సమాధానం నెం.075 - ప్రశ్న నెం.075 (25-9-2021) విషయం "పుణ్యం, పాపం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.075 - ప్రశ్న నెం.075 (25-9-2021) విషయం "పుణ్యం, పాపం".

Post by Katakam »

1) పుణ్యం, పాపం అంటే ఏమిటి?

2) మనిషి యొక్క స్థూల జన్మకు సార్థకతను కలిగించే మోక్షాన్ని పొందడానికి చేయవలసిన మంచి పనుల ఫలితంగా వచ్చే కర్మయే పుణ్యం, దానికి ప్రతిగా చెడు పనుల ఫలితంగా వచ్చే కర్మయే పాపం అనేది సాంప్రదాయ ఆధ్యాత్మికవేత్తలు ఉద్ఘాటించి చెప్పిన, సామాన్య జనాలను నమ్మేలా చేసిన, సామాన్య జనాలు నమ్ముతున్న మానవ జీవిత విధానం. పుణ్య కర్మకు స్వర్గం లేదా భగవదైక్యం, పాప కర్మకు నరకం ప్రాప్తిస్తాయని నమ్మబలికిన జీవిత సారం.

3) పుణ్యం, పాపం పరానికి/ పరలోక వాసానికి మాత్రమే సంబంధించినవా?

4) ఈ ప్రశ్న లోనే అలా కాదు అనే సమాధానం అంతర్లీనంగా ధ్వనిస్తున్నా, నిర్ద్వంద్వంగా తెలియాలి అంటే సరయిన వివరణ అవసరమే కదా.

5) పుణ్య పాపాలు స్వర్గ నరకాలకు దారితీస్తాయి అనే ప్రతిపాదనకు భిన్నంగా, స్వర్గ నరకాలు అస్థూల సూక్ష్మ లోకాలు, స్థూలం లేకుండా అనుభవించడం అనేది అసంభవం, అసంబద్ధం గనుక, స్వర్గ నరకాలు భూమి మీదనే స్థూలంతో మాత్రమే అనుభవించవలసిన, అనుభవించదగిన స్థితులు మాత్రమే అనే కొందరు ఆధ్యాత్మికవేత్తల మరియు ఇతర విధాన వాదుల తీర్మానాలు మానవ సమాజానికి కొంత కనువిప్పు కలిగించినప్పటికీ, సుఖాలను కోరుకుంటూ కష్టాల నుండి తప్పించుకోవాలని భావించే మానవ నైజం అంతా మంచి మాత్రమే జరగాలి అనే బలీయ భావనకు పరిమితం అయిపోయిన సామాజిక పరిస్థితి నెలకొంది. దానికి మార్గాన్ని సుగమం చేయడానికేమో అన్నట్లుగా దైవానుసంధానకర్తలు సామాన్య మానవ సమాజాన్ని దేముళ్ళ అనుగ్రహాన్ని ప్రాప్తింపచేసుకునే దిశకు మళ్ళించారు, మళ్ళిస్తున్నారు. ఇందులో, పుణ్య సంపాదన పాప నివృత్తికి దారితీస్తుంది అనే భావన బలీయంగా చొప్పించబడిన దృష్ట్యా, మానవ సమాజంలో పాపభీతి కొరవడి, పురజనుల హితం అనే ముసుగులో పాప కార్యాలకు ఒడిగట్టడం సామాన్య సామాజిక ధర్మం అయిపోయింది.

6) పుణ్యమైనా, పాపమైనా దేనిని దానిని అనుభవించి తీరవలసిందే, తప్పించుకోవడం అసంభవం అనే ప్రాథమిక సూత్రం కొన్ని ఇతర స్వార్థ ప్రాథమ్యాల కారణంగా మరియు ప్రవచనాల ప్రచారం లేని కారణంగా పూర్తిగా మరుగున పడిపోయింది.

7) పుణ్యం, పాపం అనే వాటికి సృష్టి/ యోగ లక్ష్యం పరంగా అర్థం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?

8) అక్షరాల మూల భావాలకు వెళ్లి చెప్పుకుంటే, పుణ్యం అంటే నిశ్శబ్దపు కేంద్రతమ కేంద్రంలో ఉన్నది లేదా హృదయ కుహరాంతస్థంలో ఉన్నది లేదా తేలిక మాటలలో ప్రాణం యొక్క ఛాయగా/ అంశగా/ తరంగంగా మనిషిలో ఉన్నది. అదే మనిషిలోని దివ్యత్వం. ఆ దివ్యత్వాన్ని లేదా భగవత్తత్త్వపు అంశను లేదా అసలు నేనును తెలుసుకోవడమే పుణ్యం చేయడం, అసలైన మోక్షానికి అసలైన మార్గం.

9) కె. కోర్సులో 18-6-1910 న వ్రాయబడిన "నీవే ప్రాణాన్ని పూజిస్తున్నట్లుగా నీవుగా భావన చేసుకుంటూ అనుష్ఠానాన్ని ఆచరించడం" అనేది ఒకరకంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పై పేరాలో చెప్పిన పుణ్యం చేసుకోవడం/ సంపాదించుకోవడం అనే దానికే సంబంధించింది.

10) అలాగే, పాపం అంటే అంతరాంతరాళాల నిశ్శబ్దం నుండి బయటపడి శబ్ద రూపంగా పరబంచుకుపోయిన దానిని నిశ్శబ్దంగా -అంటే చేయడం లోని ఆంతరిక ఉద్దేశ్యాన్ని ఈషణ్మాత్రం బయటికి తెలియనీయకుండా- పాటించడం, తనలోని దివ్యత్వాన్ని తెలుసుకునే అవకాశాన్ని లుప్తం చేసుకుంటూ వర్తించడం.
Post Reply