సమాధానం నెం.003 - ప్రశ్న నెం.3 (5-5-2021) విషయం "యోగా ప్రాక్టీసు వలన ప్రయోజనం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.003 - ప్రశ్న నెం.3 (5-5-2021) విషయం "యోగా ప్రాక్టీసు వలన ప్రయోజనం".

Post by Katakam »

యోగా ప్రాక్టీసు వలన సాధకునికి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఏమిటి?

యోగా ప్రాక్టీసు వలన సాధకునికి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఏమిటి అంటే వస్తుతః గమనిక స్థాయి డెవలప్ కావడం. ఈ గమనిక స్థాయి యోగా ప్రాక్టీసు జరిగే సమయంలోని గమనికకు సంబంధించింది కాదు, ఎందుకు అంటే యోగా ప్రాక్టీసు సమయంలో దానికదే యాంత్రికంగా జరిగే ప్రాక్టీసు శరీరంలో కలిగే కదలికలు ప్రకంపనలు గమనించబడడం మాత్రమే గనుక. ఇక్కడ చెప్పుకునే గమనిక స్థాయి దైనందిన వ్యవహారాలలో సాధకులలో పనిచేసే గమనికకు సంబంధించింది.

ఎంతోమంది బాహాటంగా చెప్పే 'బాగుంటుంది' అనే మాటకు అర్థం ఏమిటి?

ఈ 'బాగుంటుంది' అనేది ఎవరెవరి మానసిక శారీరక పరిస్థితులకు సంబంధించింది గనుక, ఈ 'బాగుంటుంది' అనేది ఎవరికి వారికే తెలియవలసిన అవసరం. అది ఏమిటో నిర్దిష్టంగా తెలియని కారణం చేతనే, 'బాగుంటుంది' అని మాత్రమే చెప్పుకోబడుతుందని భావించడం ఎంతయినా సమంజసం.

కేవలం బాగుండడం కోసమేనా యోగా ప్రాక్టీసు చేయబడుతోంది.?

యోగా ప్రాక్టీసు దేనికోసం ఉద్దేశించబడిందో నిర్దిష్టంగా తెలిసినా తెలియకపోయినా, యోగా ప్రాక్టీసు చేయడం వలన 'బాగుంటుంది' అని చెప్పుకోవడం మాత్రమే జరుగుతోంది తప్ప, బాగుండడం కోసమే యోగా ప్రాక్టీసు చేయబడుతోంది అని చెప్పడానికి వీల్లేదు.

అనేక సంవత్సరాల తరబడి చేసే యోగా ప్రాక్టీసు అనంతరం యోగ సాధకునికి యోగా ప్రాక్టీసు వలన గుర్తించబడగలిగేలా ఒనగూడే లేదా ఒక రకంగా ఒనగూడవలసిన వ్యక్తిగత ప్రయోజనం ఏమిటి? అది గమనిక సంబంధం అని చెప్పుకోనయితే, నిర్దిష్టమైన ఆ ప్రయోజనం ఏమిటి?


పైన చెప్పుకున్నట్లుగా, ఆ ప్రయోజనం ఏమిటి అంటే గమనిక స్థాయి డెవలప్ కావడం. గుర్తించబడగలిగేలా అనే మాట వాడబడింది గనుక, దానికి మరికొంత వివరం చెప్పుకోవలసిన అవసరం. మామూలుగా పైపైన గమనించబడేవాటిలో ప్రస్తుతం తెలియని లోతులు తెలియడం యోగా ప్రాక్టీసు వలన సాధ్యపడుతుంది.
తెలుస్తూ నడిచే ఆలోచనలను మించి, తెలియని లోతులలో నడిచే ఆలోచనలు అందడమే దీనికి కారణం. ఇది గుర్తించబడగలిగేలా ఉండి, గమనిక స్థాయి డెవలప్ అయిన/అవుతున్న విషయం స్పష్టంగా తెలిసే అవకాశం.

మానసిక సంబంధమైన లోతులకు వెళ్ళడం యోగపరంగా ఎలా సంబంధించి ఉంది అనేది చెప్పుకోవలసిన అవసరమే. కె. కోర్సులో యోగ లక్ష్యపు ఒక మితిగా చెప్పబడిన "ఏకంకు చేరుకోవడానికి మనసును సంస్కరించడం".అనే ప్రక్రియకు ఇది సంబంధించి ఉంది. మనసును సంస్కరించడం అనేది యోగ సాధకుడు తానుగా చేసుకోగలిగేది కాదు, ఉన్నతతరమైన యోగా ప్రాక్టీసు వలన మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఎందుకు అంటే సమస్త గత జన్మల సమస్త ప్రభావం ప్రస్తుత మానసిక స్థితి మీద ఉంటుంది గనుక.

సంవత్సరాల తరబడి ప్రాక్టీసు చేస్తున్నా కూడ ఆలోచనలు ఇంకా తీవ్రంగా వస్తూనే ఉన్నాయి, గమనిక అంటే ఏదో ఇదమిత్థంగా తెలియడం లేదు అని సాధారణంగా భావించే పరిస్థితి ఉన్న నేపధ్యంలో, కె. కోర్సులోనే ఉన్న ఒక పరిష్కారాన్ని తెలుసుకుని, దానిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయడం "మనసును సంస్కరించడం" అనే ప్రక్రియను వేగవంతం చేయడానికి దారి తీస్తుందని చెప్పుకోవడం ఎంతయినా సమంజసం. కూర్చున్నప్పుడు జరిగే యోగా ప్రాక్టీసుకు దైనందిన కార్యక్రమంగా ఇది అదనం. కె. కోర్సులో వ్రాసి ఉన్న ఇది ఏమిటి అంటే "ఉదయం ప్రాక్టీసు మరియు రాత్రుళ్ళు నిద్రకు ఉపక్రమించబోయే ముందు నీవు నీ ఆలోచనలను తిరగ తోడుకోవడం అనే ఇది (ఈ చేసే ప్రక్రియ) మినహాయించి ప్రస్తుతానికి ఇంకేమీ అక్కర్లేదు" అని. ఇదే సింహావలోకనం. కూర్చున్నప్పుడు చేసే ఈ ప్రాక్టీసును ఉన్నతతరమైన ప్రాక్టీసుగా పరిగణించనగును. దీని అమోఘమైన ఫలితాలు అనుభవైకవేద్యం.
Post Reply