ఆధ్యాత్మికవేత్తలు ఖండితంగా వెల్లడించిన విషయం కూడ క్రమవికాస విషయాన్నే అన్యాపదేశంగా సమర్థిస్తుంది. అది ఏమిటి అంటే మనిషి ఇంకా మనిషి దశకు చేరుకోలేదు, ప్రస్తుతం మనిషిది జంతు మనిషి స్థాయి మాత్రమే అని. మనిషి మేథస్సుకు అందనిది, అందిన ఒక స్థాయి విషయం యొక్క లోతులలో ఉన్నటువంటిది ఏమిటి అంటే మానవ స్థూలం రూపం పరంగా మనిషి దశయే అయినప్పటికీ, లక్షణ పరంగా లోహ వృక్ష జంతు దశలు మాత్రమే మనిషిలో ప్రబలంగా ఉన్నాయి అనేది దీని సారాంశం అని. ఇది యోగ పరంగా చేయబడిన ప్రయోగాలలో ఒక రకంగా తేలికగానే తెలియదగినదిగా మాస్టరు గారి డైరీలో వ్రాయబడి ఉన్న విషయం. సూక్ష్మ స్థితుల నుండి రూప సంబంధమైన పరిపూర్ణతకు కొనసాగింపుగా లక్షణపరమైన పరిపూర్ణతను సంతరించుకోవడమే మానవ స్థూలం యొక్క అవసరమని నొక్కి వక్కాణించదగిన విషయం, వ్యక్తి సంబంధిత వ్యక్తి స్థాయి మితిలో.
5) స్థూలానికి, సృష్టి లక్ష్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
6) మానవ స్థూలం కనుపిస్తున్న స్థూల రూపమే. సృష్టి లక్ష్యం ఏమిటి అనేది ఇదమిత్థంగా తెలియవలసిన అవసరం. శూన్య స్థితులలో ప్రథమ ఉనికిని పొందిన ఆరిజిన్ వన్ లో లేదా మొదటి ఆదిలో బయలుదేరిన సంకల్పమే సృష్టి లక్ష్యం. అది ఏమిటి అంటే 'నేను ఎవరిని? నేను అది కావాలి' అని. పారిభాషిక పదజాలాలలో అందే మాదిరిగా ఈ పదజాలం లోని భావం అందనిది, మేథస్సు యొక్క పరిధిలో లేనటువంటిది. ఆ సృష్టి లక్ష్యానికి అంతిమ స్థూల రూపం రూపం పరంగా మాత్రమే కాక లక్షణపరంగా కూడ పరిపూర్ణతను సంతరించుకోవడానికి అనువైన అర్హమైన స్థూల రూపం మానవ స్థూలమే, ప్రస్తుతం అనేకానేక..మితులకు పరిమితులకు లోబడి లక్ష్య సంబంధంగా అలక్ష్యం నిర్లక్ష్యం చేయబడిన మానవ స్థూలమే, 'శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం' అనే లక్ష్య సంబంధ వచన భాగాన్ని సృష్టి లక్ష్య సంబంధమని ప్రవచింపజాలని అమోఘమైన మేథస్సు దేనిని జీవన వ్యాపారానికి లేదా బ్రతుకు సాగదీయడానికి ఘనమైన సాధనంగా సాంప్రదాయబద్ధమైన శృంఖలాలలో అమోఘంగా బిగించిందో ఆ మానవ స్థూలమే.
సమాధానం నెం.051 - ప్రశ్న నెం.051 (8-8-2021) విషయం "స్థూలం".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm