1) జీవ దశలు అంటే ఏమిటి?
2) మూల సృష్టి నుండి సూక్ష్మ సృష్టి, సూక్ష్మ సృష్టి నుండి స్థూల సృష్టి ఏర్పడగా, స్థూల సృష్టిలో ఏర్పడిన స్థూల రూపాల దశా క్రమమే జీవ దశలు లేదా లోహ వృక్ష జంతు మనిషి దశలు. ఈ దశా క్రమాన్నే పరిణామ క్రమం లేదా సృష్టివికాస క్రమం అని చెప్పనవుతుంది. ఆరంభ దశ అయిన లోహ దశలో లోహ రూప దశకు రావడానికి కావలసిన మూల వనరులు, వాటి క్రియాక్రమం నిక్షిప్తం. వృక్ష దశలో లోహ రూప దశ నుండి వృక్ష రూప దశకు రావడంలోని లోహ రూప దశ లక్షణాలు, వృక్ష రూప దశకు రావడానికి సంబంధించిన క్రియాక్రమం నిక్షిప్తం. జంతుదశలో వృక్ష రూప దశ నుండి జంతు రూప దశకు రావడంలోని లోహ వృక్ష రూప దశల లక్షణాలు, జంతు రూప దశకు రావడానికి సంబంధించిన క్రియాక్రమం నిక్షిప్తం. మనిషి దశలో జంతు రూప దశ నుండి మనిషి రూప దశకు రావడంలోని లోహ వృక్ష జంతు రూప దశల లక్షణాలు, మనిషి రూప దశకు రావడానికి సంబంధించిన క్రియాక్రమం నిక్షిప్తం. అంటే ప్రతి జీవ దశలోను దాని ముందరి దశ/దశల లక్షణాలు నిక్షిప్తం. అలా మనిషి రూపానికి సంబంధించి, లోహ వృక్ష జంతు దశల లక్షణాలు మనిషి రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి.
3) సృష్టి లక్ష్యం మనిషికి సంబంధించింది అన్నపుడు, మిగతా జీవ దశల పరిస్థితి ఏమిటి?
4) అంటే సృష్టి లక్ష్యం మిగతా జీవ దశలకు సంబంధించదా అనే కదా ప్రశ్న. సృష్టిక్రమ వికాసంలో మనిషి దశలో లోహ వృక్ష జంతు దశల లక్షణాలు కేవలం ఉండడమే కాదు, ఆ దశల లక్షణాల ప్రభావం మనిషి వర్తనంలో కనుపిస్తూ ఉంటుంది. మనిషిలో మానవ కణాలు 10 శాతం మాత్రమే ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెప్పిన విషయం, అలాగే మనిషి ప్రస్తుతం జంతు మనిషి మాత్రమే అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన విషయం దీనికే నిదర్శనం. మనిషి మనిషిగా తయారు కావడంలో మనిషి లోని లోహ వృక్ష జంతు దశల లక్షణాల ప్రభావం నుండి విముక్తమై, ఆ దశల లక్షణాల మౌలికతను పుణికి పుచ్చుకోవలసిన అవసరం. అందుకుగాను మనిషిలో జరిగే ఆంతరిక ప్రక్రియల ప్రభావం బాహ్యంగా ఉన్న లోహ వృక్ష జంతు దశల జీవులలో చోటు చేసుకుంటుంది.
5) జీవ దశలకు, సృష్టి లక్ష్యానికి ఉన్న సంబంధం ఏమిటి?
6) మనిషి మనిషిగా తయారు కావడంలో లేదా ముందరి లోహ వృక్ష జంతు దశల లక్షణాల ప్రభావం నుండి విముక్తం కావడంలో యోగపరంగా మనిషిలో చోటు చేసుకునే ఆంతరిక ప్రక్రియల ప్రభావం బాహ్యంగా ఉన్న ఆ దశలలో చోటు చేసుకుని, సృష్టి నూతన విధానానికి అనుగుణంగానూ, శాశ్వత ప్రాతిపదికన సృష్టి మరియు సృష్టి మానవులు ఉనికిని కలిగి ఉండే లక్ష్య సిద్ధిలో మానవులకు సహాయకరంగా ఉండే విధంగానూ సృష్టి స్థాయి మార్పులు ఆ జీవ దశలలో పాదుకుని సృష్టి లక్ష్య సిద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయం గనుక, దీనిని కేవలం సూత్రప్రాయంగా మాత్రమే చెప్పుకునే అవకాశం.
సమాధానం నెం.056 - ప్రశ్న నెం.056 (18-8-2021) విషయం "జీవ దశలు".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm