మృత్యువును జయించడం అంటే ఏమిటి?
పారిభాషిక పదజాలంగా ఇది సమంజసమేనని అనిపిస్తుంది, కానీ మృత్యువు మీద విజయం సాధించడం అనే అర్థంలో మాత్రం కాదు. ఎందుకు అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే మృత్యువు నుండి కాపాడబడడం లేదా మరణాన్ని తప్పించుకోవడం అని మాత్రమే దానికి అర్థం చెప్పకోనవుతుంది గనుక. ఎవరయినా మరణించే పరిస్థితి నుండి కాపాడబడితే లేదా బ్రతికి బయటపడితే, మరణాన్ని జయించాడు అని మామూలుగా వాడే మాటయే దీనికి తార్కాణం. మరణాన్ని జయించడం అంటే ఒకసారి/కొన్నిసార్లు మరణం నుండి తప్పించుకోవడం మాత్రమే అవుతుంది తప్ప, అది మరణమే లేకుండా శాశ్వతంగా ఉండిపోగల పరిస్థితి కాదు కదా. ఇంకా ఎందుకు అంటే ప్రస్తుత సృష్టిలో లేదా సృష్టి విధానంలో అది అసంభవం గనుక. కనుక మృత్యువును జయించడం అనేది ప్రస్తుత సృష్టి పరిస్థితులలో కేవలం ఒకసారి/కొన్నిసార్లు మరణాన్ని తప్పించుకోవడం మాత్రమే అవుతుంది.
అంతేకాదు, నిశితంగా చెప్పుకోవాలి అంటే మరణాన్ని జయించడం అనే మాటయే ఒకరకంగా అసంబద్ధం. ఎందుకు అంటే జయించడం అనే మాటలో సృష్టి స్థాయి ప్రక్రియగా జరిగే మరణం మీద సృష్టించబడిన వ్యక్తి స్థాయి మనిషి విజయం సాధించడం అనే భావమే అంతర్లీనంగా ధ్వనిస్తుంది గనుక, సృష్టించబడిన వ్యక్తి స్థాయి మనిషి తన మేథస్సుతో సృష్టి/ప్రకృతి వాతావరణాన్ని తన జీవనానికి అనుకూలంగా మార్చుకోవడంలో ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీయడం మాత్రమే చేయగలుగుతున్నాడు తప్ప సృష్టిని మార్చడం మరియు సృష్టి మీద ఆధిపత్యాన్ని చెలాయించడం అసలయిన అర్థంలో చేయలేడు అలా చేయడం అసంభవం గనుక, వాతావరణాన్ని సాంకేతిక మేథో పరిజ్ఞానంతో తన జీవనానికి అనుకూలంగా మార్చుకోవడం అంటే ఏకంగా సృష్టిని మార్చడం మరియు సృష్టి మీద ఆధిపత్యాన్ని సాధించడం కానేరదు గనుక.
దీనిని యోగపరంగా చెప్పుకోవాలి అంటే మృత్యువును జయించడం లేదా మరణాన్ని తప్పించుకోవడం అనేది యోగంలో పనిచేసే ఆరు ఒప్పందాలలోని మొదటి ఒప్పందమైన'ప్లెంటీ ఆఫ్ లైఫ్' (సమృద్ధి జీవితం) కు మాత్రమే పరిమితమై ఉంది. యోగ సాధకులకు వారి జీవిత కాలాన్ని పెంచడం కోసం చేయబడిన ఏర్పాటుకు సంబంధించిందే ఈ ఒప్పందం. యోగ సాధకులకు సంచిత కర్మ (నిల్వలో ఉన్న కర్మ) ప్రారబ్ద కర్మ (ప్రస్తుత జన్మకు సంబంధించి అనుభవించవలసిన కర్మ) లోకి చొచ్చుకురావడం అనేది యోగ విధానంలో భాగం. యోగ ప్రక్రియలు జరిగిన దృష్ట్యా కొన్ని జన్మలు లేదా కొన్ని జన్మల కర్మ దాటిపోవడం అనేది కూడ యోగ విధానమే. ఒక సందర్భంలో మాస్టరుగారికి మూడు పంజర మార్పిడులు (వాడుక పదంగా మరణాలు) ఎడ్జస్టు చేయబడ్డాయి అనే మాస్టరుగారి డైరీలోని విషయమే ఇందుకు తార్కాణం. అంటే ఆ సంఘటనతో మూడు జన్మలు దాటబడ్డాయి లేదా మూడు జన్మల కర్మ అనుభవించబడింది అనేది ఆ సందర్భానికి అర్థం. స్వంత దేహం కాలిపోయిన అనుభూతి కలగడం ఒక జన్మ దాటిపోయింది అనడానికి ఒక సూచకమే. ఈ జన్మ/జన్మలు దాటిపోవడం అనేది యోగ సాధకుల విషయంలో ప్రస్తుతం ఒక సాధారణ విషయం అయిపోయింది. కాకపోతే, దానికి సంబంధించిన సూచనల అర్థం తెలియడానికి డెవలప్ అయిన గమనిక అవసరం.
ఈ మధ్యకాలంలో ఒక యోగ మిత్రునికి తాను చనిపోవడం ఖాయం అని అనిపించిన సందర్భంలో తనకు ఆంతరికంగా హిందీలో 'రుక్ జా మర్' (అంటే మరణమా, ఆగిపో) అని వినిపించి, పిమ్మట మరణ స్థితి నుండి మామూలు స్థితికి రావడం ఒక పంజర మార్పిడి (మరణం) లేదా జన్మ దాటిపోయింది అనడానికి ఒక సూచకమే. ఇటీవల ఒక యోగ మిత్రురాలికి తనలో ఒక సూక్ష్మం పోయి ఇంకొక సూక్ష్మం ప్రవేశించిన అనుభూతి కలగడం కూడ ఒక జన్మ దాటిపోయింది అని అనడానికి ఒక సూచకమే.
స్థూల అమృతత్వం అంటే ఏమిటి?
క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే స్థూల అమృతత్వం అంటే స్థూలానికి మరణించనితనం లేదా మరణించని లక్షణం/తత్త్వం రావడం, అంటే ఎన్నటికీ మరణించకుండా శాశ్వతంగా జీవించి ఉండడమే. ప్లెంటీ ఆఫ్ లైఫ్ అనే ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ (జీవితకాలం పొడిగించబడడం) అనే మాధ్యమిక స్థాయి యోగ లక్ష్యాన్ని మించిన మరియొక మాధ్యమిక స్థాయి యోగ లక్ష్యంగా దీనిని తీసుకోనవుతుంది. కానీ యోగ లక్ష్యం యొక్క అంతిమ స్థాయి ఏమిటి అనేది ప్రస్తుత సందర్భం కాదు. స్థూల అమృతత్వం ఎలా తెలియబడుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే బాగా డెవలప్ అయిన గమనిక స్థాయికి స్ఫురణగా (అంటే మానసిక/మేథో స్థాయి నుండి కాక ఆత్మిక స్థాయిల నుండి సమాచారంగా) అందడం మాత్రమే. అసాధారణమైన దీర్ఘ కాలం జీవించి ఉండడం దీనికి ఒకలాంటి ఋజువు/నిర్ధారణ అవుతుంది. అయినప్పటికీ పూర్తి స్థాయి నమ్మకం కలగకుండా దానికి సమాంతరంగా అపనమ్మకం కూడ కొనసాగుతూనే ఉంటుంది.
రెండూ ఒకటేనా? అయితే ఎలా?
కాదు. ఒకటి తాత్కాలికం, యోగ లక్ష్యం యొక్క ఒక మాధ్యమిక స్థాయి. రెండవది శాశ్వతం, మొదటి దానిని మించిన మరొక మాధ్యమిక స్థాయి.
కాదంటే, వాటిని భిన్నంగా చూపేది ఏమిటి లేదా వాటి మధ్యన ఉన్నది ఏమిటి?
మృత్యువును జయించడం లేదా మరణం దాటిపోవడం లేదా జీవితం పొడిగించబడడం అనేది తాత్కాలిక సంఘటనగా చోటుచేసుకుని డెవలప్ అయిన గమనిక స్థాయికి దాదాపుగా అర్థం తెలియని సూచనగా మాత్రమే తెలిసే అవకాశం ఉన్నటువంటిది. స్థూల అమృతత్వం అనేది శాశ్వత జీవనంతో ముడిపడి ఉండి, అర్థం తెలియని సూచనగా సైతం తెలిసే అవకాశం లేనటువంటిది.
సమాధానం నెం.001 - ప్రశ్న నెం.1 (3-5-2021) విషయం "మృత్యువును జయించడం, స్థూల అమృతత్వం".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm