1) శ్రీమతి జీ. కిరణ్మయి అనే యోగ మిత్రురాలు ఆంగ్లంలో వేసిన ప్రశ్నకు ఇది సమాధానం.
2) యోగా ప్రాక్టీసుకు కూర్చున్నపుడు, భంగిమ ఎలా ఉండాలి, చేస్తున్నది కరెక్టేనా అనేది ప్రశ్న సారాంశం. యోగ సాధకుడు ప్రాక్టీసుకు కూర్చోవలసిన తీరు లేదా భంగిమ మాస్టరు సీ.వీ.వీ. గారు ఆయన ఫోటోలో కూర్చుని ఉన్నదే, అదే ఉత్తమం. ఎడమ తొడ మీద కుడి కాలు పెట్టి, ఎడమ చేతిని మొత్తంగా ఎడమ మోకాలికి విడిపడకుండా లేదా తాకుతూ ఉండేలా తాటించి, కుడి చేతిని మణికట్టు నుండి మోకాలిని తాకకుండా వదులుగా ఉండేలా ఆనించి కూర్చోవడం. యోగా ప్రాక్టీసుకు కూర్చున్నపుడు కాళ్ళ భంగిమగా, పిమ్మట కూర్చుని, కళ్ళు మూసుకుని, నమస్కారం చేసుకుని, మాస్టరు నామం లేదా/మరియు తదుపరి కోర్సు నామం చెప్పుకుని, చేతులు మోకాళ్ల మీద ఉంచుకునేటపుడు చేతుల భంగిమగా అసలైన ప్రాక్టీసు జరిగే ముందు వరకు ఉండవలసిన భంగిమ సంబంధమైన తీరు ఇదే. ఇది (మాస్టరు గారి ప్రాక్టీసు భంగిమ ఉన్న ఫోటో) యోగా ప్రాక్టీసుకు సంబంధించిన మాస్టరు గారి డైరీలలో విషయంగా వివరించకుండా ప్రాక్టికల్ గా చూపించబడిన యోగా ప్రాక్టీసు భంగిమ. కాళ్ళు ఉంచే తీరుకు, చేతులు ఉంచే తీరుకు సంబంధించి ప్రాక్టీసు పరంగా లక్ష్య సంబంధమైన లోతుల అర్థాలు ఉన్నాయని చెప్పుకోవడం మాత్రమే ప్రస్తుతానికి అవసరం.
3) భంగిమ సంబంధంగా కె. కోర్సులో 29-6-1910 న వ్రాయబడిన లిఖిత భాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం.
4) "ప్రాక్టీసు సంబంధమైన భంగిమ (= ప్రాక్టీసు సమయంలో ఏ భంగిమలో/ముద్రలో ఉండాలి అనేదాని) గురించిన మూలసూత్రాలు అనేవి మూలసూత్రాలను (= యోగ విధాన సంబంధమైన మూలసూత్రాలను) ప్రాక్టీసు చేసే నిమిత్తం తాముగా (= ప్రాక్టీసులో) సంలగ్నం కావడం కోసం వాళ్ళు ఇష్టపడిన ఏ భంగిమలో/ముద్రలో అయినా కూర్చోవడానికి నమూనా భావాలు మాత్రమే".
"ప్రాక్టీసు మాత్రం చేయాలి ఎలా అయినా."
°నీవు ఏదయినా భంగిమలో ఉండగా, ఆ బిందువును (= లక్ష్య ఏకంను) కనిపెట్టడానికి ఏ విధమైన కఠిన భావాలయినా కొనసాగుతున్నట్లయితే, నీ శ్వాస పీడన ఈడికను వదులుచేయి (= భారంగా నడిచే శ్వాసను తేలికపరుచు), నీ ఎంపిక లోని లేదా ఎంచుకున్న భంగిమల లోని (= గత జన్మల సాధనలలో దేహ వ్యవస్థకు అలవాటయిన సాధనా భంగిమల లోని) ఏదో ఒకదానిలో నీ శరీరాన్ని ఉంచి, ఓపికగా పనిచేసేలా మేకులు బిగించు (= ప్రాక్టీసు కొనసాగింపుకు భంగం కలగని భంగిమలో శరీరాన్ని ఉంచు). (= ఇది సూచనగా అనిపిస్తున్నా, ఆంతరికంలో యాంత్రికంగా జరిగే ప్రక్రియ ఫలితంగా భంగిమ దానంతట అది మారిపోయే అవకాశం ఉన్న పరిస్థితి). ఇలా చేయడం ఎందుకు అంటే నీ పాఠ్యాంశాన్ని (= సృష్టి లక్ష్య విషయాన్ని) పొడిగించుకుంటూ పోయే ప్రక్రియలో లేదా మెదడు సంస్కృతి అభ్యున్నతి కోసం ఒకానొక పరిమితి మేరకు ప్రాక్టీసు చేయడం అనే ఒక పాఠ్యాంశం (= ప్రాక్టీసు సంబంధిత విషయం) మరియు దైనందిన కార్యక్రమాల తీరిక వేళలలో దానిని కొనసాగించడం అనే మరియొక పాఠ్యాంశం (= నియమిత సమయపు ప్రాక్టీసుకు కొనసాగింపు అనే విషయం) లతో ప్రాక్టీసును కొనసాగించాలి గనుక."
5) గుంభనమైన పదజాలాలతో, భావగాంభీర్యంతో అర్థం కావడం అంత తేలిక కాని రీతిలో ఉన్న పై లిఖిత భాగానికి అవసరం మేరకు సారాంశాన్ని చెప్పుకోవడం అవసరం అని అనిపిస్తున్న విషయం. ఏమిటి అంటే - శరీరానికి అనువయిన ఏ భంగిమలో అయినా కూర్చోవచ్చును, ముఖ్య ఉద్దేశ్యం భంగిమ సంబంధంగా భంగం కలుగకుండా ప్రాక్టీసు కొనసాగడమే, మెదడు సంస్కృతి డెవలప్ కావడమే, నియమిత సమయంలో (= ఉదయం 6 గంటలకు) చేసే/జరిగే ప్రాక్టీసుకు కొనసాగింపుగా రాత్రిపూట నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఆలోచనలను (= దైనందిన కార్యక్రమాలు అయిన మాటలకు, చేతలకు సంబంధించిన ఆలోచనలను) తిరగ తోడుకోవడం అనే ఉన్నతతరమైన చేసే ప్రాక్టీసుకు) నియమిత సమయపు దైనందిన పరిమిత ప్రాక్టీసు అవకాశం కల్పించడమే.
సమాధానం నెం.052 - ప్రశ్న నెం.052 (10-8-2021) విషయం "యోగా ప్రాక్టీసులో కూర్చొను భంగిమ".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm